OnePlus buds 3 విడుదల.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సహా 44 గంటల ప్లేబ్యాక్ టైం..!
వన్‌ప్లస్ నిర్వహించిన స్మూత్ బియాండ్ బిలీఫ్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో వన్‌ప్లస్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు సహా వన్‌ప్లస్ 3వ జనరేషన్ బడ్స్ onePlus buds 3 ను విడుదల చేసింది. ఈ బడ్స్ గ్లోసీ ఫినిష్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. వన్‌ప్లస్ బడ్స్ 2 ప్రోను పోలి ఉన్నాయి. ఈ బడ్స్ ధర, ఫీచర్లు వంటి వివరాలపై ప్రత్యేక కథనం.
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్: వన్‌ప్లస్ బడ్స్ 3 10.4mm వూఫర్ సహా 6mm ట్వీటర్‌ను కలిగి ఉంది. ఇయర్ బడ్ బరువు 4.8 గ్రాములుగా ఉంది. ఈ వన్‌ప్లస్ 3 వ జనరేషన్ బడ్స్ 15Hz నుంచి 40Hz ఫ్రీక్వెన్సీతో వస్తాయి. ఇవి 49dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి.

దీంతోపాటు 20dB, 10dB నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందించే రెండు వేర్వేరు స్థాయి ANC ని కలిగి ఉంది. LHDC 5.0 హైరెస్ ఆడియో సపోర్ట్, టచ్ కంట్రోల్, IP55 రేటింగ్‌తో వస్తాయి. డైనమిక్ బాస్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. అదనపు సౌలభ్యం కోసం స్లైడింగ్ వాల్యూమ్ నియంత్రణలను కలిగి ఉంది.
వన్‌ప్లస్ బడ్స్ 3 ప్రతి బడ్ 58mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఛార్జింగ్ కేస్ 520mAh బ్యాటరీతో వస్తుంది. ANC మోడ్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇయర్‌బడ్స్ 6.5 గంటల ప్లేబ్యాక్ టైంను అందిస్తాయి. అదే ఛార్జింగ్ కేస్‌తో సహా గరిష్ఠంగా 28 గంటల ప్లే బ్యాక్ సమయం ఉంటుంది. ANC మోడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు గరిష్ఠంగా 44 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని కలిగి ఉంటుంది.

బడ్స్ ధర రూ.5499 : వన్‌ప్లస్ బడ్స్ 3 USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని 10 నిమిషాల ఛార్జింగ్‌పై 7 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. ఇవి మెటాలిగ్ గ్రే మరియు స్ల్పెండిడ్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. భారత్‌లో ఈ బడ్స్ ధర రూ.5499గా ఉంది. ఫిబ్రవరి 6 నుంచి వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
* వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్ 6.82 అంగుళాల 2k ప్రో XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 3168*1440 రిజల్యూషన్‌తో వస్తుంది. LTPO టెక్నాలజీ సపోర్టుతో వస్తుంది. ఫలితంగా రీఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hz వరకు ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది.

ఈ ఫోన్ 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందువైపు పంచ్ హోల్ స్టైల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ముందువైపు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంటుంది. అదే వెనుకవైపు కార్నింగ్ గ్లాస్ 5 రక్షణను పొందుతుంది.
* వన్‌ప్లస్ 12r స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు: వన్‌ప్లస్ 12r స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k 10 bit అమోలెడ్ ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. HDR10+, LTPO4 సపోర్టుతో వస్తుంది. LTPO 4వ టెక్నాలజీని కలిగి ఉన్న తొలి వన్‌ప్లస్ ఫోన్‌గా 12r నిలిచింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది. ఇవి స్పష్టమైన విజువల్, అల్ట్రా స్మూత్ స్క్రోలింగ్‌ను అందిస్తాయని సంస్థ పేర్కొంది.


Click it and Unblock the Notifications








