44 గంటల బ్యాటరీ లైఫ్, ANC, ENC ఫీచర్‌లతో నాయిస్ మాస్టర్ బడ్స్ విడుదల.. ప్రీ బుకింగ్స్‌పై రూ.2000 డిస్కౌంట్!
ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ కు భారత్‌లో అధిక డిమాండ్ ఉంటోంది. ఫలితంగా అనేక సంస్థలు ఆడియో ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్ లో రూ.1,000 కంటే తక్కువ ధర నుంచి ప్రీమియం ఇయర్‌బడ్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇయర్‌ఫోన్స్, నెక్‌బ్యాండ్, ఇయర్‌బడ్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ నాయిస్ (Noise) సరికొత్త డిజైన్‌తో ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది.
నాయిస్ మాస్టర్ బడ్స్ (Noise Master Buds Launched) సరికొత్త డిజైన్‌ను కలిగి ఉన్నాయి. దీంతోపాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ సహా అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉందని నాయిస్ చెబుతోంది.

నాయిస్ మాస్టర్ బడ్స్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
నాయిస్ మాస్టర్ బడ్స్ వినైల్ డిస్క్ షేప్‌తో కూడిన ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ TWS బడ్స్ బాస్ ట్యూనింగ్‌తో కూడిన 12.4mm టైటానియం డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి.
ఈ బడ్స్ 6 మైక్రోఫోన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మెరుగైన ఆడియో సపోర్టు కోసం ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC), 49dB ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ఆప్షన్ కూడా కలిగి ఉంది.

ఈ ఫోన్ హై రిజల్యూషన్ బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ కోసం LHDC 5.0 ఆడియో కోడిక్ సపోర్టును కలిగి ఉంది. ఈ TWS బడ్స్ NoiseFit App ను సపోర్టు చేస్తుంది. ఈ యాప్ ద్వారా నాయిస్ బడ్స్ వాల్యూమ్ సహా ఇతర మార్పులు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఛార్జింగ్ విషయానికి వస్తే నాయిక్ మాస్టర్ బడ్స్ TWS ఇయర్‌బడ్స్ USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఛార్జింగ్ స్థితిని తెలుసుకొనేందుకు వీలుగా 2PM టైల్ బార్‌ను కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 44 గంటల పాటు (ANC Off) వినియోగించుకోవచ్చని నాయిస్ చెబుతోంది.

అదే ANC ఆన్ చేసి వినియోగిస్తే బ్యాటరీ లైఫ్ 34 గంటలపాటు వస్తుందని తెలిపింది. అలాగే కేవలం 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్‌తో 6 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చని తెలిపింది. నాయిస్ TWS ఇయర్‌బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్, డ్యూయల్ కనెక్టివిటీ, ఫైండ్ మై డివైస్, స్పేషియల్ ఆడియో, ఇన్- ఇయర్ డిటెక్షన్, వంటి అదనపు ఫీచర్‌లను కలిగి ఉంది.
నాయిస్ మాస్టర్ బడ్స్ ధర సేల్ వివరాలు :
భారత్ మార్కెట్‌లో నాయిస్ మాస్టర్ బడ్స్ ధర రూ.7999 గా ఉంది. ప్రస్తుతం ప్రీ బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నాయిస్ వెల్లడించింది. నాయిస్ ఇ-స్టోర్, అమెజాన్ లో రూ.999 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి రూ.2000 కూపన్ డిస్కౌంట్ ను అందిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా కొనుగోలు సమయంలో ఈ రూ.2000 డిస్కౌంట్ కూపన్ ను ఉపయోగించి రూ.5999 కే బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చని నాయిస్ వెల్లడించింది. ఈ బడ్స్ సేల్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుందని వెల్లడించింది.
నాయిస్ అధికారిక వెబ్‌సైట్ gonoise.com, అమెజాన్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా ప్లాట్‌ఫాంలలో (Noise master buds sale) చేయవచ్చు. ఈ మాస్టర్ బడ్స్ సిల్వర్, టైటానియం, Onyx కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








