వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 బడ్స్ విడుదల తేదీ వెల్లడి.. బ్లూటూత్ కాలింగ్, 43 గంటల బ్యాటరీ లైఫ్..!
వన్‌ప్లస్ నుంచి త్వరలో TWS బడ్స్ విడుదల కానున్నాయి. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 TWS బడ్స్ (OnePlus Buds Pro 3 TWS Earbuds) విడుదల తేదీని సంస్థ వెల్లడించింది. ఈ బడ్స్ గత సంవత్సరం విడుదల అయిన బడ్స్ ప్రో 2 ఇయర్‌బడ్స్ కు తర్వాత తరంగా ఈ బడ్స్ లాంచ్ కానున్నాయి. ఈ బడ్స్ ద్వారా అత్యంత మెరుగైన ఆడియో అనుభూతిని పొందవచ్చని సంస్థ చెబుతోంది. మరియు బ్యాటరీ లైఫ్ కూడా అధికంగా ఉంటుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 TWS బడ్స్ ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు విడుదల కానున్నాయి. వన్‌ప్లస్ తన సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేసింది. ఈ బడ్స్ మంచి ఆడియో అనుభూతిని అందిస్తుందని తెలిపింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ బడ్స్ కోసం ల్యాండింగ్ పేజీని రూపొందించింది. దీని ద్వారా డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.

ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ డిజైన్‌లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. Oval తరహా డిజైన్ ఉంటుందని సమాచారం. లీకైన వివరాల ఆధారంగా ఈ బడ్స్ 50dB అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సహా బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ మరియు 6mm ట్వీటర్, 11mm వూఫర్‌తో కూడిన డ్యూయల్ డ్రైవర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గతంలో లీక్ అయిన వివరాలు ఆధారంగా ఈ బడ్స్ డిజిటల్ నుంచి అనలాగ్ కన్వర్టర్, LHDC 5.0 ఆడియో కోడిక్, 24 బిట్/192kHz ను సపోర్టు చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 గరిష్ఠంగా 43 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుందని తెలుస్తోంది. మరియు IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ఇయర్‌బడ్స్ ధర రూ.13,000 నుంచి రూ.14,000 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఇయర్‌బడ్స్ డిజైన్ మినహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై వన్‌ప్లస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
*ఇటీవల వన్‌ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను మరింత మందికి చేరేలా విస్తరించింది. వన్‌ప్లస్ ఫోన్‌లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత డిస్‌ప్లే పైన గ్రీన్ లైన్, బ్లూ లైన్ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. దీనిపై అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో మిలియన్‌ల వన్‌ప్లస్ పరికరాలను ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా మరమ్మతులు చేయిస్తోంది.
ఈ ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ జాబితాలో వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8T, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9R, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 10 ప్రో, వన్‌ప్లస్ 11 మోడళ్లకు కూడా ఉచితంగా సర్వీస్ చేయనున్నారు. వన్‌ప్లస్ పరికరాల్లో గ్రీన్, బ్లూ లైన్ సమస్య ఉండి.. ఎటువంటి డ్యామేజీ కాకుంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేస్తారు.


Click it and Unblock the Notifications








