నథింగ్ సబ్‌బ్రాండ్ CMF బడ్స్ ప్రో 2, వాచ్ ప్రో 2 విడుదల.. 43 గంటల బ్యాటరీ లైఫ్ సహా కీలక ఫీచర్‌లు..!
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF భారత్ మార్కెట్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తోపాటు CMF బడ్స్ ప్రో 2, CMF వాచ్ ప్రో 2 ను (CMF Buds pro 2 Launched) కూడా లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ డ్యూయల్ డ్రైవర్లను కలిగి ఉంటాయి. 50dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో పనిచేస్తాయి. ఈ బడ్స్ సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 43 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్నాయి. ఈ వాచ్ సింగిల్ ఛార్జింగ్‌తో 11 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందుతుంది.
CMF బడ్స్ ప్రో 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు : CMF బడ్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్ డ్యూయల్ డ్రైవర్లను కలిగి ఉంది. ఇందులో 11mm బాస్ డ్రైవర్ మరియు 6mm మైక్రో ప్లానర్ ట్విటర్ ఉన్నాయి. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్ 50dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ (ANC) తో అందుబాటులో ఉంది.

ఈ ANC లో ట్రాన్సరెన్సీ, అడాప్టివ్, స్మార్ట్ వంటి 3 Modes ఉన్నాయి. బడ్స్ ప్రో 2 లోని ప్రతీ బడ్స్ మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. కాలింగ్ సమయంలో మెరుగైన అనుభూతి కోసం ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్‌ను కలిగి ఉంటాయి.
CMF బడ్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్ Dirac Opteo సపోర్టును కలిగి ఉంటాయి. నథింగ్ X యాప్ ద్వారా EQ కస్టమైజేషన్‌తోపాటు బ్లూటూత్ కోడెక్, స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్‌లకు సపోర్టు చేస్తాయి. ఈ నథింగ్ X యాప్ చాట్‌జీపీటీతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఫలితంగా నథింగ్ ఫోన్ లేదా CMF ఫోన్‌ల ద్వారా ఈ బడ్స్‌ను వినియోగించి కూడా AI బాట్‌తో కనెక్ట్ కావచ్చు.
ఈ సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్ స్మార్ట్ డయల్ ను కలిగి ఉంటుంది. ఈ డయల్ ద్వారా వాల్యూమ్ (Sound) ను నియంత్రించవచ్చు. మరియు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్‌లో మార్పులు చేయవచ్చు. బ్లూటూత్ 5.3 పైన పనిచేస్తుంది.
ఈ బడ్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్‌లో ప్రతి బడ్ 60mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఛార్జింగ్ కేస్ 460mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసేందుకు 70 నిమిషాల సమయం పడుతుంది. దీని ద్వారా గరిష్ఠంగా 43 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.
CMF బడ్స్ ప్రో 2 ధర :
ఈ CMF బడ్స్ ప్రో 2 ధర రూ.4299 గా ఉంది. జులై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ బ్లూ, డార్క్ గ్రే, లైట్ గ్రే, ఆరెంజ్ రంగుల్లో లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో CMF ఫోన్1 తోపాటు ఈ బడ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

CMF వాచ్ ప్రో 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
CMF వాచ్ ప్రో 2.. 1.32 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్ 466*466 రిజల్యూషన్, 60Hz, 620 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌వాచ్ మార్చుకొనేందుకు అవకాశం ఉన్న బెజెల్స్ మరియు స్ట్రాప్‌తో అందుబాటులో ఉంది. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, 120 కంటే స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ సహా మహిళల్లో రుతుక్రమాన్ని పర్యవేక్షించగలదు. CMF వాచ్ యాప్ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. బ్లూటూత్ 5.3, GPS, Glonass, QZ55, Beidou కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా కాల్స్ చేయడం సహా కాల్స్ స్వీకరించేందుకు అవకాశం ఉంది.

CMF వాచ్ ప్రో 2 స్మార్ట్‌వాచ్ 305mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 11 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. జులై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా CMF ఫోన్ 1 తోపాటు ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.
CMF వాచ్ ప్రో 2 స్మార్ట్‌వాచ్ (CMF Watch pro 2) గ్రే, డార్క్ గ్రే రంగుల వేరియంట్ ధర రూ.4999 గా ఉంది. అదే బ్లూ, ఆరెంజ్ వేగాన్ లెదర్ వేరియంట్ ధర రూ.5499 గా ఉంది. అయితే అదనంగా రూ.749 చెల్లించడం ద్వారా.. అదనంగా బెజెల్స్ మరియు స్ట్రాప్‌లను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








