రూ.1599 ధరకే 54 గంటల బ్యాటరీ లైఫ్, ఫైండ్ మై ఇయర్‌బడ్స్ ఫీచర్‌తో వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్..!
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3r TWS ఇయర్‌బడ్స్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఈ బడ్స్ అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్‌ను రూ.2 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు ప్రారంభ ధరలో భాగంగా మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో ఏకంగా 54 గంటల బ్యాటరీ టైమ్‌ను పొందవచ్చని వన్‌ప్లస్ తెలిపింది.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3r స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్ (OnePlus Nord Buds 3r) 12.4mm టైటానియం కోటింగ్‌తో కూడిన డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉంది. ఆడియో అవుట్‌పుట్‌ను మరింత మెరుగుపరుచుకొనేందుకు వీలుగా సౌండ్ మాస్టర్ EQ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఇయర్‌ఫోన్స్ వన్‌ప్లస్ 3D ఆడియో సపోర్టు ను కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా 360 డిగ్రీల సౌండ్‌స్టేజ్‌ను అందిస్తుంది. సింగిల్ ట్యాప్ గెశ్చర్ ద్వారా వాయిస్ అసిస్టెంట్‌తో కనెక్ట్ కావచ్చు. ఈ బడ్స్ రియల్ టైం ట్రాన్స్‌లేషన్‌ను సపోర్టు చేస్తాయి.
ఈ బడ్స్‌ను డబుల్ ట్యాప్ చేయడం ద్వారా ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఈ వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డ్యూయల్ మైక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది కాల్స్ మరింత నాణ్యంగా ఉండేలా ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందిస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఈ బడ్స్ బ్లూటూత్ 5.4, గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఫీచర్‌లను కలిగి ఉంటాయి. ఈ ఇయర్‌బడ్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివీటి సపోర్టును కలిగి ఉంటుంది. గేమింగ్ మోడ్‌లో 47ms లో లేటెన్సీ ని అందిస్తుంది. మీరు పొరపాటును ఇయర్‌బడ్స్‌ను ఎక్కడైనా పెట్టి మర్చిపోతే, ఈ బడ్స్‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్ ద్వారా వాటి లొకేషన్‌ను గుర్తించవచ్చు. Find My Earbuds ఫీచర్ ద్వారా లొకేషన్‌ను గుర్తించవచ్చు.
54 గంటల బ్యాటరీ లైఫ్ :
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3r ను ఛార్జింగ్ కేస్‌తో కలిగి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 54 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. ఈ బడ్స్ TUV Rheinland బ్యాటరీ హెల్త్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంటుంది. కేవలం ఇయర్‌బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటాయి.

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3r ఇయర్‌బడ్స్ ధర, సేల్ వివరాలు :
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3r ఇయర్‌బడ్స్ ధర రూ.1799 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.1599 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ TWS బడ్స్ సేల్ సెప్టెంబర్ 8 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
వన్‌ప్లస్ ఇండియా ఇ-స్టోర్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ సహా ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ ఆరా బ్లూ, యాష్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








