54 గంటల బ్యాటరీ లైఫ్, ANC సపోర్టుతో OnePlus ఇయర్‌బడ్స్.. ధర, సేల్ వివరాలు..!
OnePlus Nord Buds 4 Pro : వన్‌ప్లస్ నుంచి ఇయర్‌బడ్స్ భారత్ మార్కెట్ లో విడుదల అయ్యాయి. నార్డ్ బడ్స్ 4 ప్రో పేరుతో అందుబాటులోకి వచ్చాయి. ఈ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కాల్ రిడక్షన్ ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ ఛార్జింగ్ తో 54 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. తొలి సేల్ లో భాగంగా డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది. ఈ వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ పూర్తి వివరాలు.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఇయర్‌బడ్స్ టైటానియం కోటింగ్ తో కూడిన 12mm డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉన్నాయి. టచ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. AI అసిస్టెంట్ ను కలిగి ఉంది. HeyMelody యాప్ ద్వారా AI ట్రాన్స్‌లేషన్ పొందవచ్చు.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ :
ఈ బడ్స్ 55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ను సపోర్టు చేస్తాయి. గేమింగ్ సమయంలోనూ మెరుగైన అనుభూతిని అందిస్తాయని సంస్థ చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ తో కూడిన 6 మైక్రోఫోన్‌ల వ్యవస్థ ఉంది. ఫలితంగా కాలింగ్ సమయంలో ఆడియో క్లియర్‌గా ఉంటుంది.
10 మీటర్ల రేంజ్ :
వన్‌ప్లస్ బడ్స్ SBC, AAC, LHDC 5.0 సపోర్టుతో బ్లూటూత్ 6.0 ఫీచర్ ఉంది. సుమారుగా 10 మీటర్ల రేంజ్ వరకు సపోర్టు చేస్తుందని సంస్థ చెబుతోంది. బ్లూటూత్‌తోపాటు గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ సపోర్టును కలిగి ఉంది.

54 గంటల బ్యాటరీ లైఫ్ :
బ్యాటరీ పరంగా వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో లో ఒక్కో బడ్ 62mAh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జింగ్ కేస్ 530mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 54 గంటల బ్యాటరీ లైఫ్ ను పొందవచ్చని వన్‌ప్లస్ తెలిపింది. ANC ఆఫ్, 50 శాతం వాల్యూమ్ సందర్బాల్లోనే ఈ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది తెలిపింది.
ఈ ఇయర్‌బడ్స్ USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉన్నాయి. పూర్తిగా ఛార్జింగ్ చేసేందుకు 90 నిమిషాల సమయం పడుతుందని వన్‌ప్లస్ తెలిపింది. IP55 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్ రేడియంట్ గ్రే, రవెన్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ధర, సేల్ వివరాలు :
ఈ బడ్స్ ధర రూ.3999 గా ఉంది. మార్చి 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. తొలి సేల్ లో రూ.3799 ధరకు కొనుగోలు చేయవచ్చని వన్‌ప్లస్ తెలిపింది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మింత్రా, వన్‌ప్లస్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








