Home
Gadgets

నథింగ్‌ నుంచి తొలి హెడ్‌ఫోన్స్‌ 'Nothing headphone 1' .. విడుదల తేదీ, ఇతర వివరాలు..!

ప్రముఖ స్మా్ర్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్‌ నుంచి జులై 1 వ తేదీన నథింగ్‌ ఫోన్‌ 3 విడుదల కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఈ ఫోన్ నథింగ్‌ తొలి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా లాంచ్‌ కానుంది. మరియు ప్రీమియం మెటీరియల్స్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్‌ల కంటే అధిక ధరకు లాంచ్‌ కానుంది.

ఏ పేరుతో విడుదల చేస్తున్నారు :
అయితే తాజాగా నథింగ్‌ నుంచి మరో కీలక ప్రకటన వచ్చింది. నథింగ్‌ హెడ్‌ఫోన్ 1 పేరుతో (Nothing Headphone 1) తొలిసారిగా హెడ్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ వివరాలను సంస్థ సీఈవో కార్ల్ పై వెల్లడించారు. Over ear Audio విభాగంలో తొలి ఉత్పత్తిని తీసుకొస్తున్నట్లు తెలిపారు.

nothing headphone 1

లండల్‌ SXSW లో వివరాలను వెల్లడించారు. గ్లోబల్‌ లాంచ్ ఈవెంట్‌ లండన్‌లోనే జరగనుంది. అయితే ఈ హెడ్‌ఫోన్‌ వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే లీకైన వివరాల ఆధారంగా నథింగ్‌ హెడ్‌ఫోన్‌ 1 ధర $299 గా (భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.25,655) ఉండనుంది. దీంతోపాటు ఈ హెడ్‌ఫోన్స్ బ్లాక్ మరియు వైట్ కలర్ వేరియంట్స్‌లో లభించనున్నాయని తెలుస్తోంది.

లాంచ్ ఈవెంట్‌ వివరాలు :
నథింగ్ ఈవెంట్‌ జులై 1, 6:00 BST గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఇందులో నథింగ్‌ ఫోన్‌ 3 తోపాటు నథింగ్‌ హెడ్‌ఫోన్‌ 1 లాంచ్‌ కానుంది. ఈ లైవ్‌ ఈవెంట్‌ను నథింగ్‌ సంస్థ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వీక్షించవచ్చు.

నథింగ్‌ ఫోన్‌ 3 :
నథింగ్‌ ఫోన్‌ 3 గురించి ఇప్పటికే అనేక లీక్స్‌ వచ్చాయి. దీంతోపాటు సంస్థ కూడా కొన్ని వివరాలను వెల్లడించింది. ఇటీవల సంస్థ షేర్ చేసిన టీజర్‌ ఆధారంగా నథింగ్‌ ఫోన్‌లలో ప్రముఖంగా ఉన్న గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ ను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్‌ నథింగ్‌ నుంచి వస్తున్న తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంటుంది.

నథింగ్‌ ఫోన్ 3 స్నాప్‌డ్రాగన్‌ 8 Elite లేదా స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 4 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. 16GB ర్యామ్ మరియు UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సాఫ్ట్‌వేర్ పరంగా బెస్ట్ ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

డిస్‌ప్లే పరంగా 120Hz రీప్రెష్‌ రేట్‌, 3000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా ప్రైమరీ, అల్ట్రావైడ్‌, టెలిఫోటో లెన్స్‌లు ఉంటాయని తెలుస్తోంది. 50W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.

ధర వివరాలు ఇప్పటికే సంస్థ సీఈవో వెల్లడించారు. దీంతోపాటు ఇటీవల లీక్‌ అయిన వివరాల ఆధారంగా నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర $799 అంటే (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.68,295) గా ఉంటుందని తెలుస్తోంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర $899 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.76,839) గా ఉంటుందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Nothing to launch first headphones called nothing headphone 1 on july 1, here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X