Noise 4 Wireless 70 గంటల ప్లేటైంతో నాయిస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు.. ఫీచర్‌లు, ధర, సేల్ వివరాలు..!!
ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ నాయిస్ నుంచి నాయిస్ 4 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ను (Noise 4 Wireless Headphones) విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హెడ్‌ఫోన్ AI ENC ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మరియు సింగిల్ ఛార్జింగ్‌తో 70 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని పొందవచ్చు. ఈ హెడ్‌ఫోన్ కార్బన్ బ్లాక్, కామ్ బీజ్ రంగుల్లో లభిస్తాయి. నాయిస్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు.
నాయిస్ 4 వైర్‌లెస్ హెడ్‌ఫోన్ 40mm డ్రైవర్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ హెడ్‌ఫోన్ మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ హెడ్‌ఫోన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీ పైన పనిచేస్తుంది. ఫలితంగా క్రిస్టల్ క్లియర్ కాలింగ్ అనుభూతిని పొందవచ్చని చెబుతోంది.

10 నిమిషాల ఛార్జింగ్‌తో 300 నిమిషాల ప్లేటైం : నాయిస్ కొత్త హెడ్‌ఫోన్ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేయడం ద్వారా గరిష్ఠంగా 70 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని పొందవచ్చని తెలిపింది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 300 నిమిషాల ప్లేటైం ను పొందవచ్చని నాయిస్ చెబుతోంది.
దీంతోపాటు ఈ హెడ్‌ఫోన్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌లను సులభంగా కనెక్ట్ చేసేందుకు వీలుందని తెలిపింది. మరియు బ్లూటూత్ 5.4 పైన పనిచేస్తుంది. IPX5 రేటింగ్‌తో చెమట మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.

ఈ నాయిస్ 4 వెర్‌లెస్ హెడ్‌ఫోన్ ధర రూ.2,499 గా ఉంది. ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం కానుంది. gonoise.com మరియు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. హెడ్‌ఫోన్ ఆకట్టుకొనే ఫీచర్‌లతో 70 గంటల ప్లేబ్యాక్ టైం సహా డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఆకట్టుకొనే అవకాశం ఉంది.
*నాయిస్ నుంచి గత నెలలో నాయిస్ ఫిట్ ఆరిజన్ స్మార్ట్‌వాచ్ విడుదల అయింది. విడుదల సమయంలో వాచ్ ధర రూ.6,499 గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, మొజాయిక్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, క్లాసిక్ బ్రౌన్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.
ఈ నాయిస్ ఫిట్ ఆరిజన్ 1.46 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. EN1 చిప్‌సెట్ ఆధారంగా నెబ్యూలా UI పైన పనిచేస్తుంది. ఈ వాచ్‌లో అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంటుంది. హృదయ స్పందన రేటు, SPO2 స్థాయి, నిద్ర, ఒత్తిడి సహా రుతుక్రమాన్ని ట్రాక్ చేసే ఫీచర్‌లున్నాయి. నాయిస్ యాప్‌ఫిట్ ద్వారా వివరాలను పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








