Home
Gadgets

Nothing Ear నథింగ్‌ నుంచి కొత్త ఇయర్‌బడ్స్‌.. భారత్‌లో ఏప్రిల్‌ 18న విడుదల.. పూర్తి వివరాలు..!

నథింగ్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 18న నథింగ్‌ ఇయర్‌ మరియు నథింగ్‌ ఇయర్‌ (a) (Nothing Ear and Ear (a) ) ఆడియో ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో లాంచ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్‌ X (ట్విట్టర్‌) వేదికగా ఈ ప్రకటన చేసింది.

పేర్లలో కొత్త వ్యూహం :
గత మూడు సంవత్సరాలుగా ఈ రెండు ఆడియో ఉత్పత్తుల డిజైన్‌ సహా అనేక అంశాలపై పనిచేసినట్లు తెలిపింది. ఈ నథింగ్‌ ఇయర్‌, ఇయర్‌ (a) ప్రీమియం పనితీరును అందిస్తాయని సంస్థ తెలిపింది. తన ఉత్పత్తులకు పేర్లు పెట్టే విషయంలోనూ మార్పులు చేసినట్లు తెలిపింది. అందుకే పేర్లలో అంకెలను తీసివేసినట్లు తెలిపింది.

Nothing Ear and Ear  a

BIS సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో :
అయితే ఈ ఆడియో ఉత్పత్తుల వివరాలను నథింగ్‌ సంస్థ వెల్లడించలేదు. అయితే B162 మోడల్‌ నంబర్‌తో ఇయర్‌ఫోన్‌ సెట్‌ BIS సర్టిఫికేషన్‌ వెబ్‌ సైట్‌లో గుర్తించబడ్డాయి. అయితే ఈ మోడల్‌ నంబర్ నథింగ్‌ ఆడియో ఉత్పత్తులకు సంబంధించినవి అని తెలిసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్‌ ఇయర్‌ (2) రూ.10,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.

పాత మోడల్‌ ఎలాంటి స్పెసిఫికేషన్లు కలిగి ఉందంటే :
నథింగ్ ఇయర్‌ (2) ఇయర్‌బడ్స్‌ 11.6mm సైజ్‌ను కలిగి ఉన్నాయి. పాత మోడల్‌ కంటే డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. అయితే నథింగ్‌ ఇయర్‌ (2) బడ్స్‌ యూక్టివ్‌ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ నాయిస్‌ను తొలగిస్తుంది. LHDC 5.0 టెక్నాలజీ పైన పనిచేస్తుంది. ఫలితంగా అధిక నాణ్యతతో కూడిన ఆడియోను ఆస్వాదించవచ్చు.

36 గంటలపాటు ప్లేబ్యాక్‌ టైం :
కాల్స్‌ కోసం ఈ ఇయర్‌ బడ్స్‌ వాయిస్‌ టెక్ మరియు AI నాయిస్ రిడక్షన్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. మరియు ప్రతి ఇయర్‌బడ్‌ 3 మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. ANC ఫీచర్‌ ఆఫ్‌ చేసి సింగిల్ ఛార్జింగ్‌ ద్వారా 36 గంటలపాటు ప్లేబ్యాక్‌ టైం ను కలిగి ఉంటుంది.

వాటర్‌ రెసిస్టెన్స్‌తో.. :
నాయిస్‌ X యాప్‌ ద్వారా ఇయర్‌ బడ్స్‌ను నియంత్రించవచ్చు. ఇయర్‌బడ్స్‌ IP54 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటాయి. అదే ఛార్జింగ్ కేస్‌ IP55 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. అయితే త్వరలో విడుదల కానున్న నథింగ్‌ ఇయర్‌, ఇయర్‌ (a) ల ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Ear and Ear a will be launched on april 18 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X