Home
Gadgets

10 నిమిషాల ఛార్జింగ్‌తో 27 గంటల ప్లేటైం, ఆకట్టుకొనే డిజైన్‌తో వన్‌ప్లస్‌ నెక్‌బ్యాండ్‌.. పూర్తి వివరాలు..!

వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌ లోకి వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ ఫోన్ విడుదల అయింది. సేల్‌ కూడా ప్రారంభం అయింది. కాంపాక్ట్‌ ఫోన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ఫోన్‌ ఆప్షన్‌ గా ఉండే అవకాశం ఉంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. అయితే త్వరలో వన్‌ప్లస్‌ నుంచి కొత్త నెక్‌బ్యాండ్‌ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వన్‌ప్లస్ వెల్లడించింది.

వన్‌ప్లస్ బుల్లెట్స్‌ వైర్‌లెస్ Z3 నెక్‌బ్యాండ్‌ ను (OnePlus Bullets Wireless Z3) జూన్‌ 19 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఆడియో క్లారిటీ, మెరుగైన పనితీరు, డిజైన్‌ ఆకట్టుకొనే విధంగా ఉంటుందని తెలిపింది. ఎక్కువ ప్లేటైం, మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుందని తెలిపింది. ఈ వన్‌ప్లస్‌ నెక్‌బ్యాండ్‌ సాంబా సన్‌సెట్‌, మాంబో మిడ్‌నైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంటుంది.

Oneplus Bullets wireless Z3

వన్‌ప్లస్‌ అందించిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ బుల్లె్ట్స్‌ వైర్‌లైస్‌ Z3 అల్ట్రా ఫాస్ట్‌ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ తో ఏకంగా 27 గంటల ప్లే బ్యాక్‌ టైంను అందిస్తుందని వెల్లడించింది. ఈ నెక్‌బ్యాండ్‌ మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

* భారత్‌ మార్కెట్‌ లో జూన్‌ 12 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం అయిన వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లాక్ వెల్‌వెట్‌, పింక్ శాటిన్‌, గ్రీన్‌ సిల్క్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

వన్‌ప్లస్‌ 13s స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Oxygen OS 15 తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని వన్‌ప్లస్‌ వెల్లడించింది. 6.32 అంగుళాల 1.5K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ప్లస్ కీ తో అందుబాటులోకి వచ్చింది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా (OIS), 50MP S5KJN5 టెలిఫోటో కెమెరాలను (EIS) కలిగి ఉంది. ముందు వైపు 32MP EIS సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. మరియు 80W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 5850mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ గూగుల్‌ సర్కిల్‌ టూ సెర్చ్, AI Call Assistant, AI ట్రాన్స్‌లేషన్‌, AI సెర్చ్‌, AI వాయిస్‌ స్క్రైబ్‌, AI Reflection Eraser, AI Detail Boost, AI Reframe, AI Unblur ఫీచర్లున్నాయి. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఉన్న ప్లస్‌ కీతో మైండ్‌ స్పేస్‌ను లాంచ్‌ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Oneplus Bullets wireless Z3 Neckband confirmed to launch on june 19 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X