Just In
- 6 hrs ago
ఈ షియోమీ ఫోన్లలో 5G ఫీచర్ ఉన్న కూడా ..! Jio 5G పనిచేయదు. ఎందుకంటే ..!
- 7 hrs ago
Tecno నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర మరియు స్పెసిఫికేషన్లు
- 10 hrs ago
రూ.8,999 కొత్త టీవీ మార్కెట్లో లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు!
- 13 hrs ago
అమెజాన్ ప్రైమ్ & డిస్నీ హాట్ స్టార్ రెండూ ఉచితంగా అందించే Airtel ప్లాన్లు!
Don't Miss
- News
తెలంగాణలో భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడి: హైదరాబాద్‌లో 2వే కోట్లతో డేటా సెంటర్
- Lifestyle
శృంగారం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయా? డాక్టర్ సమాధనం, నివారణ మార్గాలు..
- Sports
ఓడినా.. ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకం: టామ్ లాథమ్
- Movies
Avatar 3 కాన్సెప్ట్‌ను లీక్ చేసిన జేమ్స్ కామెరాన్.. ఇక నిప్పుతో చెలగాటమే!
- Finance
Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే...??
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
- Automobiles
బైక్‌పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి
OnePlus నుంచి త్వరలో స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ కూడా రానున్నాయా!
OnePlus సంస్థ గత కొంత కాలంగా మార్కెట్లో తమ ఉత్పత్తుల్ని క్రమంగా విస్తరించేందుకు విశేషంగా కృషి చేస్తోంది. తాజాగా ఈ సంస్థ అద్భుతమైన ఫీచర్లతో కొత్త OnePlus Nord 2T 5Gని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అదే ఉత్సాహంతో Nord సిరీస్ ను మరింత విస్తరిస్తూ OnePlus Nord Watch మరియు OnePlus Nord Buds CE TWS ఇయర్‌బడ్స్‌తో సహా మరికొన్ని పరికరాలను మార్కెట్లోకి పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

OnePlus Nord Watch రానుందా!:
ఇప్పటికే వన్‌ప్లస్ కంపెనీ నుంచి నార్డ్ వాచ్ విడుదల కానున్నట్లు పలు పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ కంపెనీ ప్రతినిధి ముకుల్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ మరియు ఏసియన్ మార్కెట్ల కోసం ఇప్పటి స్మార్ట్ వాచ్‌ల ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారు. అది కూడా నార్డ్ సిరీస్‌లో ప్రారంభమవుతుంది కాబట్టి, ఇది అఫర్డబుల్ ధరలోనే లభించే అవకాశం ఉంది.
గతంలో, OnePlus Nord వాచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది, దీన్ని బట్టి ఆ ఉత్పత్తి భారతదేశం విడుదల కావచ్చు అని నిర్ధారించవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఈ వాచ్‌కు సంబంధించి పలు కీలక ఫీచర్లు కూడా లీకయ్యాయి. ఇది హార్ట్ రేట్ సెన్సార్, స్టెప్స్ ట్రాకర్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్ మొదలైనవాటితో సహా మరిన్ని సాధారణ ఫీచర్లు కూడా ఉండొచ్చని సమాచారం. గతంలో వచ్చిన ఉత్పత్తులతో పోలిస్తే ఈ OnePlus Nord Watch కాస్త ధర అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. యూజర్లకు అఫర్డబుల్ బడ్జెట్ ధరలోనే దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం.

త్వరలోనే OnePlus Nord Buds CE TWS ఇయర్ బడ్స్ కూడా విడుదల కానున్నాయా!:
టిప్ స్టర్ లీకుల ప్రకారం.. వన్‌ప్లస్ నుంచి త్వరలోనే OnePlus Nord Buds CE TWS ఇయర్ బడ్స్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం. రాబోయే Nord TWS ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ SIG డేటాబేస్‌లో మోడల్ నంబర్ E506Aతో గుర్తించబడినట్లు తెలుస్తోంది. ఇది బ్లూటూత్ వర్శన్ 5.2 కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇయర్ బడ్స్ చాలా వేగంగా మన డివైజ్‌కు పెయిర్ అవుతాయి. పరికరం యొక్క అదే మోడల్ నంబర్‌ను భారతీయ BIS ధృవీకరణ వెబ్‌సైట్ కూడా గుర్తించింది, దీన్ని బట్టి ఇది త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం, వన్‌ప్లస్ భారతదేశంలో జనాదరణ పొందుతున్న నార్డ్ సిరీస్‌ను విస్తరించడానికి కృషి చేస్తోంది. కొత్త OnePlus Nord 2T 5G ఈరోజు, జూలై 1న ప్రారంభించబడింది. రాబోయే రోజుల్లో కొత్త OnePlus Nord వాచ్ మరియు OnePlus Nord Buds CE ఇయర్‌బడ్‌లు కూడా లాంచ్ కానున్నాయి. బ్రాండ్ త్వరలో కొత్త యాక్సెసరీలను అధికారికంగా టీజింగ్ చేయడం ప్రారంభిస్తుందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

OnePlus Nord 2T 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.43 అంగుళాల full-HD+ (1,080x2,400 pixels) AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 20:9 aspect ratio తో 90Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. S octa-core MediaTek Dimensity 1300 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ కు హోల్ పంచ్ డిజైన్డ్ డిస్‌ప్లే అందిస్తున్నారు. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అందిస్తున్నారు. ఇది 8జీబీ ర్యామ్|128 జీబీ, 12జీబీ ర్యామ్|256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ OxygenOS 12.1 పై పనిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 50 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్‌తో మరొక కెమెరా, 2 మెగా పిక్సల్ క్వాలిటీతో మాక్రో షూటర్ లెన్స్ తో మూడో కెమెరాను ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi dual-band, Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ వర్శన్ 5.2 కలిగి ఉంది.
రెండు వేరియంట్లలో:
భారత్‌లో ఈ మొబైల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభించనుంది. తొలి వేరియంట్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.28,999 వరకు నిర్ణయించారు. మరో వేరియంట్ 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.33,999 వరకు నిర్ణయించారు. జులై 5 వ తేదీ నుంచి ఈ మొబైల్స్ కొనుగోలు కు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మొబైల్స్ గ్రే షాడో, జేడ్ ఫాగ్ కలర్లలో అందుబాటులో ఉంటాయి. ఈ మొబైల్స్ కొనడానికి ఆసక్తి ఉన్నవారు అమెజాన్, వన్ ప్లస్ వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్స్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో కొనుగోలు చేయవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470