Home
Gadgets

నథింగ్‌ హెడ్‌ఫోన్స్‌ 1 బ్యాటరీ లైఫ్‌, ANC సహా కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్‌.. రేపే విడుదల..!

Nothing Headphones 1 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్ నుంచి జులై 1 వ తేదీన నథింగ్‌ ఫోన్‌ 3, నథింగ్‌ హెడ్‌ఫోన్స్‌ 1 విడుదల కానున్నాయి. తొలిసారిగా ఈ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 54 గంటల వరకు ఉపయోగించుకోవచ్చని నథింగ్ చెబుతోంది. ఈ హెడ్‌ఫోన్స్ గురించి కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ హెడ్‌ఫోన్స్‌ ANC ఫీచర్‌తోపాటు స్పేషియల్‌ ఆడియో సపోర్టును కలిగి ఉంది.

కీలక వివరాలు లీక్‌ :
నథింగ్‌ హెడ్‌ఫోన్స్ 1 ఓవర్‌ ఇయర్‌ డిజైన్‌లో లాంచ్‌ కానున్నాయి. తాజాగా టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్, ఆండ్రాయిడ్‌ హెడ్‌లైన్స్‌ ద్వారా కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ ఆడియో ప్రొడక్ట్‌ 40mm PU మరియు నికిల్‌ కోటెడ్‌ డైనమిక్‌ డ్రైవర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Nothing Headphones 1 specs leaked

దీంతోపాటు ఈ నథింగ్ హెడ్‌ఫోన్స్ 1.. 42dB యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) ఫీచర్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. 8 బ్యాండ్‌ ఈక్వలైజర్‌, అడాప్టి్వ్ బాస్‌ ఎన్‌హాన్స్‌మెంట్, స్పేషియల్‌ ఆడియో, ఆన్ ఇయర్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

నథింగ్‌ హెడ్‌ఫోన్స్‌ 1.. నథింగ్‌ X యాప్‌ ద్వారా AAC, SBC, LDAC కోడిక్‌ వంటి అనేక సెట్టింగ్స్‌ను మార్పులు చేసుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు గూగుల్ ఫాస్ట్ పెయిర్‌, మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌ పెయిర్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. హెడ్‌ఫోన్స్‌ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ మరియు ఛార్జింగ్‌ స్టేటస్‌ కోసం LED ఇండికేటర్‌ ను కలిగి ఉంటుంది.

భారీ బ్యాటరీ లైఫ్‌ :
అయితే ఛార్జింగ్ పరంగా ఈ హెడ్‌ఫోన్స్‌ అధిక బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన నివేదికల ఆధారంగా నథింగ్‌ హెడ్‌ఫో‌న్స్‌ 1.. ఏకంగా 1040mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 80 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను (ANC Off- AAC Codec) పొందుతుందని తెలుస్తోంది.

అయితే ANC ఫీచర్‌ ఉపయోగిస్తూ ఉంటే బ్యాటరీ లైఫ్ 35 గంటలుగా ఉంటుంది. ANC Off మరియు LADC కోడిక్ ఆప్షన్‌లో బ్యాటరీ లైఫ్ 54 గంటలగా ఉంటుందని తెలుస్తోంది. దీనిపై రేపు అధికారికంగా వివరాలు వెల్లడి కానున్నాయి.

Take a Poll

* నథింగ్‌ ఫోన్‌ 3 కూడా రేపే విడుదల కానుంది. ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్‌, గేమింగ్ కు మెరుగైన పనితీరు అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇటీవల వచ్చిన నివేదికల ఆధారంగా 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు 32MP లేదా 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ 6.7 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 5150mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు 100W వైర్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. మరియు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Headphones 1 battery life and specifications leaked ahead of launch on tomorrow
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X