రూ.999 కే నాయిస్ ఇయర్‌బడ్స్.. 50 గంటల ప్లే టైం, ENC ఫీచర్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Noise Buds F1 TWS Earbuds : భారత్ మార్కెట్‌లో అన్ని రకాల ఇయర్‌బడ్స్ కు భారీ డిమాండ్ ఉంది. దీంతో అనేక సంస్థ వివిధ ధర సెగ్మెంట్స్‌లో ఇయర్‌బడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ నాయిస్ వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలో TWS ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. నాయిస్ బడ్స్ F1 పేరుతో TWS బడ్స్‌ను తీసుకొచ్చింది. ఈ బడ్స్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 50 గంటల ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు.
నాయిస్ బడ్స్ F1 బడ్స్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ నాయిస్ బడ్స్ 11mm డ్రైవర్స్‌ను కలిగి ఉంటాయి. మరియు సౌండ్ ప్రొఫైల్‌ను కస్టమైజ్ చేసుకొనేందుకు వీలుగా EQ మోడ్స్‌ను సపోర్టు చేస్తాయి. గేమింగ్ కోసం ప్రత్యేకంగా Low latency Mode ను కలిగి ఉంది.

ఈ బడ్స్ క్వాడ్ మైక్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ENC (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) సపోర్టును కలిగి ఉంది. ఈ ఫీచర్ అవసరం లేని బ్యాగ్రౌండ్ సౌండ్స్‌ను నియంత్రిస్తుంది. ఫలితంగా ఈ బడ్స్‌ను వినియోగించే సమయంలో మెరుగైన అనుభూతిని పొందే అవకాశం ఉంది.
నాయిస్ బడ్స్ F1 బడ్స్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 50 గంటల ప్లే టైం ను పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ కారణంగా కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 150 నిమిషాల ప్లే టైంను పొందవచ్చు. వెయ్యి రూపాయల ధరలో మెరుగైన ప్లేటైంగా పరిగణించవచ్చు.
కనెక్టివిటీ పరంగా నాయిస్ TWS బడ్స్ బ్లూటూత్ 5.3 పైన పనిచేస్తాయి. Hypersync ఫీచర్ తో వేగంగా కనెక్ట్ చేయవచ్చు. మీరు ఆఖరిగా కనెక్ట్ చేసిన డివైజ్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ బడ్స్ IPX5 రేటింగ్‌తో వాటర్ మరియు చెమట నుంచి రక్షణ కల్పిస్తుంది.
నాయిస్ బడ్స్ F1 బడ్స్ ధర, సేల్ వివరాలు :
నాయిస్ బడ్స్ F1 బడ్స్ ధర రూ.999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ ధరకు అందిస్తోంది. అయితే తర్వాత ఈ ధర పెరిగే అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచే ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ TWS (ట్రూ వైర్‌లెస్ స్టీరియో) బడ్స్ ట్రూ పర్పుల్, మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్, కామ్ బీజ్ రంగుల్లో లభిస్తాయి. నాయిస్ బడ్స్ F1 బడ్స్ ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
నాయిస్ మాస్టర్ బడ్స్ :
భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నాయిస్ మాస్టర్ బడ్స్‌ను విడుదల చేసింది. బాస్ ట్యూనింగ్‌తో 12.4mm టైటానియం డ్రైవర్స్‌ను కలిగి ఉంది. 6 మైక్రోఫోన్ సిస్టమ్‌ను ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) తోపాటు హై రిజల్యూషన్ బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ కోసం LHDC 5.0 ఆడియో కోడిక్ సపోర్టు కలిగి ఉంది.
ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 44 గంటల పాటు (ANC Off) బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అయితే ANC యాక్టివ్‌లో ఉంటే మాత్రం 34 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. కేవలం 10 నిమిషాల పాటు ఛార్జింగ్‌తో 6 గంటల ప్లే బ్యాక్ టైంను పొందవచ్చు. నాయిస్ మాస్టర్ బడ్స్ ధర రూ.7999 గా ఉంది.
గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.


Click it and Unblock the Notifications








