Home
Gadgets

సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చే డివైస్‌ను విడుదల చేసిన నోకియా...

ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోకియా సంస్థ ఇప్పుడు మరొక కొత్త డివైస్ ను విడుదల చేసింది. మీడియా స్ట్రీమింగ్ కోసం కొత్తగా సంస్థ నోకియా మీడియా స్ట్రీమర్‌ను ఇండియాలో విడుదల చేసింది. నోకియా యొక్క ఈ మీడియా స్ట్రీమర్ ను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగష్టు 28 నుండి రూ.3,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

నోకియా మీడియా స్ట్రీమర్ OTT యాప్ లు

నోకియా మీడియా స్ట్రీమర్ OTT యాప్ లు

నోకియా సంస్థ కొత్తగా విడుదల చేసిన మీడియా స్ట్రీమర్ అనేది ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ టీవీల కోసం విడుదల చేసిన స్ట్రీమింగ్ డివైస్ లాంటిది. యూజర్ దీనిని తమ యొక్క టీవీకి సులభంగా కనెక్ట్ చేయవచ్చు. ఇది వివిధ రకాల OTT సేవలను మరియు మీడియా-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతించడం ద్వారా మీ యొక్క సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మారుస్తుంది.

 

నోకియా మీడియా స్ట్రీమర్‌ స్పెసిఫికేషన్స్

నోకియా మీడియా స్ట్రీమర్‌ స్పెసిఫికేషన్స్

నోకియా మీడియా స్ట్రీమర్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది క్వాడ్-కోర్ ప్రాసెసర్ మరియు మాలి 450 GPUతో రన్ అవుతూ 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ స్పేస్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. నోకియా కొత్తగా ప్రారంభించిన మీడియా స్ట్రీమింగ్ డివైస్ సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద 1920x1080 పిక్సెల్‌ల ఫుల్ HD రిజల్యూషన్‌ను అందిస్తుంది.

 

నోకియా మీడియా స్ట్రీమర్‌ కనెక్టివిటీ ఎంపికలు

నోకియా మీడియా స్ట్రీమర్‌ కనెక్టివిటీ ఎంపికలు

నోకియా మీడియా స్ట్రీమర్‌ డివైస్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 2.4 GHz / 5 GHz కోసం డ్యూయల్-బ్యాండ్ వైఫై మద్దతును కలిగి ఉంది. మెరుగైన రిసెప్షన్ కోసం ఇది మల్టీ I / O యాంటెనాను కలిగి ఉంటుంది. దానికి తోడు ఇది డాల్బీ డిజిటల్ ఆడియో మరియు అంతర్నిర్మిత క్రోమ్ క్యాస్ట్ ఫీచర్‌తో వస్తుంది. ఇది వినియోగదారుల యొక్క మొబైల్ ఫోన్ స్క్రీన్‌లను టీవీలో ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది.

నోకియా మీడియా స్ట్రీమర్ రిమోట్‌ ఫీచర్స్

నోకియా మీడియా స్ట్రీమర్ రిమోట్‌ ఫీచర్స్

నోకియా మీడియా స్ట్రీమర్ యొక్క రిమోట్‌ కూడా గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కంట్రోల్డ్ ఫీచర్ ను కలిగి ఉంది. అదనంగా నెట్‌ఫ్లిక్స్ మరియు Zee5 యాప్ లను నేరుగా యాక్సెస్ చేయడానికి రిమోట్ ప్రత్యేకమైన హాట్‌కీ బటన్లను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Nokia Media Streamer Released in India and Available on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X