Home
Gadgets

ధర రూ.999 కే 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో Noise ఇయర్‌బడ్స్‌.. సేల్‌ ప్రారంభం..!

ప్రముఖ ఆడియో ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ ల తయారీ సంస్థ నాయిస్‌ భారత్‌ మార్కెట్‌ లో అత్యంత తక్కువ ధరకే TWS ఇయర్‌బడ్స్‌ను (Noise Buds Trooper TWS Launched in india) విడుదల చేసింది. నాయిస్‌ బడ్స్ Trooper పేరుతో లాంచ్‌ చేసింది. భారత్‌ మార్కెట్‌లో ఈ బడ్స్‌ ధర రూ.999 గా ఉంది. గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది.

నాయిస్‌ బడ్స్‌ ట్రూపర్‌ ఇయర్‌బడ్స్‌ 13mm డ్రైవర్‌ లను కలిగి ఉంది. మెరుగైన బాస్‌, ఆడియోను అందిస్తుందని సంస్థ చెబుతోంది. మెరుగైన గేమింగ్‌ అనుభూతి కోసం 40ms అల్ట్రా లో లేటెన్సీ ను కలిగి ఉంది. దీంతోపాటు ఎన్విరాన్‌మెంట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీతో (ENC) కూడిన క్వాడ్‌ మైక్‌లతో అందుబాటులో ఉంది.

Noise buds Trooper TWS Earbuds sale

ఈ ఇయర్‌బడ్స్‌ బ్రీతింగ్ LED లతో కూడిన విజర్‌ డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు IPX5 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది. ఫలితంగా గేమింగ్‌ మరియు వర్కౌట్స్‌ సమయాల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా ఈ నాయిస్‌ బడ్స్‌ ట్రూపర్‌ ఇయర్‌బడ్స్‌ను వినియోగించుకోవచ్చు.

నాయిక్‌ బడ్స్‌ ట్రూపర్‌ TWS బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి.. 45 గంటలపాటు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ బడ్స్‌ instacharge ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 150 నిమిషాల పాటు ప్లేటైం ను పొందవచ్చని నాయిస్‌ తెలిపింది.

Noise buds Trooper TWS Earbuds sale

ఈ నాయిస్‌ కొత్త TWS బడ్స్ బ్లూటూత్‌ V5.3 వెర్షన్‌ మరియు Hypersync టెక్నాలజీ ఆధారంగా కనెక్ట్‌ అవుతుంది. ఈ బడ్స్‌ వన్‌స్టెప్‌ కనెక్షన్‌ ఫీచర్‌ ను కలిగి ఉంటుందని.. ఫలితంగా అత్యంత తక్కువ సమయంలో మరియు సలభంగా కనెక్ట్‌ చేయవచ్చని సంస్థ చెబుతోంది. గేమింగ్‌ సమయంలో ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

నాయిక్‌ బడ్స్‌ ట్రూపర్‌ ఇయర్‌బడ్స్‌ ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో ధర రూ.999 కు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. నాయిస్‌ అధికారిక వెబ్‌సైట్‌ gonoise.com, ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. స్ట్రోమ్‌ గ్రే, నైట్‌ బ్లాక్‌, మైటీ వైట్‌, ఫైరీ యెల్లో రంగుల్లో లభిస్తుంది.

Noise buds Trooper TWS Earbuds sale

నాయిస్‌ నుంచి గత నెలలో మహిళల కోసం ప్రత్యేకంగా నాయిస్‌ఫిట్‌ దివా 2 పేరుతో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌ మహిళల కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్‌డ్‌ ఫీమేల్‌ హెల్త్‌ సూట్‌ను కలిగి ఉంటుంది. SpO2 ట్రాకింగ్‌, ఒత్తిడి, స్లీప్‌ ట్రాకింగ్‌, హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

నాయిస్‌ఫిట్‌ దివా 2 స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 100 స్పోర్ట్‌ మోడ్స్‌, వాచ్‌ ఫేస్‌లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సింగిల్‌ ఛార్జింగ్ ద్వారా 4 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ప్రారంభ ధర రూ.4,499 గా ఉంది.

Best Mobiles in India

English summary
Noise buds Trooper TWS Earbuds launched with 45 hours battery life in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X