మహిళల కోసం ప్రత్యేకంగా NoiseFit Diva 2 స్మార్ట్‌వాచ్... హెల్త్ ట్రాకర్‌లు సహా ఎన్నో ప్రత్యేక ఫీచర్‌లు..!
ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ నాయిస్ (Noise) నుంచి మరో స్మార్ట్‌వాచ్ 'నాయిస్‌ఫిట్ దివా 2' పేరుతో విడుదల అయింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసినట్లు తెలిపింది. ఇటీవల విడుదల అయిన నాయిస్‌ఫిట్ దివా స్మార్ట్‌వాచ్‌కు తర్వాత తరం వెర్షన్‌గా విడుదల అయింది. ఈ కొత్త గ్యాడ్జెట్ సన్నని డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంది. మహిళ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలిపేలా ఈ స్మార్ట్‌వాచ్‌లో ప్రత్యేక ట్రాక్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం నాయిస్‌ఫిట్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. త్వరలో ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.
ఈ నాయిస్‌ఫిట్ దివా 2 స్మార్ట్‌వాచ్ (NoiseFit Diva 2 Smartwatch) మహిళల కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్‌డ్ ఫీమేల్ హెల్త్ సూట్‌ను (Female Health Suit) కలిగి ఉంటుంది. ఇందులో పూర్తి ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకర్‌లు, ఫీచర్‌లు ఉంటాయి. ఫలితంగా మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక వివరాలు తెలియనున్నాయని నాయిస్ సంస్థ చెబుతోంది. పూర్తి వివరాలు.

నాయిస్‌ఫిట్ దివా 2 స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌వాచ్ ప్రీమియం మెటల్ తో తయారుచేయబడింది. మరియు 1.43 అంగుళాల (460*460) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Always on Display ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ నాయిస్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్ రోజువారీ పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు వాతావరణానికి సంబంధించిన అప్‌డేట్‌లను పొందవచ్చు. దీంతోపాటు ఈ నాయిస్ వాచ్ 100 స్పోర్ట్ మోడ్స్ మరియు 100 వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా వర్కౌట్ సహా ఇతర సమయాల్లో అనువుగా ఉంటుంది.
ఈ నాయిస్‌ఫిట్ వాచ్ బ్లూటూత్ V5.3 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సింగిల్ ఛార్జింగ్ ద్వారా 4 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. SpO2 ట్రాకింగ్, ఒత్తిడి, స్లీప్ విశ్లేషణ సహా హార్ట్ రేట్ పర్యవేక్షణ వంటి ట్రాకర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ NoiseFit యాప్‌తో కనెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా హెల్త్ అప్‌డేట్‌ను పొందవచ్చు.
నాయిస్‌ఫిట్ దివా 2 స్మార్ట్‌వాచ్ ధర, సేల్ వివరాలు :
నాయిస్‌ఫిట్ దివా 2 స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ.4,499 గా ఉంది. ఈ వాచ్ ఐదు రంగుల్లో లభిస్తుంది. క్లాసిక్ బ్లాక్, సిల్వర్ బ్లూ, రోజ్ పింక్ సహా రోజ్ లింక్ మరియు బ్లాక్ లింక్ రంగుల్లో లభిస్తుంది. అయితే బ్లాక్ లింక్, రోజ్ లింక్ కలర్ వేరియంట్‌ల ధరలు రూ.4,999 గా ఉన్నాయి.
ఈ నాయిస్‌ఫిట్ దీవా 2 స్మార్ట్‌వాచ్ (NoiseFit Diva 2 Smartwatch Sale) ప్రస్తుతం నాయిస్ అధికారిక వెబ్‌సైట్ gonoise.com లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ల ద్వారా అక్టోబర్ 29 నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది.


Click it and Unblock the Notifications








