రూ.2500కే 49dB ANC, LHDC నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6.. అదిరిపోయే ఫీచర్లు!!
Noise Air Buds Pro 6: నాయిస్ కంపెనీ మరో అదిరిపోయే ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 (Noise Air Buds Pro 6). ఇవి చూడటానికి చాలా ప్రీమియంగా ఉండటమే కాదు, ఫీచర్లు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ధర చూస్తే ఎవ్వరైనా కొనాలనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చిన నాయిస్ ఎయిర్ బడ్స్ 6కి ఇది అప్‌డేట్ వర్షన్. ప్రో 6లో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుందంట.
* టైటానియం డ్రైవర్లు, LHDC సపోర్ట్‌తో అదిరిపోయే సౌండ్
నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6లో 12.4mm టైటానియం డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. వీటితో పాటు N52 నియోడైమియం మాగ్నెట్స్, కాపర్ కాయిల్స్ కూడా ఉండటంతో సౌండ్ చాలా పవర్‌ఫుల్‌గా, క్లియర్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇందులో హైలెట్ ఫీచర్ ఏంటంటే LHDC కోడెక్ సపోర్ట్.

దీని వల్ల 24-బిట్ హై-రిజల్యూషన్ ఆడియో వినొచ్చు. మామూలు SBC కోడెక్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ డేటాని ట్రాన్స్‌మిట్ చేస్తుంది. అంటే పాటలు వినేవాళ్లకు ఇది నిజంగా పండగే. సౌండ్ క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా చాలా రిచ్‌గా, లాస్‌లెస్‌గా ఉంటుందన్నమాట.
* బయట శబ్దాలకు చెక్ పెట్టేస్తుంది..
ఈ ఇయర్ బడ్స్‌లో 49dB వరకు హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది. మీరు బస్సులో వెళ్తున్నా, ఆఫీసులో పనిచేస్తున్నా, లేదా ఇంట్లో రిలాక్స్‌గా ఉన్నా.. బయట శబ్దాలు ఏమీ వినిపించకుండా ఇది చూసుకుంటుంది. దాంతో మంచి ఆడియో ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.
అంతేకాదు, క్వాడ్-మైక్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సిస్టమ్ కూడా ఉంది. దీనివల్ల మీరు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు బయట ఎంత శబ్దం ఉన్నా మీ వాయిస్ మాత్రం క్లియర్‌గా అవతలి వాళ్లకు వినిపిస్తుంది. అంటే రద్దీ ప్రదేశాల్లో కూడా సంభాషణలు స్పష్టంగా సాగుతాయి.
* బ్యాటరీ లైఫ్‌కు తిరుగులేదు..
నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 గంటల వరకు పాటలు వినొచ్చు. ఛార్జింగ్ కేస్‌తో కలిపి చూస్తే మొత్తం 43 గంటల వరకు వాడుకోవచ్చు. ఇంకా ఇందులో ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ కూడా ఉంది.
అంటే కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. మళ్లీ 2.5 గంటలు (150 నిమిషాలు) వాడుకోవచ్చు. ఇక ఛార్జింగ్ కేస్ కూడా చూడటానికి చాలా స్టైలిష్‌గా, మెటలైజ్డ్ పెయింట్ ఫినిషింగ్‌తో ప్రీమియంగా ఉంది. ఇందులో స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.. కనెక్టివిటీ కూడా ఫాస్ట్‌గా జరిగిపోతుంది.
* స్మార్ట్ ఫీచర్లు
నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6లో బ్లూటూత్ 5.3 ఉంది. ఇది డ్యూయల్-డివైజ్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా గూగుల్ ఫాస్ట్ పెయిర్, ఇన్-ఇయర్ డిటెక్షన్, హైపర్ సింక్ టెక్నాలజీ, 50ms లో-లేటెన్సీ మోడ్ లాంటి స్మార్ట్ ఫీచర్లు చాలా ఉన్నాయి.
గేమింగ్ ఆడేవాళ్లకు, వీడియోలు చూసేవాళ్లకు ఈ లో-లేటెన్సీ మోడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. వర్షంలో తడిసినా, చెమట పట్టినా పాడవ్వకుండా IPX5 రేటింగ్ కూడా ఉంది.
* ధర, రంగులు,ఎప్పుడు కొనుక్కోవచ్చు?
నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 ధర వచ్చేసి రూ.3,499. ఇవి ఏప్రిల్ 9 నుంచి Amazon.in వెబ్‌సైట్‌తో పాటు నాయిస్ వెబ్‌సైట్‌లో కూడా అమ్మకానికి వస్తాయి. స్లేట్ బ్లాక్ (Slate Black), నింబస్ గ్రే (Nimbus Grey), పెటల్ పింక్ (Petal Pink) కలర్స్‌లో ఇవి లభిస్తాయి. ఇప్పటికే నాయిస్ వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి.
కేవలం రూ.499 పెట్టి ప్రీ-ఆర్డర్ చేసుకుంటే.. రూ.999 డిస్కౌంట్ కూపన్ ఇస్తారు. అంటే సేల్ రోజున వీటిని రూ.2,500కే కొనుక్కోవచ్చు. ప్రీ-ఆర్డర్ చేసుకున్న వాళ్లకు అదనంగా మరో రూ.1,000 వరకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందులో భాగంగా దివా 2 స్మార్ట్‌వాచ్ కొంటే రూ.700 డిస్కౌంట్ ఇస్తారు.


Click it and Unblock the Notifications








