OnePlus అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఎట్ట‌కేల‌కు Nord వాచ్ వ‌చ్చేసింది!

|

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ‌ OnePlus, త‌మ Nord సిరీస్‌ను క్ర‌మంగా విస్త‌రిస్తోంది. నార్డ్ సిరీస్ నుంచి కేవ‌లం స్మార్ట్‌ఫోన్లు మాత్ర‌మే కాకుండా, ప‌లు వేర‌బుల్స్ ఉత్ప‌త్తుల్ని కూడా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ఇప్ప‌టికే OnePlus Nord ఇయ‌ర్‌బ‌డ్స్‌ను కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా, ఇప్పుడు OnePlus Nord తొలి స్మార్ట్‌వాచ్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేయ‌డం విశేషం.

OnePlus

ఈ స్మార్ట్‌వాచ్ కంపెనీ యొక్క నార్డ్ సిరీస్‌కు చెందిన మొట్టమొదటి వేర‌బుల్‌. ఇది 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను క‌లిగి ఉంది. అంతేకాకుండా, ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో మరియు గరిష్టంగా 500 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ హార్ట్ బీటింగ్ రేటు, స్ట్రెస్‌ మరియు బ్ల‌డ్ ఆక్సిజన్ స్థాయి (SpO2) పర్యవేక్షణ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. వాటితో పాటు 105 స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతును అందిస్తుంది. ఇది స్త్రీల‌కు పీరియ‌డ్స్‌ ట్రాకింగ్ మరియు ఇత‌ర ఆరోగ్య చిట్కాలను కూడా అందిస్తుంది. కంపెనీ ప్రకారం, ఇది 30 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్‌తో 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

భారతదేశంలో OnePlus Nord వాచ్ ధర:
భారతదేశంలో కొత్తగా ప్రారంభించబడిన OnePlus Nord వాచ్ ధర రూ.4,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. స్మార్ట్ వాచ్ డీప్ బ్లూ మరియు మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇది వన్‌ప్లస్ స్టోర్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు మరియు అధికారిక OnePlus పార్టనర్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ ప్రకారం, ఇది అక్టోబర్ 4 న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా విక్రయించబడుతుంది.

OnePlus

అయితే, ఈ వాచ్ కొనుగోలు చేసే యూజ‌ర్ల‌కు యాక్సిస్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.500 తగ్గింపును కూడా కంపెనీ ప్రకటించింది. ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్లు కూడా రూ.500 తగ్గింపు ప్ర‌క‌టించింది. సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభమవుతుంది. ఈ తగ్గింపులు OnePlus స్టోర్, OnePlus స్టోర్ యాప్ మరియు ఎంపిక చేసిన OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి.

OnePlus Nord వాచ్ ఫీచ‌ర్లు, స్పెసిఫికేషన్స్:
OnePlus Nord వాచ్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో, 1.78-అంగుళాల HD (368x448 పిక్సెల్‌లు) AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది గరిష్టంగా 500 nits వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కు కుడి వైపున పవర్ బటన్‌(హార్డ్ బ‌ట‌న్‌)తో అమర్చబడి ఉంటుంది. ఇది SF32LB555V4O6 చిప్‌సెట్ ద్వారా ఆధారితమై RT OSపై నడుస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఇన్‌బిల్ట్ GPS సపోర్ట్ ఉంటుంది. ఇది 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్‌తో అమర్చబడింది. స్లీప్ ట్రాకింగ్‌తో పాటు హృదయ స్పందన రేటు (SpO2) మరియు ఒత్తిడి పర్యవేక్షణ ఫీచ‌ర్‌తో వస్తుంది. OnePlus Nord వాచ్ 105 స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్‌ని కలిగి ఉంది మరియు దానంత‌ట అదే రన్నింగ్ మరియు వాకింగ్ ట్రాక్ చేయగలదు.

OnePlus

OnePlus Nord వాచ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 6 అంత‌కంటే ఎక్కువ‌, మరియు ఐఓఎస్ 11 మరియు అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో నడుస్తున్న డివైజ్‌ల‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది నాన్ లీనియర్ వైబ్రేషన్ మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. స్మార్ట్ వాచ్ 230mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్‌తో రవాణా చేయబడుతుంది. ఇది 30 రోజుల స్టాండ్‌బై సమయంతో, మ‌రియు గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ ను ఆఫ‌ర్ చేస్తుందని క్లెయిమ్ చేయబడింది.

Best Mobiles in India

English summary
OnePlus Nord Watch launched in india. sale starts from 4th october

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X