Just In
- 4 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 6 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 9 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- 11 hrs ago
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- News
ప్రధాని మోడీ వైస్రాయ్ అవుతారా? లేక గవర్నర్లను ఎత్తేస్తారా?: కేటీఆర్ విమర్శల దాడి
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Movies
SSMB28: మహేశ్ బాబు క్రేజ్.. భారీ ధరకు సినిమా నైజాం రైట్స్.. దిల్ రాజు అన్ని కోట్లు పెట్టాడా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Noise కంపెనీ నుంచి అందుబాటు ధరలో మరో కొత్త SmartWatch విడుదల!
Noise కంపెనీ రోజురోజుకు భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల్ని విస్తరింపజేస్తోంది. తాజాగా మరో సరికొత్త మోడల్ SmartWatchను విడుదల చేసింది. అఫర్డబుల్ ధరలో Noise ColorFit Pulse 2 స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు దారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ వాచ్ లార్జ్ స్క్రీన్‌తో పాటు, అద్భుతమైన హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ Noise ColorFit Pulse 2 పలు అప్‌గ్రేడ్‌లతో గతేడాది ఈ కంపెనీ నుంచి విడుదలైన ColorFit Pulse మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చింది. అంతేకాకుండా ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.

Noise ColorFit Pulse 2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 2 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×286 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.8-అంగుళాల స్క్వేర్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ పాత మోడల్ కంటే 40శాతం పెద్దగా ఉంటుంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 50 పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు.

అంతేకాకుండా కాల్ రిజెక్షన్, ఫైండ్ మై ఫోన్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ iOS 9 మరియు ఆండ్రాయిడ్ 6 అంతకంటే పైన ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన డివైజులకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది 5.1 బ్లూటూత్ వర్షన్‌ను కలిగి ఉంది. మరోవైపు ఈ స్మార్ట్ వాచ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP68 సౌకర్యాన్ని కలిగి ఉంది. దీనికి 240mAh
సామర్థ్యం గల బ్యాటరీ ని అందిస్తున్నారు. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 7 రోజుల పాటు కంటిన్యూ వినియోగాన్ని అందిస్తుంది. దీన్ని ఫుల్ చార్జ్ చేయడానికి 1.5 గంట పడుతుంది.

Noise ColorFit Pulse 2 ధర:
ఈ Noise ColorFit Pulse 2 ధర విడుదల ఆఫర్ సందర్భంగా కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.1,999 కొనుగోలు దారులకు అందుబాటులో ఉంది. జెట్ బ్లాక్, స్పేస్ బ్లూ, మిస్ట్ గ్రే, ఒలివ్ గ్రీన్, రోస్ పింక్ కలర్లలో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. నాయిస్ వెబ్‌సైట్ మరియు అమెజాన్ ద్వారా రూ.2,999 వీటిని కొనుగోలు చేయవచ్చు. ధరల పరంగా చూస్తే ఇది ఫైర్ బోల్ట్ నింజా 2 స్మార్ట్ వాచ్ కు పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Noise కంపెనీ ఇటీవలె భారత మార్కెట్లో మరో రెండు మోడల్ స్మార్ట్ వాచ్‌లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 మాక్స్, నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మోడల్స్‌ను భారత మార్కెట్లోకి ఈ నెల మొదటి వారంలో విడుదల చేసింది.

Noise Colorfit Pro 4 Max స్పెసిఫికేషన్స్:
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 మాక్స్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×258 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.80-అంగుళాల TFT LCDతో వస్తుంది. ఈ డిస్ప్లే 40Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది మీరు కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు కనుగొనవచ్చు, కానీ అది ధరను సమర్థిస్తుంది. Noise ColorFit Pro 4 Max యొక్క డిస్‌ప్లే Noise ColorFit 3 కంటే 33 శాతం పెద్దదని నాయిస్ పేర్కొంది. Noise ColorFit Pro 4 Max 150కి పైగా ఎంపికలతో మరియు అనుకూలీకరణకు మద్దతుతో వాచ్ ఫేస్‌లతో వస్తుంది. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మాక్స్ ఇండియాలో రూ.3,999 ధర వద్ద లభిస్తుంది.
Noise Colorfit Pro 4:
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మోడల్ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్ కొంచెం సరసమైన ధరను కలిగి ఉంటుంది. దీని ధర రూ.3,499 కలిగి ఉంటుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 356×400 పిక్సెల్ మరియు మెరుగైన 60Hz రిఫ్రెష్ రేట్‌తూ కూడిన 1.72-అంగుళాల TFT LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ColorFit Pro 3 యొక్క డిస్‌ప్లే పరిమాణం కంటే 25 శాతం అధికంగా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండడమే కాకుండా నీరు మరియు ధూళి నిరోధకతకు IP68 నిరోధకతను కలిగి ఉంటాయి.
ColorFit Pro 4 మరియు ColorFit 4 Pro Max రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ మరియు స్ట్రెస్ మానిటరింగ్ కోసం సపోర్ట్‌తో వస్తాయి. అదనంగా ఈ రెండు కూడా ఫిట్‌నెస్-సంబంధిత ఫీచర్లలో రన్నింగ్, అవుట్‌డోర్ స్పోర్ట్స్, హైకింగ్, సైక్లింగ్ మరియు ఇండోర్ స్పోర్ట్స్ తో కలిపి మొత్తంగా 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470