Home
Gadgets

120 గంటల బ్యాటరీ లైఫ్‌, నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్టుతో హెడ్‌ఫోన్స్‌ విడుదల..!

ప్రముఖ ఆడియో ఉ‌త్పత్తుల సంస్థ నాయిస్‌ భారత్‌ మార్కెట్‌ మార్కెట్‌ లో తాజాగా హెడ్‌ఫోన్‌ ను లాంచ్ చేసింది. తాజాగా నాయిస్‌ ఎయిర్‌వేవ్ మ్యాక్స్ 6 పేరుతో హెడ్‌ఫోన్‌ ను ( Noise AirWave Max 6 Headphone ) తీసుకొచ్చింది. గతంలో లాంచ్ అయిన ఎయిర్‌వేవ్‌ మ్యాక్స్‌ 5 మోడల్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా విడుదల చేశారు. మ్యాక్స్‌ 6 హెడ్‌ఫోన్‌ సింగిల్‌ ఛార్జింగ్‌ తో ఏకంగా 120 గంటల బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుందని నాయిస్ సంస్థ చెబుతోంది. ANC సపోర్టు కూడా ఉంది.

డ్యూయల్‌ డ్రైవర్లు, నాయిస్‌ క్యాన్సిలేషన్‌ :
నాయిస్‌ హెడ్‌ఫోన్స్‌ 12mm, 40mm తో కూడిన డ్యూయల్‌ డ్రైవర్‌ లను కలిగి ఉంది. స్పేషియల్‌ ఆడియో, Hi-Res ఆడియో, LDAC ను సపోర్టు చేస్తుంది. 45dB అడాప్టివ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ (ANC) ను సపోర్టు చేస్తుంది. చుట్టుపక్కల వాతావరణం ఆధారంగా ఆటోమేటిక్‌ గా వాయిస్‌ ను సర్దుబాటు చేస్తుంది.

Noise Airwave max 6 price in india

స్పేషియల్‌ 3D ఆడియో వల్ల మ్యూజిక్‌, సినిమాలు, గేమింగ్ సమయంలో థియేటర్‌ ఆడియో తరహా అనుభూతి కలుగుతుంది. క్రియేటర్లు, గేమర్లు, ఎక్కువ సమయం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూసే వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ కాలం వినియోగించిన అనంతరం కూడా కంపర్ట్‌ గానే అనిపిస్తుంది.

బ్లూటూత్‌ 6.0 :
ఈ ఎయిర్‌వేవ్‌ మ్యాక్స్ 6 హెడ్‌ఫోన్‌ విండ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్టుతో 5 మైక్రోఫోన్‌ లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 6.0 ఫీచర్‌ ను కలిగి ఉంది. ఫలితంగా డివైజ్‌ లతో సులభంగా కనెక్ట్‌ చేసుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆండ్రాయిడ్‌, iOS డివైజ్‌ లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Noise Airwave max 6 price in india

120 గంటల బ్యాటరీ లైఫ్‌ :
నాయిస్‌ ఎయిర్‌వేవ్‌ మ్యాక్స్ 6 హెడ్‌ఫోన్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే.. 120 గంటల వరకు వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ను ఆన్‌ చేసి ఉపయోగిస్తుంటే మాత్రం 80 గంటల బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుందని తెలిపింది.

ఈ హెడ్‌ఫోన్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది. అయితే కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ తో 15 గంటల ప్లే బ్యాక్‌ టైమ్‌ ను అందిస్తుందని నాయిస్‌ తెలిపింది. USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది.

హెడ్‌ఫోన్స్ ధర, సేల్‌ వివరాలు :
నాయిస్‌ ఎయిర్‌వేవ్‌ మ్యాక్స్‌ 6 హెడ్‌ఫోన్స్‌ ధర రూ.6999 గా ఉంది. డూన్‌ వైట్‌, కోబాల్ట్‌ బ్లూ, ఫారెస్ట్‌ గ్రీన్‌, కార్బన్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. అయితే ప్రస్తుతం నాయిస్‌ ఇండియా వెబ్‌సైట్‌ లో రూ.5999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ప్రముఖ రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Noise Airwave max 6 headphones launched in india with 120 hours of battery life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X