Home
Gadgets

అద్భుతమైన స్మార్ట్‌ ఫీచర్లతో Noise Luna Ring.. హెల్త్‌ ట్రాకింగ్‌ సెన్సార్లు సహా మరెన్నో ఫీచర్లు..!

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ Noise Luna Ring పై జూలైలో ప్రకటన చేసింది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ రింగ్‌ను ఆవిష్కరించింది. ఈ లూనా స్మార్ట్‌ రింగ్‌ టైటానియం బాడీని కలిగి ఉంటుంది. మరియు డైమండ్‌ పూతతో వస్తుంది. ఎక్కువకాలం మన్నిక వచ్చే విధంగా మరియు గీతలు, తుప్పు పట్టకుండా కాపాడుతుంది.

నాయిస్‌ లూనా రింగ్‌ ప్రారంభ ధర రూ.14,999గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ రింగ్‌ gonoise.com లో అందుబాటులో ఉంది. ఈ లూనా రింగ్‌ మూడు రంగుల్లో లభిస్తుంది. స్టార్‌డస్ట్‌ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, లూనార్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రంగులతోపాటు సన్‌లిట్‌ గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లోనూ త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

Noise Luna ring launched

ఈ లూనా స్మార్ట్ రింగ్‌ను ఆర్డర్‌ చేశాక.. కస్టమర్‌ చేతి వేళ్ల సైజ్‌ను నిర్ణయించడానికి సైజింగ్‌ కిట్‌ వస్తుంది. అనంతరం రెండు నుంచి నాలుగు వారాల్లో స్మార్ట్ రింగ్‌ డెలివరీ అవుతుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపును మరియు నో కాస్ట్‌ EMI సదుపాయాన్ని పొందవచ్చు.

లూనా యాక్సెస్‌ పాస్‌ను కొనుగోలు చేసిన వారు అదనంగా రూ.3000 తగ్గింపును పొందుతారు. ఫిజికల్‌, లిక్విడ్‌ డ్యామేజ్‌ కవరేజ్‌ కింద మరియు నాయిస్‌ ఐ స్మార్ట్‌ కళ్లజోడుపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ ప్రస్తుతం సేల్‌కు అందుబాటులో ఉంది.

Noise Luna ring launched

Noise Luna Ring ఫీచర్లు : ఈ నాయిస్‌ లూనా స్మార్ట్‌ రింగ్‌ కేవలం 3 నుంచి 4 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మరియు 2.8mm మందం ఉంటుంది. ఈ స్మార్ట్‌ రింగ్ హార్ట్‌ రేట్‌, శరీర ఉష్ణోగ్రత, SpO2 మానిటర్‌, స్లీప్‌, యాక్టివిటీ ట్రాకింగ్‌ సహా అనేక ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫలితాలను నాయిస్‌ఫిట్‌ యాప్‌ ద్వారా ట్రాకింగ్‌ చేయవచ్చు.

ఈ నాయిస్‌ స్మార్ట్‌ రింగ్ తక్కువ శక్తిని వినియోగించుకొనే టెక్నాలజీని కలిగి ఉంటుంది. మరియు ఈ రింగ్‌ ఆండ్రాయిడ్‌ 6+ మరియు iOS 14 లేదా తర్వాత వెర్షన్‌లను సపోర్టు చేస్తుంది. ఈ రింగ్‌ 50 మీటర్ల లోతు నీటి వరకు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది.

Noise Luna ring launched

ఈ నాయిస్‌ లూనా స్మార్ట్ రింగ్‌ను 90 నుంచి 120 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్‌ చేయవచ్చని సంస్థ చెబుతోంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 6 రోజులపాటు ఈ స్మార్ట్ రింగ్‌ బ్యాటరీ లైఫ్‌ వస్తుందని తెలిపింది. ఈ రింగ్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని నాయిస్‌ సంస్థ చెబుతోంది.

Boat స్మార్ట్ రింగ్‌ ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగ్‌ హార్ట్‌ రేట్‌ మానిటర్‌, SpO2 సెన్సార్‌, శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్‌లను కలిగి ఉంటుందని బోట్‌ తెలిపింది. దీంతోపాటు నిద్ర నాణ్యత సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. మహిళల రుతుక్రమాన్ని ట్రాకింగ్‌ చేయగలదని తెలిపింది. ఈ రింగ్‌ 5 ATM వాటర్‌ రెసిస్టెంట్‌ రేటింగ్‌తో వస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.

ఈ రింగ్‌ రన్నింగ్‌, వాకింగ్‌, రైడింగ్‌, ఇండోర్‌, అవుట్‌డోర్‌ ట్రాకింగ్‌ సహా అనేక రకాల వ్యాయామాలను ట్రాక్‌ చేయగలదు. ఈ సమాచారాన్ని బోట్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ రింగ్‌ శరీర కదలికలను గుర్తించేందుకు వీలుగా ఆరు యాక్సిస్‌ మోషన్‌ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల కోసం SOS మోడ్‌తో వస్తుంది. ఈ బోట్‌ స్మార్ట్ రింగ్‌ ధర రూ.8,999గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Noise Luna ring launched in india with many smart features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X