ధర రూ.999 కే 50 గంటల ప్లే టైంతో Noise వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ పూర్తి వివరాలు..!!
ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ నాయిస్ తాజాగా TWS ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఈ Noise Pop Buds ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బడ్స్ సింగిల్ ఛార్జింగ్ లో 50 గంటల ప్లేటైం ఇస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు కేవలం రూ.999 కే కొనుగోలు చేయవచ్చు.
నాయిస్ ఇయర్ బడ్స్ స్పెసిఫికేషన్లు..
నాయిస్ పాప్ పడ్స్ 10mm డ్రైవర్లను కలిగి ఉంటుంది. మరియు క్వాడ్ మైక్‌తో ENC ( ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ) టెక్నాలజీతో లాంచ్ అయింది. ఫలితంగా సినిమాలు చూస్తున్నప్పుడు, సంగీతం వింటున్నప్పుడు, గేమింగ్ సమయంలో నాణ్యమైన సౌండ్ క్వాలిటీని ఆస్వాదించవచ్చు.

దీంతోపాటు ఈ నాయిస్ ఇయర్ బడ్స్ మెరుగైన ఛార్జింగ్ టెక్నాలజీతో లాంచ్ అయింది. ఈ InstaCharge టెక్నాలజీతో కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 150 నిమిషాల ప్లేటైం ను పొందవచ్చు. ఫలితంగా అత్యవసర సమయాల్లో ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి సింగిల్ ఛార్జింగ్ ద్వారా 50 గంటల ప్లేటైం ఇస్తుందని సంస్థ తెలిపింది.
దీంతోపాటు నాయిస్ కొత్త వైర్ లెస్ ఇయర్‌బడ్స్ (Noise New TWS Earbuds 2024) బ్లూటూత్ 5.3 వెర్షన్ మరియు 40ms లెటెన్సీ ద్వారా మెరుగైన ఆడియో ను పొందవచ్చు. మరియు ఇతర డివైస్‌లతో సులభంగా కనెక్ట్ కావచ్చు. దీంతోపాటు అనేక ఫీచర్లు ఈ నాయిస్ కొత్త ఇయర్ బడ్స్ సొంతం.
నాయిస్ బడ్స్ సేల్ వివరాలు..
నాయిస్ కొత్త ఇయర్ బడ్స్‌ను భారత్‌లో రూ.999 కే కొనుగోలు చేయవచ్చు. నాయిస్ అధికారిక ప్లాట్ ఫాం gonoise.com మరియు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్ కార్ట్‌లో (Flipkart) కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. మూన్ పాప్, స్టీల్ పాప్, ఫారెస్ట్ పాప్, లిలక్ పాప్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
** ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 రేపటి నుంచి ( మే 3వ తేదీ ) ప్రారంభం కానుంది. 9వ తేదీ వరకు సేల్ కొనుసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు ఒకరోజు ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు సహా గృహోపకరణాలపైన డిస్కౌంట్‌లు పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024లో భాగంగా SBI క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చని వెల్లడించింది. అలాగే దీంతోపాటు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








