Home
Gadgets

42.5 గంటల ప్లేబ్యాక్‌ టైం కలిగిన నథింగ్‌ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!

నథింగ్‌ సంస్థ ఇటీవల లాంచ్‌ చేసిన నథింగ్‌ ఇయర్‌(a) ఇయర్‌బడ్స్‌ (Nothing Ear(a) sale) సేల్‌ ప్రారంభం అయింది. ఈ ఇయర్‌బడ్స్‌ ధర రూ.7999 గా ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.5999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌ ఇవాళ్టి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గత మోడల్‌ కంటే భిన్నంగా నథింగ్‌ ఇయర్‌(a) డిజైన్ ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌ చాట్‌జీపీటీ వాయిస్‌ ఏఐ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ చాట్‌జీపీటీ ఫీచర్‌ ప్రస్తుతానికి నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. నథింగ్‌ ఫోన్‌ 2 ఇవాళ్టి నుంచి చాట్‌జీపీటీ సపోర్టును పొందనుంది. నథింగ్‌ ఫోన్‌ 1 మరియు ఫోన్‌ 2a హ్యాండ్‌సెట్‌లు రానున్న కొన్ని వారాల్లో ఈ అప్‌డేట్‌ను పొందనున్నాయి.

Nothing Ear a earbuds sale is live on flipkart price

నథింగ్‌ ఇయర్‌ (a) స్పెసిఫికేషన్లు : 11mm డైనమిక్‌ డ్రైవర్లు, 45dB ANC (యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) సపోర్టును కలిగి ఉంది. ఛార్జింగ్ కేస్ 500mAh బ్యాటరీని కలిగి ఉండగా.. ప్రతి ఇయర్‌ బడ్‌ 46mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఛార్జింగ్‌ కేస్‌తో కలిగి సింగిల్‌ ఫుల్‌ ఛార్జింగ్‌ ద్వారా 42.5 గంటల ప్లేబ్యాక్‌ టైంను కలిగి ఉంటుంది. రెండు పరికరాలతో ఒకేసారి కనెక్ట్‌ కావొచ్చని సంస్థ తెలిపింది.

ఈ నథింగ్‌ ఇయర్‌ ఇయర్‌బడ్స్‌ క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ ని కలిగి ఉంటుంది. ఫలితంగా కాల్స్ మాట్లాడుతున్న సమయంలో సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్‌ డ్యూయల్ కనెక్షన్‌, Low Lag మోడ్‌, pinch కంట్రోల్స్‌ సహా అనేక ఫీచర్లు కలిగి ఉంది.

అదే మరో మోడల్‌ నథింగ్‌ ఇయర్‌ సేల్‌ ఏప్రిల్‌ 29 నుంచి ప్రారంభం కానుంది. దీని ధర రూ.రూ.11,999 గా ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ 11mm డైనమిక్‌ డ్రైవర్లను కలిగి ఉంటుంది. డ్యూయల్‌ ఛాంబర్‌ డిజైన్‌ను మెరుగుపరిచినట్లు నథింగ్‌ వెల్లడించింది. మెరుగైన ఎయిర్‌ఫ్లో కోసం వెంట్స్‌ను జతచేసినట్లు తెలిపింది. ఫలితంగా మెరుగైన సౌండ్‌ సౌంతమని పేర్కొంది.

ఈ నథింగ్‌ ఇయర్‌ ఇయర్‌బడ్స్ LHDC 5.0 మరియు LDAC సపోర్టును కలిగి ఉంటుంది. నథింగ్ X యాప్‌ ద్వారా సొంత సౌండ్‌ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చని మరియు ANC సహా ఇతర అనేక ఫీచర్లను కలిగి ఉంటుందని తెలిపింది. అడాప్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో మూడు నాయిస్‌ క్యాన్సిలేషన్ లెవల్‌ను కలిగి ఉంటుంది 45dB నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను సపోర్టు చేస్తుంది.

నథింగ్‌ ఇయర్‌ను ఛార్జింగ్ కేస్‌తో సహా సింగిల్‌ ఫుల్‌ ఛార్జింగ్ ద్వారా 40.5 గంటలపాటు వినియోగించుకోవచ్చు. లేదా 8.5 గంటలపాటు ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు. మరియు ఈ ఇయర్‌బడ్స్‌ 2.5W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటాయి. పది నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటలవరకు సంగీతాన్ని వినోచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Ear a earbuds sale is live on flipkart here are the sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X