ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు, స్మార్ట్ గెశ్చర్స్, ఎమర్జెన్సీ SOS తో నాయిస్ స్మార్ట్‌వాచ్‌లు విడుదల..!
ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ నాయిస్ నుంచి ఇవాళ స్మార్ట్‌వాచ్‌లు విడుదల అయ్యాయి. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ పేరుతో (Noise ColorFit Pro 6 Series) లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో కలర్‌ఫిట్ ప్రో 6 మరియు కలర్‌ఫిట్ ప్రో 6 మ్యాక్స్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ సిరీస్ అనేక గెశ్చర్స్ ను సపోర్టు చేస్తుంది. రేపటి నుంచి ప్రీ ఆర్డర్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నాయిస్ తెలిపింది.
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 (Noise ColorFit Pro 6 Smartwatch) స్మార్ట్‌వాచ్ 1.85 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. అదే మ్యాక్స్ మోడల్ 1.96 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ రెండు వాచ్‌లు నాయిస్ EN2 చిప్‌సెట్ సహా నెబులా UI 2.0 తో పనిచేస్తుంది.

ఈ సిరీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఫలితంగా నిద్ర నాణ్యత, వర్కౌట్ డేటా ఆధారంగా ఆరోగ్య సలహాలు అందిస్తుందని నాయిస్ తెలిపింది. ఈ స్మార్ట్‌వాచ్‌లు అనేక సేఫ్టీ ఫీచర్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఎమర్జెన్సీ SOS మరియు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఫీచర్ ను కలిగి ఉంది.
స్మార్ట్ గెశ్చర్స్, బ్యాటరీ లైఫ్ :
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ అనేక స్మార్ట్ గెశ్చర్స్ ను సపోర్టు చేస్తుంది. వాచ్‌ను షేక్ చేయడం ద్వారా కాల్స్‌ను రిజెక్ట్ చేయడం, వాచ్ స్క్రీన్‌ను కవర్ చేయడం ద్వారా మ్యూట్ చేయవచ్చు. స్మార్ట్‌వాచ్‌లను ఒక్కసారి ఛార్జింగ్ చేసి 7 రోజుల వరకు వినియోగించుకోవచ్చు.

బేస్ వేరియంట్ అనేక AI వాచ్ ఫేసెస్‌ను కలిగి ఉంటుంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ప్రో మోడల్ (Noise ColorFit Pro 6 max Smartwatch) 100 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. మరియు బిల్ట్ ఇన్ GPS ను కలిగి ఉంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ ధర, సేల్ :
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 స్మార్ట్‌వాచ్ మాగ్నటిక్ బ్లూ, మాగ్నటిక్ లైట్, ఐవరీ గోల్డ్, జెట్ బ్లాక్, ఐస్ బ్లూ, వినియార్డ్ బ్రౌన్, ఆర్కిటిక్ బ్లూ, ప్రిస్మాటిక్ మల్టీ కలర్ వేరియంట్స్‌లో ఉంది. ఈ కలర్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5,999 గా ఉంది. అదే మెష్ స్ట్రాప్ ప్రారంభ ధర రూ.6,499 గా ఉంటుంది. రోజ్ గోల్డ్ లింక్, షాంపైన్ గోల్డ్ లింక్ రంగుల్లో లభిస్తుంది.
అదే మ్యాక్స్ మోడల్ ప్రారంభ ధర రూ.7,499 గా ఉంది. మాగ్నటిక్ గ్రీన్ టైటానియం, సిగ్నేచర్ బ్రౌన్, సిలికాన్ జెట్ బ్లాక్, సిలికాన్ బ్లూ టైటానియం, లెదర్ బ్రౌన్ టైటానియం, లెదర్ కాపర్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే మెటల్ స్ట్రాప్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ.7999 గా ఉంటుంది. ప్యూర్ టైటానియం, క్రోమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లను జనవరి 22 నుంచి నాయిస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ ఆర్డర్ చేయవచ్చు. మరియు నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌లో జనవరి 27వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. జనవరి 29 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications








