కేవలం రూ.99 కే ఇయర్‌బడ్స్.. 99 నిమిషాల వరకే అవకాశం..!
నథింగ్ సంస్థ భారత్‌లో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనుంది. తొలి స్టోర్ ఫిబ్రవరి 14 వ తేదీన బెంగళూరులో (Bengaluru Nothing Store) ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా CMF బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌ను (Nothing Phone 2 Earbuds) కేవలం రూ.99 ధరకే అందిస్తామని తెలిపింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ఈ ధరకు అందిస్తామని వెల్లడించింది.
రూ.99 ధరకే ఇయర్‌బడ్స్ :
సీఎంఎఫ్ బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌ను బెంగళూరు రిటైల్ స్టోర్ ప్రారంభించిన తొలి 99 నిమిషాల వరకు రూ.99 ధరకు అందిస్తామని ప్రకటించింది. ఆఫర్ సమయం ముగిసిపోయాక రూ.2299 ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం బెంగళూరు రిటైల్ స్టోర్‌కే పరిమితమని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో సాధారణ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఇతర ప్రత్యేక ఆఫర్లు :
బెంగళూరులో నథింగ్ రిటైల్ స్టోర్ ప్రారంభం సందర్భంగా CMF బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌తోపాటు నథింగ్ ఫోన్‌ల కొనుగోలుపైనా ప్రత్యేక ఆఫర్లను అందిస్తామని తెలిపింది. నథింగ్ ఫోన్ 3 కొనుగోలుపై రూ.5999 విలువైన నథింగ్ Ear (a) బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రో మోడల్స్ పై CMF బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపింది. నథింగ్ ఫోన్ 3a లైట్, CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపైనా ఈ బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు బెంగళూరు రిటైల్ స్టోర్‌లో తొలి రోజు కొనుగోలు చేసిన అన్ని ఉత్పత్తులపై 3 నెలలపాటు అదనపు వారంటీని అందిస్తామని తెలిపింది.
రిటైల్ స్టోర్ ఎక్కడ ప్రారంభం కానుందంటే :
భారత్‌లో నథింగ్ తొలి రిటైల్ స్టోర్ బెంగళూరులో 660/1, 100 ఫీట్ రోడ్, స్టేజ్ 1, ఇందిరానగర్ లో ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. పైన తెలిపిన అన్ని ఆఫర్లు బెంగళూరు రిటైల్ స్టోర్‌కే పరిమితమని నథింగ్ స్పష్టం చేసింది.
* CMF బడ్స్ 2 ఇయర్‌బడ్స్ Dirac Opteo ట్యూనింగ్, N52 మ్యాగ్నట్స్‌తో 11mm PMI డ్రైవర్లను కలిగి ఉంది. 48dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టును కలిగి ఉంది. ఈ బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది. గేమింగ్ కోసం 110ms Low Latecy Rate ను కలిగి ఉంది. స్పేషియల్ ఆడియో, విండ్ నాయిస్ రిడక్షన్ 3.0, క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0 కూడిన 6 HD మైక్రోఫోన్‌లను కలిగి ఉంది.
CMF బడ్స్ 2 ఇయర్‌బడ్స్ 460mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 55 గంటల (ANC Off) బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 7.5 గంటల ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








