Home
Gadgets

45 గంటల బ్యాటరీ లైఫ్‌, AI కాల్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో వన్‌ప్లస్‌ బడ్స్ 4.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు

వన్‌ప్లస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లో జులై 8 వ తేదీన వన్‌ప్లస్‌ నార్డ్ 5 సిరీస్‌, వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 విడుదల కానున్నాయి. ఇప్పటికే వన్‌ప్లస్‌ నార్డ్ 5, వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 ఫోన్‌లకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 TWS ఇయర్‌బడ్స్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను వన్‌ప్లస్‌ సంస్థ వెల్లడించింది. 2024 తొలి రోజుల్లో వన్‌ప్లస్ బడ్స్ 3 విడుదల కాగా.. వచ్చేవారం బడ్స్ 4 విడుదల కానున్నాయి.

నాయిస్‌ క్యాన్సిలేషన్‌ :
ఇప్పటికే ఈ బడ్స్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ వివరాలు సహా ఇతర ఫీచర్ల సమాచారం వెల్లడయింది. అయితే తాజాగా అమెజాన్ మైక్రోసైట్ వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ బడ్స్ 4.. 11mm వూఫర్స్‌ మరియు 6mm ట్వీకర్స్, డ్యూయల్‌ DAC యూనిట్స్‌ను కలిగి ఉంటాయి.

Oneplus Buds 4 TWS Buds specifications and features revealed

ANC సపోర్టు :
ఈ వన్‌ప్లస్‌ TWS బడ్స్‌ LHDC 5.0 ఆడియో కోడిక్‌ మరియు 3D స్పేషియల్ ఆడియో అనుభూతిని అందిస్తుంది. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్‌ Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌లను ను కలిగి ఉంటుంది. ఇప్పటికే విడుదల అయిన వివరాల ఆధారంగా త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్‌ ఇయర్‌బడ్స్‌ 55dB అడాప్టివ్‌ ANC ను సపోర్టు చేస్తుంది.

రియల్‌టైం AI ట్రాన్స్‌లేషన్ :
దీంతోపాటు ఈ బడ్స్‌ 3-మైక్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత కాల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్టును కలిగి ఉంటుంది. గేమింగ్‌ మోడ్‌లో 47ms అల్ట్రా లో లేటెన్సీని కలిగి ఉంటుంది. ఈ బడ్స్‌ రియల్‌టైం AI ట్రాన్స్‌లేషన్ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

Oneplus Buds 4 TWS Buds specifications and features revealed

45 గంటల బ్యాటరీ లైఫ్ :
వన్‌ప్లస్‌ బడ్స్ 4 TWS బడ్స్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 45 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. కేవలం బడ్స్‌ మాత్రమే 11 గంటల ప్లేబ్యాక్‌ టైంను అందిస్తాయి. ఈ వన్‌ప్లస్‌ బడ్స్ బ్లూటూత్‌ 5.4, డ్యూయల్ డివైస్‌ కనెక్టివిటీ, స్టిడీ కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ బడ్స్‌ 4 విడుదల అనంతరం వన్‌ప్లస్ ఇండియా ఇ-స్టోర్‌తోపాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్‌ స్ట్రోమ్‌ గ్రే, జెన్‌ గ్రీన్‌ రెండు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 5, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 ఫోన్ వివరాలు కూడా విడుదల అయ్యాయి. ఇటీవలే నార్డ్ CE 5 వివరాలను సంస్థ వెల్లడించింది.

Oneplus Buds 4 TWS Buds specifications and features revealed

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్ :
వన్‌ప్లస్‌ ఇటీవల విడుదల చేసిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్ 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 7100mAh భారీ బ్యాటరీతో లాంచ్ కానుంది. కేవలం 59 నిమిషాల్లోనే 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని వన్‌ప్లస్‌ తెలిపింది.

కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 6 గంటల వరకు యూట్యూబ్‌ను ఉపయోగించుకోవచ్చు. బైపాస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. 4nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అపెక్స్‌ చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. మరియు Mali G615 GPU ను కూడా కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ LPDDR5X ర్యామ్‌తో జతచేసి ఉంటుంది.

Take a Poll

కెమెరా విభాగం పరంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP 1/1.95 అంగుళాల సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. RAW HDR, రియల్‌ టోన్‌ టెక్నాలజీ, అల్ట్రా HDR వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Buds 4 TWS Buds specifications and features revealed ahead of launch on july 8 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X