Noise నుంచి సరికొత్త హెల్త్ ట్రాకింగ్ స్మార్ట్ వాచ్ విడుదల.. ధర ఎంతంటే!
ప్రముఖ స్మార్ట్ వాచ్ ఉత్పత్తుల కంపెనీ Noise, భారత మార్కెట్లో క్రమంగా తమ ఉత్పత్తుల్ని విస్తరింపచేస్తోంది. తాజాగా మరో కొత్త మోడల్ బడ్జెట్ స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. Noise X-Fit 2 పేరుతో ఈ కొత్త వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్, HRX భాగస్వామ్యంతో రూపొందించబడింది.

హెల్త్ ట్రాకర్, ఫిట్‌నెస్ ట్రాకర్, హార్ట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ సహా పలు అద్భుతమైన ఫీచర్లను ఈ వాచ్‌కు అందిస్తున్నారు. దీనికి 1.69 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ వాచ్‌కు 2.5 గంటల్లో బ్యాటరీ ఛార్జింగ్ పూర్తవుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. స్టాండ్‌బై టైం 30 రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్‌కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు వివరంగా తెలుసుకుందాం.
Noise X-Fit 2 స్మార్ట్‌వాచ్ ధరలు:
భారత మార్కెట్లో ఈ Noise X-Fit 2 ధరను రూ.3,999 గా నిర్ణయించారు. ప్రస్తుతానికి దీన్ని లాంచ్ ఆఫర్ కింద 50శాతం డిస్కౌంట్‌తో రూ.1,999 కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ Noise X-Fit 2 స్మార్ట్‌వాచ్‌లు స్పేస్ బ్లూ, జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే కలర్ వేరియంట్లలో వినియోగ దారులకు అందుబాటులో ఉన్నాయి.

Noise X-Fit 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:
నాయిస్ ఎక్స్ ఫిట్ 2 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.69-అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ రెక్టాంగ్యులర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 60 పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు.
అంతేకాకుండా బ్లూటూత్ కాలింగ్, ఫైండ్ మై ఫోన్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ iOS 10 మరియు ఆండ్రాయిడ్ 4.4 అంతకంటే పైన ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన డివైజులకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది 5.0 బ్లూటూత్ వర్షన్‌ను కలిగి ఉంది. మరోవైపు ఈ స్మార్ట్ వాచ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP68 సౌకర్యాన్ని కలిగి ఉంది. దీనికి 260mAh సామర్థ్యం గల బ్యాటరీ ని అందిస్తున్నారు. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 7 రోజుల పాటు కంటిన్యూ వినియోగాన్ని అందిస్తుంది. దీన్ని ఫుల్ చార్జ్ చేయడానికి 2.5 గంట పడుతుంది. స్టాండ్‌బై టైం 30 రోజుల వరకు ఉంటుంది. ఇవేకాకుండా, స్టాప్ వాచ్, క్యాలెండర్ రిమైండర్, టైమర్, అలారం, సహా పలు ఆకర్షణయమైన ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Noise ColorFit Pulse 2 స్మార్ట్‌వాచ్ గురించి కూడా తెలుసుకుందాం:
ఈ Noise ColorFit Pulse 2 వాచ్ లార్జ్ స్క్రీన్‌తో పాటు, అద్భుతమైన హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ Noise ColorFit Pulse 2 పలు అప్‌గ్రేడ్‌లతో గతేడాది ఈ కంపెనీ నుంచి విడుదలైన ColorFit Pulse మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చింది. అంతేకాకుండా ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.
Noise ColorFit Pulse 2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 2 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×286 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.8-అంగుళాల స్క్వేర్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ పాత మోడల్ కంటే 40శాతం పెద్దగా ఉంటుంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 50 పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు.

అంతేకాకుండా కాల్ రిజెక్షన్, ఫైండ్ మై ఫోన్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ iOS 9 మరియు ఆండ్రాయిడ్ 6 అంతకంటే పైన ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన డివైజులకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది 5.1 బ్లూటూత్ వర్షన్‌ను కలిగి ఉంది. మరోవైపు ఈ స్మార్ట్ వాచ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP68 సౌకర్యాన్ని కలిగి ఉంది. దీనికి 240mAh సామర్థ్యం గల బ్యాటరీ ని అందిస్తున్నారు. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 7 రోజుల పాటు కంటిన్యూ వినియోగాన్ని అందిస్తుంది. దీన్ని ఫుల్ చార్జ్ చేయడానికి 1.5 గంట పడుతుంది.
Noise ColorFit Pulse 2 ధర:
ఈ Noise ColorFit Pulse 2 ధర రూ.3000 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో ఇది 60శాతం డిస్కౌంట్‌తో రూ.1998 కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. జెట్ బ్లాక్, స్పేస్ బ్లూ, మిస్ట్ గ్రే, ఒలివ్ గ్రీన్, రోస్ పింక్ కలర్లలో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. నాయిస్ వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ధరల పరంగా చూస్తే ఇది ఫైర్ బోల్ట్ నింజా 2 స్మార్ట్ వాచ్ కు పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








