80 గంటల బ్యాటరీ లైఫ్, ఆకట్టుకొనే ఆడియో అవుట్‌పుట్‌తో హెడ్‌ఫోన్స్.. ధర, సేల్ వివరాలు..!
Nothing Headphone 1 : నథింగ్ నుంచి తాజాగా నథింగ్ ఫోన్ 3 తోపాటు నథింగ్ హెడ్‌ఫోన్ 1 విడుదల అయింది. నథింగ్ ఫస్ట్ Over Ear హెడ్‌ఫోన్‌గా అందుబాటులోకి వచ్చింది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌తోపాటు టెక్నాలజీ పరంగా మంచి ఫీచర్లను కలిగి ఉంది. నథింగ్ ఫోన్‌ల తరహాలోనే ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ నథింగ్ హెడ్‌ఫోన్ 1 పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
నథింగ్ హెడ్‌ఫోన్ 1 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ నథింగ్ హెడ్‌ఫోన్స్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్, దీర్ఘచతురస్రాకార బాడీని కలిగి ఉంది. ఇవి 40mm డైమనిక్ డ్రైవర్స్‌ను కలిగి ఉంది. 42dB ANC ను సపోర్టు చేస్తుంది. ఈ హెడ్‌ఫోన్ KEF ట్యూనింగ్ చేయబడ్డాయి.\

ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ :
ఈ నథింగ్ హెడ్‌ఫోన్ 1 మెరుగైన కాలింగ్ కోసం ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్టును కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 5.1 మరియు iOS 13 లేదా అప్‌డేట్ వెర్షన్ డివైజ్‌లతో కనెక్ట్ చేయవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్ టచ్ కంట్రోల్స్ బదులుగా ప్రత్యేకమైన బటన్‌లను కలిగి ఉంటాయి.
బ్లూటూత్ 5.3 :
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3 ను సపోర్టు చేస్తుంది. AAC, LDAC, ఆడియో కోడిక్‌లను సపోర్టు చేస్తుంది. డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్ 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. మరియు USB-C ఛార్జింగ్ పోర్టుతో అందుబాటులోకి వచ్చింది.
80 గంటల బ్యాటరీ లైఫ్ :
నథింగ్ హెడ్‌ఫోన్ 1 ఎక్కువ సమయం బ్యాటరీ లైఫ్ ఇచ్చేందుకు వీలుగా ఏకంగా 1040mAh బ్యాటరీని అమర్చారు. 120 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ చేయవచ్చు. సింగిల్ ఛార్జింగ్‌తో AAC ఆడియో, ANC ఆఫ్ ఫార్మాట్‌లో 80 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
5 నిమిషాల ఛార్జింగ్.. 5 గంటల ప్లేబ్యాక్ టైం :
మరియు ANC ఆఫ్, LDAC ఆడియో ఆఫ్షన్ లో 54 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ANC ఆన్ చేసి ఉపయోగిస్తుంటే 35 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను (ANC Off) పొందవచ్చు.
నథింగ్ హెడ్‌ఫోన్ 1 ధర, సేల్ వివరాలు :
నథింగ్ హెడ్‌ఫోన్ 1 భారత్ మార్కెట్‌లో రూ.21990 గా ఉంది. జులై 15 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ హెడ్‌ఫోన్ ధర రూ.21990 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, మింత్రా, విజయ్ సేల్స్, క్రోమా సహా ఇతర రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఈ నథింగ్ హెడ్‌ఫోన్ 1 ను తొలి రోజు రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్‌ఫోన్ బ్లాక్, వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. జులై 15 నే నథింగ్ ఫోన్ 3 కూడా సేల్ ప్రారంభం కానుంది.
* నథింగ్ ఫోన్ 3 6.67 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 5500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. మొత్తంగా నాలుగు 50MP కెమెరాలను కలిగి ఉంది. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ ఆఫర్లతో కలిపి ప్రారంభ ధర రూ.62999 గా ఉంది.


Click it and Unblock the Notifications








