Home
Gadgets

45 గంటల ప్లేబ్యాక్ టైంతో వన్‌ప్లస్‌ బడ్స్ 4 విడుదల.. ఫీచర్లు, ధర, సేల్‌ వివరాలు..!

OnePlus Buds 4 : వన్‌ప్లస్‌ సమ్మర్‌ ఈవెంట్‌లో భాగంగా నార్డ్ 5 సిరీస్‌ తోపాటు వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 కూడా విడుదల అయ్యాయి. ఈ TWS బడ్స్‌ అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఈ వన్‌ప్లస్‌ బడ్స్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 45 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ బడ్స్ AI ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ బడ్స్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ బడ్స్‌ ఇన్‌ ఇయర్‌ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. 11mm 30 లేయర్‌ సిరామిక్‌ మెటల్‌ వూఫర్స్‌, 6mm ఫ్లాట్‌ ట్వీకర్స్‌ తో కూడిన DAC యూనిట్స్‌ ను కలిగి ఉంది.

Oneplus Buds 4 launch telugu  news

ఈ వన్‌ప్లస్‌ కొత్త బడ్స్‌ 3D ఆడియో సపోర్టుతో Hi-Res వైర్‌లెస్‌ ఆడియో సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. ఈ బడ్స్‌ మెరుగైన అనుభూతిని అందిస్తాయని వన్‌ప్లస్‌ చెబుతోంది. గేమింగ్‌ మోడ్‌ లో 47ms అల్ట్రా లో లేటెన్సీ ను సపోర్టు చేస్తుంది.

ఈ బడ్స్‌ 55dB అడాప్టివ్‌ ANC ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌ AI ఆధారిత కాల్‌ నాయిస్‌ రిడక్షన్‌ సపోర్టుతో కూడిన 3 మైక్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ బడ్స్‌ AI ట్రాన్స్‌లేషన్‌ ను సపోర్టు చేస్తాయి. IP55 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది.

వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 ఇయర్‌బడ్స్‌ బ్లూటూత్ 5.4, డ్యూయల్‌ డివైజ్‌ కనెక్టివిటీ మరియు LHDC 5.0 ఆడియో కోడిక్‌ను సపోర్టు చేస్తుంది. స్టడీ కనెక్ట్‌ టెక్నాలజీ సపోర్టుతో సౌకర్యవంతంగా బ్లూటూత్‌ కనెక్టివిటీ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చని వన్‌ప్లస్‌ చెబుతోంది.

వన్‌ప్లస్‌ బడ్స్ 4 ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 45 గంటల ప్లేబ్యాక్‌ టైంను (ఛార్జింగ్‌ కేస్‌తోపాటు) పొందవచ్చు. అయితే కేవలం బడ్స్‌ మాత్రమే 11 గంటల ప్లేటైంను అందిస్తాయని వన్‌ప్లస్‌ చెబుతోంది. ఈ ప్లేబ్యాక్‌ టైం ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ANC ఆఫ్‌ చేసి ఉపయోగిస్తుంటే.. ఈ ప్లేబ్యాక్‌ టైం తగ్గుతుంది. 10 నిమిషాల క్లిక్‌ ఛార్జ్‌ సపోర్టుతో 11 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

Oneplus Buds 4 launch telugu  news

వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 ధర, సేల్ వివరాలు :
భారత్‌ మార్కెట్‌ లో ఈ బడ్స్‌ ధర రూ,5999 గా ఉంది. జులై 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. తొలి సేల్‌ లో భాగంగా రూ.500 డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

ఈ బడ్స్‌ను వన్‌ప్లస్ ఇండియా ఇ-స్టోర్‌, వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్ సహా ఇతర రిటైల్‌ స్టోర్స్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఈ వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 స్ట్రోమ్‌ గ్రే, జెన్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Buds 4 launched in india with 45 hous of play back time and ANC support
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X