ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆఫర్లతో నోకియా 55-inch స్మార్ట్ టీవీ సేల్స్

|

స్మార్ట్ టీవీ వినియోగం అనేది ఈరోజులలో చాలా ఎక్కువ అవుతున్నది. ప్రతి ఒక్కరు తమ పోర్ట్రబుల్ టీవీ నుండి స్మార్ట్ టీవీకి మారుతున్నారు. చాలా రకాల స్మార్ట్ టీవీలు ఇప్పుడు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. గత నెల డిసెంబర్ 2019 లో నోకియా యొక్క స్మార్ట్ టీవీ ఇండియాలో విడుదల అయింది. ఈ రోజు ఈ స్మార్ట్ టీవీని మొదటి సారి అమ్మకానికి ఉంచారు.

ఆఫర్స్
 

ఆఫర్స్

ఆసక్తిగల కొనుగోలుదారులు నోకియా యొక్క 4K స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్ ద్వారా పొందవచ్చు. నోకియా స్మార్ట్ టీవీ యొక్క మొదటి సేల్ ఈ రోజు అంటే జనవరి 13 మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదలుకానున్నది. HSBC క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగదారులు దీని కొనుగోలు మీద 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో EMI పై 5 శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

టిక్‌టాక్‌కు పోటీగా భారత్‌లో త్వరలో ఫేస్‌బుక్ వీడియో యాప్

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్

ఈ ఆండ్రాయిడ్ టీవీలో కంపెనీ ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తోంది. దీని కొనుగోలు మీద ఎటువంటి ఖర్చు లేని EMI ఎంపిక కూడా ఉంది. తాజా నోకియా స్మార్ట్ టివి ఆడియో టెక్నాలజీ కోసం ఉన్నతమైన JBL సౌండ్ నాణ్యతను ఉపయోగిస్తుంది. అలాగే ఇది 24వాట్స్ స్పీకర్లకు కూడా మద్దతు ఇస్తుంది. నోకియా స్మార్ట్ టీవీలకు రూ.2,999ల విలువైన కంప్లీట్ టీవీ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే 3 సంవత్సరాలలో 30 శాతం తగ్గింపుతో ఎక్స్చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నట్లు హామీ ఇస్తున్నది. నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీ గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?

ధరల వివరాలు

ధరల వివరాలు

నోకియా యొక్క 55 అంగుళాల 4K స్మార్ట్ టివి ఇండియాలో రూ.41,999ల ధర వద్ద ప్రారంభమవుతుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేటి నుండి ఇండియాలో కొనుగోలు చేయవచ్చు.

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

నోకియా 4K స్మార్ట్ టివి యొక్క సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇందులో గూగుల్ ప్లే స్టోర్ ముందుగానే నిర్మించబడి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వినియోగదారులు వారికి నచ్చిన మరిన్ని యాప్ లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ 4K టివి ప్యూర్X క్వాడ్-కోర్ ప్రాసెసర్ నుండి శక్తిని పొందుతుంది.

తక్కువ ధరకు రోజుకు 2GB & 3GB డేటాను అందిస్తున్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఫీచర్స్

ఫీచర్స్

ఈ బ్రాండెడ్ యొక్క మొదటి స్మార్ట్ టీవీ 2.25GB ర్యామ్ ఆప్షన్‌లో లభిస్తుంది. 55 అంగుళాల నోకియా స్మార్ట్ టివి ఇంటెలిజెంట్ డిమ్మింగ్ టెక్నాలజీ, డాల్బీ విజన్ మరియు HDR10 వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ ప్రకాశవంతమైన, పదునైన మరియు మరింత స్పష్టమైన కంటెంట్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. దీనికి డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ మరియు డిటిఎస్ ట్రూసరౌండ్ టెక్నాలజీల మద్దతు కూడా ఉంది. ఈ టీవీలో శక్తివంతమైన ఆడియోను అందించడానికి కింద వైపు బాటమ్-ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి.

టెక్నాలజీ

టెక్నాలజీ

నోకియా యొక్క మొట్టమొదటి స్మార్ట్ టీవీ క్లియర్ వ్యూ టెక్నాలజీ మరియు క్లియర్ సౌండ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది డిజిటల్ స్ట్రీమ్ కంటెంట్ కోసం సౌండ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. 55-అంగుళాల 4K స్మార్ట్ టీవీ బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. అలాగే దీని యొక్క రిమోట్ లో నెట్‌ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ వంటి వాటి కోసం హాట్‌కీలను కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia 55-inch 4K Smart TV First Sale Start in India via Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X