Home
Gadgets

150Mbps స్పీడ్‌తో జియో నుంచి కొత్త 4జీ హాట్‌స్పాట్, రూ. 999కే, పూర్తి పీచర్లు మీ కోసం !

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో సరికొత్త విప్లవానికి తెరలేపింది. మార్కెట్లో ఇప్పటికే జియోఫోన్, అలాగే జియోఫై ద్వారా సంచలనం సృష్టించిన జియో ఈ సారి సరికొత్త గాడ్జెట్తో ముందుకొచ్చింది

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో సరికొత్త విప్లవానికి తెరలేపింది. మార్కెట్లో ఇప్పటికే జియోఫోన్, అలాగే జియోఫై ద్వారా సంచలనం సృష్టించిన జియో ఈ సారి సరికొత్త గాడ్జెట్ తో ముందుకొచ్చింది. జియో ప్యామిలీని దేశ వ్యాప్లంగా విస్తరించే భాగంగా జియోఫైతో దూసుకొచ్చింది. నేడు కొత్త జియోఫై 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్‌ డివైజ్‌ను 999 రూపాయలకు రిలయన్స్‌ జియో లాంచ్‌ చేసింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ హాట్‌స్పాట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఏడాది వారెంటీ, 150ఎంబీపీఎస్‌ వరకు డౌన్‌లోడ్‌ స్పీడుతో దీన్ని మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని అప్‌లోడ్‌ స్పీడు 50ఎంబీపీఎస్‌ వరకు ఉంది. 'డిజైన్డ్‌ ఇన్‌ ఇండియా' అనే ట్యాగ్‌తో ఈ డివైజ్‌ వచ్చింది.ఇప్పటికే జియో నుంచి వచ్చిన డోంగిల్ మార్కెట్లో దూసుకుపోతున్న తరుణంలో మరో కొత్త గాడ్జెట్ ఎలా ఉండబోతుందనేది టెక్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఒరిజినల్‌ జియోఫై మాదిరిగా కాకుండా

ఒరిజినల్‌ జియోఫై మాదిరిగా కాకుండా

కాగా ఒరిజినల్‌ జియోఫై మాదిరిగా కాకుండా గుడ్డు ఆకారంలో ఈ డోంగల్‌ ఉంది. పవర్‌ ఆఫ్‌/ఆన్‌ చేయడానికి ఫిజికల్‌ బటన్లను, డబ్ల్యూపీఎస్‌, బ్యాటరీ కోసం నోటిఫికేషన్‌ లైట్స్‌ను ఇది కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్‌వర్క్‌ కనెక్ట్‌ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్‌ అనుమతి ఇస్తుంది.

ఒక్కసారి కనెక్ట్‌ అయితే

ఒక్కసారి కనెక్ట్‌ అయితే

ఈ డివైస్‌లో ఒక్కసారి కనెక్ట్‌ అయితే స్మార్ట్‌ఫోన్లలోని జియో 4జీ వాయిస్‌ యాప్‌తో హెచ్‌డీ వాయిస్‌, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్‌ చేస్తుంది. అంతేకాక ఏఎల్‌టీ3800 ప్రాసెసర్‌తో ఇది రూపొందింది. ఎఫ్‌డీడీ బ్యాండ్‌ 3, బ్యాండ్‌ 5, టీడీడీ-బ్యాండ్‌ 40లను ఇది సపోర్టు చేస్తుంది.

64జీబీ వరకు..

64జీబీ వరకు..

ఈ కొత్త జియోఫైలో స్టోరేజ్‌ను 64జీబీ వరకు విస్తరించేందుకు మైక్రోఎస్డీ కార్డు స్లాట్‌ కూడా ఉంది. 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఇది ప్యాక్‌ అయింది. అయితే ఈ కొత్త మోడల్‌ ఇప్పటి వరకు జియో.కామ్‌లో లిస్టు అవలేదు.

పాత జియోఫై డివైజ్‌పై ..

పాత జియోఫై డివైజ్‌పై ..

అయితే రిలయన్స్‌ జియో ఇటీవలే తన పాత జియోఫై డివైజ్‌పై రూ.3,595 విలువైన ప్రయోజాలను అందించనున్నట్టు ప్రకటించింది. అనంతరం వెంటనే ఈ కొత్త జియోఫై మోడల్‌నూ రిలయన్స్‌ ఆవిష్కరించింది.

Best Mobiles in India

English summary
New JioFi 4G LTE Hotspot variant with 150Mbps download speed launched at Rs 999 More news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X