Home
Gadgets

OnePlus Nord Buds 3 రేపు భారత్‌లో వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 3 విడుదల.. డిజైన్‌, ఫీచర్లు, ధర వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి రేపు బడ్స్‌ విడుదల కానున్నాయి. వన్‌ప్లస్ నార్డ్‌ బడ్స్‌ 3 (OnePlus Nord Buds 3 Launch) రేపు లాంచ్‌ కానున్నాయి. ఈ బడ్స్‌ డిజైన్‌, ఫీచర్లను వన్‌ప్లస్‌ వెల్లడించింది. ఈ బడ్స్‌ బాస్‌వేవ్ టెక్నాలజీ సహా గూగుల్‌ ఫాస్ట్‌ పెయిరింగ్‌ కనెక్టివిటీతో విడుదల కానుంది. అయితే ఈ బడ్స్‌ ధర, బ్యాటరీ వివరాలు రేపు వెల్లడి కానున్నాయి. దీంతోపాటు సేల్‌ వివరాలను కూడా వన్‌ప్లస్‌ వెల్లడించనుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 3 ధర పై సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే రూ.3,000 ధర సెగ్మెంట్‌లో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నార్డ్ బడ్స్ 2R ప్రస్తుత ధర రూ.1,999 గా ఉంది. అదే వన్‌ప్లస్ బడ్స్ 3 ధర రూ.5499 గా ఉంది. అదే నార్డ్‌ బడ్స్ 2 ధర రూ.2,999 గా ఉంది. రేపు విడుదల కానున్న నార్డ్‌ బడ్స్‌ 3 కూడా ఇదే తరహా ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord Buds 3 to launch in india on tomorrow

వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 3 ఫీచర్లు :
తాజాగా వన్‌ప్లస్‌.. ఈ బడ్స్‌కు సంబంధించిన అనేక ఫీచర్‌ల వివరాలను వెల్లడించింది. ఈ బడ్స్‌ Oval Shape కేస్‌ను కలిగి ఉంటుంది. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బడ్స్‌ ప్రో 3, నార్డ్‌ బడ్స్ 3 ప్రో తరహా డిజైన్‌తో విడుదల కానుంది. మరియు స్టెమ్‌ డిజైన్‌ తో లాంచ్‌ కానుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 అత్యాధునిక 32dB యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీ (ANC) తో పనిచేస్తుంది. దీంతోపాటు మెరుగైన Bass అనుభూతి కోసం Basswave టెక్నాలజీని ఆవిష్కరించింది. గతంలో 5db వరకు మాత్రమే Precision లెవల్‌ ఉండగా.. ఈ కొత్త టెక్నాలజీతో 10dB వరకు మెరుగైన ఆడియోను అందిస్తుంది.

అదే వన్‌ప్లస్‌ నార్డ్ 3 ఇయర్‌బడ్స్‌ బ్లూటూత్‌ 5.4, గూగుల్‌ ఫాస్ట్‌ పెయిరింగ్‌ సపోర్టుతో విడుదల కానున్నాయి. ఫలితంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా కనెక్టింగ్‌ సొంతమవుతుంది. అయితే బడ్స్‌ ధర సహా బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్‌లను వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. విడుదల సందర్భంగా పూర్తి వివరాలను సంస్థ విడుదల చేయనుంది.

వన్‌ప్లస్‌ నుంచి త్వరలో వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అక్టోబర్‌లో చైనాలో విడుదల కానుందని వన్‌ప్లస్‌ చైనా అధిపతి లూయిస్‌ లీ వెల్లడించారు. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 4 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలిపారు. ఈ కెమెరాలు Hasselblad బ్రాండ్‌తో విడుదల కానున్నాయి. దీంతోపాటు అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉండనుంది.

ఇప్పటికే లీక్‌ అయిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌.. 6000mAh బ్యాటరీపైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు .8 అంగుళాల మైక్రో కర్వడ్‌ 2K LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌లో ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే చైనాలో లాంచ్‌ అయిన తర్వాత మాత్రమే విడుదల కానుందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
OnePlus Nord Buds 3 to launch in india on tomorrow design and features revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X