Home
Gadgets

40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్‌, ChatGPT వాయిస్‌ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్‌ విడుదల.. సేల్ వివరాలు!

నథింగ్‌ సంస్థ భారత్‌ మార్కెట్‌లో నథింగ్‌ ఇయర్‌ మరియు నథింగ్‌ ఇయర్‌(a) ఇయర్‌బడ్స్‌ను (Nothing Ear and Ear(a)) లాంచ్‌ చేసింది. గత మోడళ్ల మాదిరిగానే ఇయర్‌ డిజైన్‌ ఉండగా.. ఇయర్‌(a) మాత్రం సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఈ రెండు మోడళ్లు ChatGPT వాయిస్‌ AI తో ఇంటిగ్రేట్‌ చేశారు.

అయితే ఈ చాట్‌జీపీటీ ఫీచర్‌ ప్రస్తుతానికి నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. నథింగ్‌ ఫోన్‌ 2 ఇవాళ్టి నుంచి చాట్‌జీపీటీ సపోర్టును పొందనుంది. నథింగ్‌ ఫోన్‌ 1 మరియు ఫోన్‌ 2a హ్యాండ్‌సెట్‌లు రానున్న కొన్ని వారాల్లో ఈ అప్‌డేట్‌ను పొందనున్నాయి.

Nothing Ear and Ear a earbuds launched in india full details

నథింగ్‌ ఇయర్‌ స్పెసిఫికేషన్లు :
నథింగ్‌ ఇయర్‌.. 11mm డైనమిక్‌ డ్రైవర్లను కలిగి ఉంటుంది. డ్యూయల్‌ ఛాంబర్‌ డిజైన్‌ను మెరుగుపరిచినట్లు నథింగ్‌ సంస్థ వెల్లడించింది. మెరుగైన ఎయిర్‌ ఫ్లో కోసం వెంట్స్‌ను జతచేసినట్లు తెలిపింది. ఫలితంగా మెరుగైన సౌండ్‌ సౌంతమని పేర్కొంది.

ఈ నథింగ్‌ ఇయర్‌ ఇయర్‌బడ్స్ LHDC 5.0 మరియు LDAC సపోర్టును కలిగి ఉంటుంది. నథింగ్ X యాప్‌ ద్వారా సొంత సౌండ్‌ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చని మరియు ANC సహా ఇతర అనేక ఫీచర్లను కలిగి ఉంటుందని తెలిపింది. అడాప్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో మూడు నాయిస్‌ క్యాన్సిలేషన్ లెవల్‌ను కలిగి ఉంటుంది 45dB నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను సపోర్టు చేస్తుంది.

నథింగ్‌ ఇయర్‌ను ఛార్జింగ్ కేస్‌తో సహా సింగిల్‌ ఫుల్‌ ఛార్జింగ్ ద్వారా 40.5 గంటలపాటు వినియోగించుకోవచ్చు. లేదా 8.5 గంటలపాటు ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు. మరియు ఈ ఇయర్‌బడ్స్‌ 2.5W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటాయి. పది నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటలవరకు సంగీతాన్ని వినోచ్చు.

ఈ నథింగ్‌ ఇయర్‌ ఇయర్‌బడ్స్‌ క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ ని కలిగి ఉంటుంది. ఫలితంగా కాల్స్ మాట్లాడుతున్న సమయంలో సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్‌ డ్యూయల్ కనెక్షన్‌, Low Lag మోడ్‌, pinch కంట్రోల్స్‌ సహా అనేక ఫీచర్లు కలిగి ఉంది.

నథింగ్‌ ఇయర్‌(a) ఫీచర్లు..
నథింగ్‌ ఇయర్‌ (a) 11mm డైనమిక్‌ డ్రైవర్లు, 45dB ANC (యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) సపోర్టును కలిగి ఉంది. ఛార్జింగ్ కేస్ 500mAh బ్యాటరీని కలిగి ఉండగా.. ప్రతి ఇయర్‌ బడ్‌ 46mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఛార్జింగ్‌ కేస్‌తో కలిగి సింగిల్‌ ఫుల్‌ ఛార్జింగ్‌ ద్వారా 42.5 గంటల ప్లేబ్యాక్‌ టైంను కలిగి ఉంటుంది. రెండు పరికరాలతో ఒకేసారి కనెక్ట్‌ కావొచ్చని సంస్థ తెలిపింది.

నథింగ్ ఇయర్‌(a) ధర రూ.7999గా ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ ఏప్రిల్‌ 22 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అదే నథింగ్ ఇయర్ ధర రూ.11,999గా ఉంది. వీటిని ఏప్రిల్ 29 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ నథింగ్‌ కొత్త ఇయర్‌బడ్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ ఆఫర్‌లో భాగంగా నథింగ్‌ ఇయర్‌(a) ను రూ.5999, నథింగ్‌ ఇయర్‌ను రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Nothing Ear and Ear a earbuds launched in india with ChatGPT Voice AI support
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X