Noise నుంచి తొలిసారిగా అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పనితీరు, ధర, ఫీచర్లు..!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ నాయిస్ తొలిసారిగా స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. Luna Ring పేరులో భారత్‌లో లాంచ్ చేసింది. హార్ట్ రేట్ మానిటర్, టెంపరేచర్ సెన్సార్ (శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్), SpO2 సెన్సార్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయని నాయిస్ సంస్థ తెలిపింది.
ఈ లూనా రింగ్ సన్‌లైట్ గోల్డ్, రోజ్ గోల్డ్, స్టార్‌డస్ట్ సిల్వర్, లూనార్ బ్లాక్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ రింగ్ టైటానియంతో తయారుచేయబడింది. మరియు అందరిని ఆకట్టుకుంటుందని, రింగ్ లోపలి భాగం చాలా సున్నితంగా ఉంటుందని నాయిస్ సంస్థ చెబుతోంది. ఈ లూనా రింగ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

నాయిస్ లూనా రింగ్ శరీరంలోని 70కి పైగా విభాగాలను ట్రాక్ చేయగలదని సంస్థ చెబుతోంది. నిద్ర, యాక్టివిటీ సహా మరెన్నో వివరాలను ట్రాక్ చేసి సమాచారం ఇస్తుందని పేర్కొంది. ఈ రింగ్‌లో శరీర ఉష్ణోగ్రత కొలిచే సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్, SpO2 సెన్సార్ సహా మరిన్ని శరీర భాగాల స్థితిని ట్రాక్ చేస్తుంది. నాయిక్ యాప్ ద్వారా వినియోగదారులు ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చని సంస్థ తెలిపింది.
నాయిస్ లూనా రింగ్ అత్యాధునిక సెన్సార్‌లను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. లూనా రింగ్ ఇన్‌ఫ్రారెడ్ ఫోటోఫ్లేథిస్మోగ్రఫీ (PPG) సెన్సార్లు, స్కిన్ టెంపరేచర్ సెన్సార్‌లు, 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్ వంటి అధునాతన సెన్సార్‌లు ఉన్నాయి. కస్టమర్ వేలితో ఆప్టికల్ సెన్సార్‌ల అమరికను నిర్దారించేందుకు ఈ స్మార్ట్ రింగ్ మూడు బంప్‌లతో పాటు మూడు ఎల్‌ఈడీ మరియు రెండు పీడీలతో కలిగి ఆప్టో మెకానికల్ డిజైన్‌ను ఉపయోగిస్తున్నామని సంస్థ వెల్లడించింది.

నాయిస్ లూనా రింగ్ మొత్తం 7 సైజుల్లో అందుబాటులో ఉంటుందని మరియు 5 రంగుల్లో లభిస్తుందని తెలిపింది. సన్‌లైట్ గోల్డ్, రోజ్ గోల్డ్, స్టార్‌డస్ట్ సిల్వర్, లూనార్ బ్లాక్ మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ లూనా రింగ్ బ్లూటూత్ లో ఎనర్జీ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుందని, 50 మీటర్ల నీటి లోతు వరకు రక్షణ కలిగి ఉంటుందని తెలిపింది.
ఈ నాయిస్ స్మార్ట్ రింగ్ ఆటోమేటిక్ ఫిర్మ్‌వేర్ అప్‌డేట్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ iOS 14 లేదా ఆండ్రాయిడ్ 6 కంటే ఎక్కువ వెర్షన్‌లను సపోర్టు చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని నాయిస్ సంస్థ చెబుతోంది. కేవలం 60 నిమిషాల్లోనే లూనా రింగ్‌ను పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ తెలిపింది.

నాయిస్ స్మార్ట్ రింగ్ 3mm రింగ్ థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియి తేలికగా ఉంటుంది. ఈ స్మార్ట్ రింగ్ ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలను నాయిస్ సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ లూనా రింగ్ కావాలనుకొనే కస్టమర్లు ముందస్తు బుకింగ్ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Gonoise.com లో లాగిన్ అయ్యి రూ. 2000 చెల్లించి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చని నాయిస్ సంస్థ తెలిపింది. ప్రీ ఆర్డర్ చేసుకున్న వినియోగదారులకు స్మార్ట్ రింగ్ ధరపై రూ.1000 అదనపు తగ్గింపు, దాంతోపాటు రూ.2000 విలువైన లిక్విడ్, ఫిజికల్ డ్యామేజీ, దొంగతనం బీమాకు సంబందించిన ఉచిత ఇన్సూరెన్స్ వస్తుందని నాయిస్ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ నడుస్తోంది. అయితే త్వరలో ఈ స్థానాన్ని స్మార్ట్ రింగ్‌లు భర్తీ చేస్తాయా అంటే కొన్ని గ్యాడ్జెట్ల తయారీ సంస్థలు మాత్రం అదే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బోట్ సంస్థ కూడా తొలిసారిగా స్మార్ట్ రింగ్‌ను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








