Home
Gadgets

10 నిమిషాల ఛార్జింగ్‌తో 27 గంటల వినియోగించుకొనే వన్‌ప్లస్‌ నెక్‌బ్యాండ్‌ విడుదల..!

OnePlus Bullets Wireless Z3 Neckband : వన్‌ప్లస్‌ భారత్‌ మార్కెట్‌లో ఇవాళ నెక్‌బ్యాడ్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్ Z3 పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022 సంవత్సరంలో లాంచ్‌ చేసిన బుల్లెట్స్‌ Z2 నెక్‌బ్యాండ్‌కు తర్వాత తరం వెప్షన్‌గా కొత్త ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఈ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ Z3 స్మార్ట్‌ఫోన్ సిలికాన్ ఫినిష్‌ను కలిగి ఉంది. మరియు మెరుగైన బ్యాటరీ లైఫ్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ Z3 నెక్‌బ్యాండ్‌ పూర్తి వివరాలు :
వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ Z3 నెక్‌బ్యాండ్‌ 12.4mm డైనమిక్‌ డ్రైవర్‌లను కలిగి ఉంది. మెరుగైన Bass తో స్టూడియో క్వాలిటీని అందిస్తుందని వన్‌ప్లస్‌ చెబుతోంది. మరియు 3D స్పేషియల్ ఆడియోను సపోర్టు చేస్తుంది. ఈ వన్‌ప్లస్‌ నెక్‌బ్యాండ్‌ నాలుగు ఆడియో ప్రొఫైల్స్‌తో కూడిన సౌండ్‌ Master EQ ఫీచర్‌ను కలిగి ఉంది.

OnePlus Bullets Wireless Z3 Neckband launched in india at rs1699 price

36 గంటల ప్లేటైం! :
ఈ వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ Z3 నెక్‌బ్యాండ్‌ 220mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అల్ట్రా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతో కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 27 గంటల పాటు ఉపయోగించుకోవచ్చని వన్‌ప్లస్‌ చెబుతోంది. మరియు 50 శాతం వాల్యూమ్‌తో 36 గంటల ప్లేటైంను అందిస్తుందని చెబుతోంది.

IP55 రేటింగ్‌ :
ఈ వన్‌ప్లస్‌ ఇయర్‌ఫోన్స్‌ 20Hz నుంచి 20000Hz ఫ్రీక్వె్న్సీ రెస్పాన్స్‌ రేంజ్‌ను అందిస్తుంది. మరియు హై క్వాలిటీ సౌండ్‌ కోసం AAC మరియు SBC ఆడియో కోడిక్‌ను సపోర్టు చేస్తుంది. ఈ నెక్‌బ్యాండ్‌ IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది.

10 మీటర్ల దూరం వరకు కనెక్టివిటీ :
ఈ వన్‌ప్లస్‌ నెక్‌బ్యాండ్‌ బ్లూటూత్‌ 5.4 సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. సుమారు 10 మీటర్ల దూరం వరకు కనెక్టివిటీని అందిస్తుంది. కాలింగ్ సమయంలో అడ్వాన్స్‌డ్ AI అల్గారిథం తో కూడిన ఎన్విరాన్‌మెంట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది.

గూగుల్ ఫాస్ట్‌ పెయిర్‌ :
ఈ వన్‌ప్లస్‌ ఇయర్‌ఫోన్స్‌ Press, డబుల్‌ ప్రెస్‌, ట్రిపుల్‌ ప్రెస్‌, ప్రెస్‌ అండ్ హోల్డ్‌ బటన్‌ వంటి కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది. ఆడియో Play లేదా Pause కోసం మాగ్నటిక్‌ కంట్రోల్స్‌ ను కూడా కలిగి ఉంది. గూగుల్ ఫాస్ట్‌ పెయిర్‌ సపోర్టు ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ నెక్‌బ్యాండ్ స్మార్ట్ అసిస్టెన్స్‌ సపోర్టును కూడా కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ నెక్‌బ్యాండ్‌ ధర, సేల్‌ వివరాలు :
వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ Z3 నెక్‌బ్యాండ్ (OnePlus Neckband Sale) ధర రూ.1699 గా ఉంది. ఈ నెక్‌బ్యాండ్‌ సేల్‌ జూన్‌ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. సాంబా సన్‌సెట్‌, మాంబో మిడ్‌నైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

వన్‌ప్లస్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, క్రోమా, రిలయన్స్, విజయ్‌ సేల్స్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ సహా వన్‌ప్లస్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ నెక్‌బ్యాండ్‌ కేవలం 26 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. దీంతో ఎక్కువ సమయం వినియోగించినా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

FAQs
ఎంత దూరం వరకు కనెక్టివిటీని అందిస్తుంది?

బ్లూటూత్‌ 5.4 ఫీచర్‌ను కలిగి ఉంటుంది. సుమారుగా 10 మీటర్ల వరకు కనెక్టివిటిని అందిస్తుంది.

ఈ నెక్‌బ్యాండ్‌ సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది?

జూన్‌ 24 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్ Z3 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందా?

అవును, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 27 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు.

GizBot Technology
Best Mobiles in India

English summary
OnePlus Bullets Wireless Z3 Neckband launched in india at rs1699 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X