Home
Gadgets

సగం ధరకే 13 రోజుల బ్యాటరీ లైఫ్‌, 1.96 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!

నథింగ్ సబ్‌బ్రాండ్‌ CMF నుంచి గత సంవత్సరం CMF వాచ్‌ ప్రో విడుదల అయింది. ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు హెల్త్‌ ట్రాకర్లు సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. మరియు సింగిల్‌ ఛార్జింగ్‌తో ఏకంగా 13 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని సంస్థ చెబుతోంది. అయితే విడుదల సమయంలో ఈ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.5,000 గా ఉండేది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ ధరకే (CMF Watch Pro Price Drop) కొనుగోలు చేయవచ్చు.

CMF వాచ్‌ ప్రో అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. వీటితోపాటు డిస్‌ప్లే మరియు బ్యాటరీతోపాటు హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంది. దీంతోపాటు ప్రీమియం డిజైన్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.2,999 గా ఉంది. అంటే విడుదల ధరతో పోలిస్తే సగం ధరకే ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఎన్ని రోజులపాటు ఉంటుందో ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించలేదు.

CMF watch pro available at 50 percent discount on flipkart

ఈ CMF వాచ్‌ ప్రో 1.96 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ Always On Display ఫీచర్‌తో పనిచేస్తుంది. ఈ వాచ్‌ చతురస్రాకార డిజైన్‌తో అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

CMF స్మార్ట్‌వాచ్‌లో అనేక హెల్త్‌ ట్రాకర్లు ఉన్నాయి. హార్ట్‌ రేట్ మానిటర్‌, SpO2 సెన్సార్‌, స్లీప్‌ ట్రాకర్ (నిద్ర), ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లున్నాయి. దీంతోపాటు స్మార్ట్‌ నోటిఫికేషన్‌లు, వాతావరణ సమాచారం, రిమోట్‌ కంట్రోల్‌ ఫీచర్లలు, బ్లూటూత్‌ 5.3, GPS కూడా CMF వాచ్ ప్రో కలిగి ఉంది. ఫోన్‌ కాల్‌లో నాణ్యత కోసం AI ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది.

CMF watch pro available at 50 percent discount on flipkart

CMF వాచ్ ప్రో 330mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేసి, 13 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. Always On Display ఫీచర్‌ ఆఫ్‌లో ఉన్నప్పుడు మాత్రమే 13 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. CMF వాచ్‌ ప్రో 100కు పైగా వాచ్ ఫేస్‌లు, 110 స్పోర్ట్స్‌ మోడ్స్‌ ను పొందుతుందని నథింగ్‌ హామీ ఇచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్ సేల్ 2024 సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లు 26 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మరియు EMI ప్రయోజనాలకు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సూపర్‌ మనీ యాప్‌ ద్వారా UPI పేమెంట్లు చేస్తే క్యాష్‌బ్యాక్‌లకు పొందవచ్చని తెలిపింది.

ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా నథింగ్‌ ఫోన్‌ 2a, నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ మోడళ్లు సహా శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌లను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు మరిన్ని ‌బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్‌లు, సహా ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

మరోవైపు అమెజాన్‌ కూడా గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్ పేరిట సెప్టెంబర్‌ 27 నుంచి సేల్ నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లు సెప్టెంబర్‌ 26 అర్ధరాత్రి 12 గంటల నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. SBI కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. నోకాస్ట్‌ EMI, అమెజాన్‌ పే, కూపన్‌ కోడ్‌ల ద్వారా మరిన్ని తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Nothing Sub Brand CMF watch pro available at 50 percent discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X