Home
Gadgets

44 గంటల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్‌ మాస్ట్‌ బడ్స్‌ సేల్‌ ప్రారంభం.. ANC, ENC, ఇన్‌ ఇయర్‌ డిటెక్షన్‌ ఫీచర్లు..!

భారత్ మార్కెట్‌ లో ఈ నెల రెండో వారంలో నాయిస్‌ సంస్థ (Noise TWS Buds) నాయిస్‌ మాస్టర్‌ బడ్స్‌ ను విడుదల చేసింది. సరికొత్త డిజైన్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మాస్టర్‌ బడ్స్‌ సింగిల్‌ ఛార్జింగ్‌ తో 44 గంటల బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. దీంతోపాటు ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ (ENC), యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC), డ్యూయల్ డివైస్‌ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. భారత్‌ లో ఈ బడ్స్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఈ TWS ఇయర్‌బడ్స్‌ పూర్తి ఫీచర్‌ లు, ధర, సేల్‌ వివరాలు.

TWS ఇయర్ బడ్స్ ధర, సేల్‌ వివరాలు :
నాయిస్‌ మాస్టర్‌ బడ్స్ (Noise Master Buds Sale) ధర రూ.7999 గా ఉంది. నాయిస్‌ అధికారిక వెబ్‌సైట్‌ gonoise.com సహా ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్‌ (Amazon), రిలయన్స్‌ డిజిటల్‌, విజయ్‌ సేల్స్‌, క్రోమా వంటి ప్లాట్‌ఫాంలలోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్‌ సిల్వర్‌, టైటానియం, Onyx వంటి కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Noise master buds price in india

నాయిస్‌ మాస్టర్‌ బడ్స్‌ పూర్తి వివరాలు :
ఈ బడ్స్‌ ప్రత్యేకమైన ఇన్ ఇయర్‌ డిజైన్‌ ను కలిగి ఉంది. బాస్‌ ట్యూనింగ్‌ తో 12.4mm టైటానియం డ్రైవర్స్‌ తో అందుబాటులో ఉంది. ఈ బడ్స్‌ 6 మైక్రోఫోన్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది.

ANC, ENC ఫీచర్‌లు :
ఈ నాయిస్‌ బడ్స్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC), ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ (ENC) వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు హై రిజల్యూషన్‌ బ్లూటూత్‌ ఆడియో స్ట్రీమింగ్‌ కోసం LHDC 5.0 ఆడియో కోడిక్‌ సపోర్టు చేస్తుంది.

Noise master buds price in india

ప్రత్యేక ఫీచర్‌ లు :
నాయిస్‌ TWS మాసర్ట్‌ బడ్స్‌ డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ, గూగుల్‌ ఫాస్ట్‌ పెయిర్‌, స్పేషియల్‌ ఆడియో, ఇన్‌-ఇయర్‌ డిటెక్షన్‌, ఫైండ్‌ మై డివైస్‌ వంటి ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్స్ NoiseFit App ను సపోర్టు చేస్తాయి. ఈ యాప్‌ ద్వారా బడ్స్‌ లో వాల్యూమ్ సహా అనేక మార్పులు చేయవచ్చు.

బ్యాటరీ లైఫ్‌ వివరాలు :
ఈ బడ్స్‌ USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 44 గంటల పాటు (ANC Off) వినియోగించుకోవచ్చు. అయితే యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ యాక్టివ్‌ లో ఉంటే మాత్రం.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 34 గంటల వరకు వినియోగించుకోవచ్చు.

క్విక్‌ ఛార్జింగ్ సపోర్టు :
దీంతోపాటు క్విక్‌ ఛార్జింగ్ ఫీచర్‌ ను కూడా ఈ మాస్టర్‌ బడ్స్‌ సపోర్టు చేస్తాయి. కేవలం 10 నిమిషాల పాటు ఛార్జింగ్ చేసి ఏకంగా 6 గంటల వరకు ప్లే బ్యాక్ టైంను పొందవచ్చని నాయిస్ తెలిపింది. ఈ నాయిస్ TWS బడ్స్‌ కొనుగోలుపై 7 రోజుల రీప్లేస్‌మెంట్ తోపాటు సంవత్సరం వారంటీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Noise master buds with 44 hours battery life sale is live in india check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X