Nokia Android TV: నోకియా యొక్క కొత్త స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి....
ఇంతకు ముందు ఇండియాలో నోకియా యొక్క అన్ని రకాల వస్తువులకు మంచి డిమాండ్ ఉండేది. తరువాత కాలంలో చాలా రకాల సంస్థలు తమ కొత్త కొత్త ప్రొడక్టులను విడుదల చేయడంతో నోకియా సంస్థ కాస్త వెనుకబడి ఉంది. ఇప్పుడు నోకియా సంస్థ టెక్నాలజీ మార్కెట్లో తన పూర్వవైభవాన్ని తిరిగి పొందడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తోంది.

నోకియా స్మార్ట్ టివి
ఇప్పటివరకు ఈ టెక్ దిగ్గజం కొన్ని ఆసక్తికరమైన ఉత్పత్తులను విజయవంతంగా ప్రారంభించగలిగింది. అలాగే వీటికి మార్కెట్ లో మంచి స్పందన కూడా వచ్చింది. ఇప్పుడు నోకియా మరోక కొత్త ఉత్పత్తి 43-అంగుళాల ఆండ్రాయిడ్ టివిని విడుదల చేస్తోంది. నోకియా యొక్క 43-అంగుళాల ఆండ్రాయిడ్ టివిను ఈ రోజు అంటే జూన్ 4 న ప్రారంభించనున్నది. పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చే ఆండ్రాయిడ్ డివైస్ లు ఇవే....

నోకియా ఆండ్రాయిడ్ టీవీ
నోకియా ప్రారంభంలో 55 అంగుళాల పొడవు గల స్మార్ట్ టివిను విడుదల చేసింది. దీనిని వినియోగదారులకు గొప్ప తగ్గింపు ధరలతో విక్రయించడానికి ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా భాగస్వామ్యంను కుదుర్చుకున్నది. కాబట్టి నోకియా నుండి రాబోయే ఈ కొత్త ఆండ్రాయిడ్ టీవీని కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయించే అవకాశం ఉంది.

నోకియా 43-అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ ధర
నోకియా సంస్థ తన కొత్త 43-ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీ యొక్క ధరను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దీనిని సుమారు రూ.30,000 ధర వద్ద విడుదల చేయనున్నట్లు ఉహాగానాలు ఉన్నాయి. 55 అంగుళాల నోకియా ఆండ్రాయిడ్ టీవీను రూ.41,999 ధర వద్ద విడుదల చేసింది. నోకియా యొక్క కొత్త ఆండ్రాయిడ్ టీవీ రియల్‌మి మరియు Mi వంటి ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీనివ్వవచ్చు. రియల్‌మి ఇటీవల సరసమైన స్మార్ట్ టీవీని 21,999 రూపాయల ధర వద్ద విడుదల చేసింది.

నోకియా 43-అంగుళాల TV స్పెసిఫికేషన్స్
నోకియా సంస్థ కొత్తగా విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ టీవీ డాల్బీ విజన్ మద్దతును కలిగి ఉండి 4K UHD ప్యానెల్ ను కలిగి ఉంది. నోకియా యొక్క ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా-సన్నని బెజెల్స్ నిర్మాణంను కలిగి ఉంటుంది. ఇది ఫ్లూయిడ్ క్రోమ్ పెడెస్టల్ టెక్నాలజీతో పాటు చూడటం చాలా సొగసైన నిర్మాణంను కలిగి ఉంటుంది. ఉత్తమమైన సౌండ్ అనుభవాన్ని అందించడానికి ఇది డాల్బీ ఆడియో టెక్నాలజీతో కూడిన జెబిఎల్ స్పీకర్ల అనుభవాన్ని అందిస్తుంది.

నోకియా 43-అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్స్
నోకియా 43-అంగుళాల స్మార్ట్ టీవీ DTS ట్రూసరౌండ్ టెక్నాలజీ ని కలిగి ఉంది. ఇది శబ్దాలను మరింత గొప్ప అనుభవంతో అందిస్తుంది. ఈ ఆండ్రాయిడ్ టీవీ ఆండ్రాయిడ్ 9 పై మద్దతుతో వస్తుంది. ఇందులో మీరు గూగుల్ ప్లే స్టోర్ ను కూడా రన్ చేయవచ్చు. మాలి -450 జీపీయూ, 2.25GB ర్యామ్‌తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ఫీచర్ లను కలిగి ఉంటుంది. ఇది వై-ఫై మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీలను కలిగి ఉండి యాక్సెస్ చేయడానికి వీలుగా ఉంది. ఇందులో గల పోర్ట్‌ల విషయానికి వస్తే ఇది HDMI పోర్ట్, USB పోర్ట్‌లను కూడా కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








