Noise నుంచి రూ.1,999కే కొత్త స్మార్ట్‌వాచ్.. ఫీచర్లు, సేల్ వివరాలు..!
ప్రముఖ గ్యా్డ్జెట్ల తయారీ సంస్థ నాయిస్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల అయింది. Noise Colorfit Spark పేరుతో వాచ్ లాంచ్ అయింది. గత మోడళ్లతో పోల్చితే కొత్త స్మార్ట్‌వాచ్ పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. దాంతోపాటు బ్లూటూత్ కాలింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆధిక బ్యాటరీ లైఫ్, వివిధ రంగుల్లో లభించనుంది.
నాయిస్ కలర్‌ఫిట్ స్పార్క్ స్మార్ట్‌వాచ్‌లో 2.0 అంగుళాల భారీ TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. 1.85 అంగుళాల స్మార్ట్‌వాచ్‌లతో పోల్చితే నాయిస్ కొత్త వాచ్‌లో సుమారు 17 శాతం విజువల్ ఏరియా పెరిగిందని, 15 శాతం బెజెల్స్ తగ్గిందని సంస్థ పేర్కొంది.

కలర్‌ఫిట్ స్పార్క్ స్మార్ట్‌వాచ్ యూజర్ పెర్సనలైజేషన్ సహా 150 వాచ్ ఫేస్‌లు కలిగి ఉందని నాయిస్ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు అనేక రకాల మెను ఆప్షన్లు కూడా ఉంటాయని తెలిపింది. ఈ స్మార్ట్‌వాచ్ క్రోన్‌ను కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది.
నాయిస్ నుంచి విడుదలైన కొత్త స్మార్ట్‌వాచ్ అనేక రకాల హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్లతో రానుంది. మరియు 100కుపైగా స్పోర్ట్ మోడ్‌లను కలిగి ఉండనుంది. నాయిస్ కలర్‌ఫిట్ స్పార్క్ వాచ్ స్లీప్ ట్రాకర్ 24*7 గంటల హార్ట్ రేట్ మానిటర్, స్ట్రెస్ మేనేజర్, SpO2 సెన్సార్, మహిళ రుతుచక్ర ట్రాకర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌వాచ్ నాయిస్ TruSync టెక్నాలజీతో బ్లూటూత్ కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. మెరుగైన కనెక్షన్‌ను అందిస్తుంది. తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3 వెర్షన్‌తోపాటు నోటిఫికేషన్ ఆప్షన్, వాతావరణ అప్‌డేట్‌లు, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, రిమైండర్‌లు, కాలిక్యులేటర్ సహా అనేక ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాచ్ చేతికి ఉంటే అసలు ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం ఉండదు.
నాయిస్ కలర్‌ఫిట్ స్పార్క్ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అయితే వాచ్‌లోని బ్లూటూత్ కాల్ ఫీచర్‌ను వినియోగిస్తే బ్యాటరీ బ్యాకప్ రెండు రోజుల వరకు వస్తుంది. మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సహా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
నాయిస్ కలర్‌ఫిట్ స్మార్క్ స్మార్ట్‌వాచ్‌ను బడ్జెట్ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర కింద కేవలం రూ.1,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ ఫారెస్ట్ గ్రీన్, ఛార్‌కోల్ గ్రే, సిల్వర్ గ్రే, కోబాల్ట్ బ్లూ, జెట్ బ్లాక్, డీప్ వైన్ రంగుల్లో లభిస్తుంది. ఇవాళ (జులై 25) మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది. నాయిస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
* నాయిస్ నుంచి ఇటీవలే మరో స్మార్ట్‌వాచ్ విడుదల అయింది. ఇది మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. 1.1 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తోపాటు నాయిస్ బడ్ అనే కొత్త ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇది తాజా కాల్ లాక్‌ను యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. అంటే గరిష్ఠంగా 10 నంబర్లను సేవ్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ వాచ్ డైమెంట్ కట్ డయల్‌ను కలిగి ఉంటుంది. సిరి, గూగుల్‌ను సపోర్టు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్ యూజర్లను బాగా ఆకట్టుకుంటుంది. ఆ వాచ్ అమెజాన్‌లో రూ.2,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








