నాయిస్ నుంచి లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్ విడుదల.. 7 రోజుల బ్యాటరీ లైఫ్, DND, SOS ఫీచర్లు..!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ నాయిస్ తాజాగా స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్ ను లాంచ్ చేసింది. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రో పేరుతో నాయిస్‌ఫిట్ జావెలిన్ (NoiseFit Javelin Smartwatch) వాచ్‌ను విడుదల చేసింది. జున్‌లో ఈ సంస్థ నాయిస్‌ఫిట్ ఆరిజన్ స్మార్ట్‌వాచ్ ను లాంచ్ చేసింది. అనంతరం తక్కువ రోజుల వ్యవధిలోనే మరో మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాయిస్‌ఫిట్ జావెలిన్ వాచ్ సింగిల్ ఛార్జింగ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్ ను పొందువచ్చు.
నాయిస్‌ఫిట్ జావెలిన్ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లు :
నాయిస్‌ఫిట్ జావెలిన్ స్మార్ట్‌వాచ్ 466*466 పిక్సల్ రిజల్యూషన్‌తో 1.46 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్‌కు కుడివైపు రెండు బటన్లు, క్రోన్‌తో కూడిన వృత్తాకార మెటల్ డయల్‌తో అందుబాటులో ఉంది. మాగ్నటిక్ లెదర్ స్ట్రాప్‌తో లాంచ్ అయింది.

హెల్త్ ఫీచర్లు :
నాయిస్‌ఫిట్ జావెలిన్ స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్ ఫీచర్లను కలిగి ఉంటుంది. హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, బ్రీథింగ్ ప్రాక్టిస్ వంటి ఫీచర్లను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు బిల్ట్ ఇన్ కాలిక్యులేటర్, మ్యూజిక్ కంట్రోల్, అలారం, స్టాప్ వాచ్ వంటి ఫీచర్లున్నాయి.
DND, SOS ఫీచర్లు :
ఈ వాచ్ నాయిస్ Tru Sync టెక్నాలజీతో కూడిన బ్లూటూత్ 5.3 పైన పనిచేస్తుందని తెలిపింది. ఈ స్మార్ట్‌వాచ్ DND సహా అత్యవసర సమయాల్లో భద్రత కోసం SOS ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుందని నాయిస్ సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఈ స్మార్ట్‌వాచ్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది.

నీరజ్ చోప్రా సంతకంతో.. :
ఈ నాయిస్‌ఫిట్ జావెలిన్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ మరియు iOS లను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ క్లౌడ్ ఆధారిత 100 వాచ్ ఫేస్‌లను కలిగి ఉంటుందని నాయిస్ తెలిపింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్ వెనుకవైపు నీరజ్ చోప్రా సంతకంతో వస్తుందని నాయిస్ సంస్థ వెల్లడించింది.
30 రోజుల స్టాండ్‌బై టైం :
ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేసి 7 రోజులపాటు వినియోగించుకోవచ్చని నాయిస్ తెలిపింది. 100 శాతం ఛార్జింగ్ చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 30 రోజుల స్టాండ్‌బై సమయాన్ని కలిగి ఉంటుందని తెలిపింది.

నాయిస్‌ఫిట్ జావెలిన్ స్మా్ర్ట్‌వాచ్ ధర, సేల్ :
నాయిస్‌ఫిట్ జావెలిన్ స్మా్ర్ట్‌వాచ్ ధర రూ.3999 గా ఉంది. అమెజాన్, మింత్రా నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌వాచ్ భారత్‌లో కేవలం బ్లూ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








