Home
Gadgets

1.96 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్‌ స్మార్ట్‌వాచ్.. ఇవాళ్టి నుంచి సేల్‌..!

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ నాయిస్‌ తాజాగా నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్‌ 4 మ్యాక్స్‌ స్మార్ట్‌వాచ్‌ను (Noise Colorfit Pulse 4 max Smartwatch) విడుదల చేసింది. ఈ వాచ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు కస్టమైజ్ వాచ్‌ ఫేస్‌లు, బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ అనేక హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజులపాటు పనిచేస్తుంది. ఇవాళ్టి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్‌ 4 మ్యాక్స్‌ స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్‌లు :
నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్‌ 4 మ్యాక్స్‌ స్మార్ట్‌వాచ్‌ 1.96 అంగుళాల ‌‌అమోలెడ్‌ డిస్‌ప్లేను మరియు కుడివైపు క్రోన్‌ను కలిగి ఉంటుంది. ఈ నాయిస్‌ స్మార్ట్‌వాచ్‌ బిల్ట్‌ ఇన్‌ మైక్రోఫోన్‌, స్పీకర్‌ను కలిగి ఉంటుంది.

Noise colorfit pulse 4 max smartwatch

ఈ నాయిస్‌ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో అందుబాటులో ఉంది. ఫలితంగా ఫోన్‌ కాల్స్‌ చేయడం సహా కాల్స్‌ను స్వీకరించేందుకు కూడా అవకాశం ఉంది. దీంతోపాటు డయల్‌ ప్యాడ్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా కాల్‌ హిస్టరీని తెలుసుకోవచ్చు. ఈ వాచ్‌లో 10 వరకు కాంటాక్ట్‌లను సేవ్ చేసేందుకు వీలుంటుంది.

దీంతోపాటు ఈ వాచ్‌ క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ ఫేస్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వాచ్‌ ఫేస్‌లను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఈ వాచ్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. నాయిస్‌ ఫిట్‌ యాప్‌ ద్వారా పనిచేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్‌ 4 మ్యాక్స్‌ స్మార్ట్‌వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంటుంది. హార్ట్‌ రేట్‌, SpO2 మానిటర్‌, స్లీప్ ట్రాకర్‌, ఒత్తిడిని పర్యవేక్షిస్తుంది మరియు మహిళల రుతుక్రమాన్ని ట్రాక్‌ చేయగలదు. ఈ నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్‌ 4 మ్యాక్స్‌ స్మార్ట్‌వాచ్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజులపాటు పనిచేస్తుంది.

ఈ నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్‌ 4 మ్యాక్స్‌ స్మార్ట్‌వాచ్‌ను జెట్‌ బ్లాక్‌, డీప్‌ వైన్‌, రోజ్‌ గోల్డ్‌, స్పేస్‌ బ్లూ, బ్లాక్‌ లింక్‌, కామ్‌ సిల్వర్‌ లింక్‌ రంగుల్లో లభిస్తుంది. మరియు ఈ వాచ్ ధర రూ.2,499 గా ఉంది. ముందస్తు బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లు ఈ వాచ్‌ను రూ.1999 కే సొంతం చేసుకోవచ్చు. goonies.com ద్వారా ముందస్తు బుకింగ్‌ చేయవచ్చు. ఇవాళ్టి (జులై 20) నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Noise colorfit pulse 4 max smartwatch launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X