Just In
- 21 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 24 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- Movies
Waltair Veerayya 2 Weeks Collections: చిరంజీవి మరో సెంచరీ.. 14వ రోజు అన్ని కోట్లు.. లాభం చూస్తే షాకే
- News
AStrology: రత్నాలు ధరిస్తే నిజంగానే సమస్యలు తొలిగిపోతాయా..!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
భారత మార్కెట్లో OnePlus నుంచి తొలి వైర్డ్ ఇయర్‌ఫోన్స్ విడుదల!
OnePlus కంపెనీ భారతదేశంలో OnePlus Nord వైర్డ్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇవి మన దేశంలో ఈ బ్రాండ్ నుంచి విడుదలవుతున్న మొట్టమొదటి వైర్డు ఇయర్‌ఫోన్‌లు కావడం విశేషం. "నార్డ్" ప్రోడక్ట్ అయినందున, ఈ వైర్డు ఇయర్‌ఫోన్‌లు అద్భుతమైన డిజైన్‌తో సహా కొన్ని ముఖ్యమైన ఫీచర్‌లతో వస్తాయి. ఈ OnePlus Nord Wired ఇయర్‌ఫోన్‌ల ధర భారతదేశంలో రూ.799గా నిర్ణయించబడింది. మరియు అవి సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుదారులకు సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి.

డిజైన్ పరంగా చూస్తే.. ఈ Nord Wired ఇయర్‌ఫోన్‌లు "OnePlus బుల్లెట్ వైర్‌లెస్ Z సిరీస్ ని పోలి ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇవి సిగ్నేచర్ బ్లాక్, మరియు రెడ్ కలర్లలో అందుబాటులో ఉంటాయని OnePlus తెలిపింది.
ఇక ఈ ఇయర్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. అంతరాయాలు లేని మ్యూజిక్ అనుభూతి కోసం ప్రతి ఇయర్‌ఫోన్ లోపల మ్యాగ్నెట్ ఫీచర్ అందిస్తున్నారు. అదనంగా, ఈజీ ఆడియో కంట్రోలింగ్ కోసం బటన్స్ కూడా అందిస్తున్నారు. వాటిని ఒకదానితో స్నాప్ చేయడం ప్లేబ్యాక్‌ను పాస్ మరియు రెజ్యూమ్ చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్‌లు గుండ్రని డిజైన్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి యూజర్లు వాటిని గంటల పాటు సౌకర్యవంతంగా చెవికి ధరించగలరని OnePlus తెలిపింది. బ్రాండ్ బాక్స్‌లో అదనంగా సిలికాన్ బడ్స్ కూడా కంపెనీ అందిస్తోంది.

నార్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు మ్యూజిక్ కంట్రోలింగ్, కాల్స్ యాక్సెస్ చేయడం మరియు వాయిస్ అసిస్టెంట్‌ను ప్రారంభించడం కోసం హార్డ్ బటన్ లతో కూడిన ఇన్‌లైన్ మైక్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ OnePlus Nord Wired ఇయర్‌ఫోన్‌లు "బోల్డ్ ఆడియో" కోసం 9.2mm డైనమిక్ డ్రైవర్‌లతో పాటు 0.42cc సౌండ్ కేవిటీని కలిగి ఉన్నాయి.
వన్‌ప్లస్ కంపెనీ నుంచి నార్డ్ విభాగంలో ఇటీవల బడ్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నార్డ్ విభాగం నుంచి కంపెనీ విడుదల చేసిన మూడో ఉత్పత్తిగా ఈ నార్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు అని చెప్పవచ్చు. కాగా, ఈ బ్రాండ్ వైర్డు ఇయర్‌ఫోన్‌ల విభాగంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.

ONEPLUS NORD వైర్డ్ ఇయర్‌ఫోన్‌ల సేల్ ఎప్పుడంటే:
OnePlus Nord Wired ఇయర్‌ఫోన్‌ల సేల్స్ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమవుతాయి. బ్రాండ్ యొక్క స్వంత వెబ్‌సైట్, యాప్ మరియు ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ల నుండి అందుబాటులో ఉంటాయి. ఇవేకాకుండా, అమెజాన్ మరియు రిలయన్స్ డిజిటల్ & మైజియో, క్రోమా, సంగీత మొబైల్స్, పూర్విక, బజాజ్ ఎలక్ట్రానిక్స్, విజయ్ సేల్స్ వంటి ఇతర ఆఫ్‌లైన్ పార్టనర్ స్టోర్‌లతో పాటు పై ఇంటర్నేషనల్, హ్యాపీ మొబైల్స్, SS మొబైల్స్, పూజారా టెలికాం, బిగ్‌సి మొబైల్స్, లాట్ మొబైల్స్, టాప్ 10 మొబైల్స్ మరియు ది చెన్నై మొబైల్స్ వేదికగా కూడా ఇవి సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి.

అదేవిధంగా, OnePlus నుంచి ఇటీవల విడుదలైన OnePlus 10T మొబైల్ గురించి కూడా ఓ లుక్కేద్దాం:
OnePlus 10T స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాటర్ లేదా డస్ట్ రెసిస్టాన్స్ రేటింగ్ ఫీచర్తో వస్తోంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8GB, 12GB, 16GB of LPDDR5 RAM |128GB, 256GB of UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది.
ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమరీ కెమెరాగా అందిస్తున్నారు. వేగవంతమైన ఫొటో క్యాప్చర్ కోసం వనప్లస్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) సపోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. హీట్‌ను తగ్గించి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేలా వేపర్ కూలింగ్ సిస్టమ్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇక ఛార్జ్ విషయానికొస్తే 4,800 mAh సామర్థ్యం గల బ్యాటరీ 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయల్ సిమ్ స్లాట్స్, రెండిటికీ 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉంది. ఇది బ్లాక్, గ్రీన్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. OnePlus ప్రకారం, స్మార్ట్‌ఫోన్ 360-డిగ్రీ యాంటెన్నా సిస్టమ్ మరియు స్మార్ట్ లింక్‌ను కూడా పొందుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470