ఈ డ్రైవ్ కెపాసిటీ 1,00,000 జీబీ, 20 వేల సినిమాలు స్టోర్..

Written By:

గత నెలలో శాంసంగ్ రికార్డు స్థాయి స్టోరేజ్ 30 టీబితో 2.5 ఇంచ్ డ్రైవ్ ని బహిర్గతం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాని కన్నా ఎక్కువ రెట్లు స్టోరేజ్ తో మార్కెట్లోకి మరో స్టోరేజ్ డ్రైవ్ దూసుకురానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కెపాసిటీ కలిగిన సాలిడ్ స్టేట్ డ్రైవ్ (ఎస్‌ఎస్‌డీ)ని నింబస్ డేటా అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. డేటా ఎగ్జాడ్రైవ్ డీసీ100 పేరిట విడుదలైన ఈ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ 100టీబీ. అంటే.. 1,00,000 జీబీ అన్నమాట. ఇది 3.5 ఇంచ్ SSD drive.అయితే ప్రస్తుతం ఈ డ్రైవ్ మార్కెట్‌లోకి విడుదల కాలేదు. కానీ పలువురు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఆ సంస్థ దీన్ని విక్రయించి పరీక్షిస్తున్నది.

ఈ డ్రైవ్ కెపాసిటీ 1,00,000 జీబీ, 20 వేల సినిమాలు స్టోర్..

మరో రెండు రెండు నెలల్లో ఈ డ్రైవ్ వినియోగదారులందరికీ మార్కెట్‌లో లభ్యం కానుంది. ఇక ఈ డ్రైవ్‌లో హెచ్‌డీ క్వాలిటీ ఉన్న దాదాపు 20వేల సినిమాలను స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే 2 కోట్ల పాటలు సేవ్ చేసుకోవచ్చు. 500 ఎంబీ పర్ సెకండ్ స్పీడ్‌తో ఈ డ్రైవ్‌లోకి డేటాను కాపీ చేయవచ్చు. లేదా అదే స్పీడ్‌తో దాన్నుంచి వేరే డ్రైవ్‌కు డేటాను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. సాధారణ హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల కన్నా 100 రెట్లు ఎక్కువ వేగంతో ఈ డ్రైవ్ పనిచేస్తుందని నింబస్ డేటా వెల్లడించింది. ExaDrive DC seriesలో 50TB, 100TB డ్రైవ్ లు వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. కాగా దీని ధర వివరాలను మాత్రం ప్రకటించలేదు.

English summary
Nimbus Data launches world's largest SSD with 100 terabyte capacity More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot