OnePlus ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. త్వ‌ర‌లో Nord సిరీస్‌లో స్మార్ట్‌వాచ్‌!

|

OnePlus కంపెనీ Nord సిరీస్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇత‌ర గ్యాడ్జెట్లను క్రమంగా విస్తరిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కంపెనీ Nord సిరీస్‌లో భాగంగా OnePlus Nord Watch పేరుతో స‌రికొత్త వేర‌బుల్స్ ను విడుద‌ల చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 
OnePlus ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. త్వ‌ర‌లో Nord సిరీస్‌లో స్మార్

ఈ OnePlus Nord వాచ్ కు సంబంధించి ఆన్‌లైన్‌లో ప‌లు రూమ‌ర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వెల్ల‌డైన Bluetooth సర్టిఫికేష‌న్ వివ‌రాల‌ను బ‌ట్టి చూస్తే ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ త్వ‌ర‌లోనే విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

OnePlus Nord Watchకు బ్లూటూత్ స‌ర్టిఫికేష‌న్‌!

OnePlus Nord Watchకు బ్లూటూత్ స‌ర్టిఫికేష‌న్‌!

వ‌న్‌ప్ల‌స్‌కు సంబంధించి ప్ర‌స్తుతం వార్త‌ల్లోకెక్కిన ఈ స్మార్ట్‌వాచ్ విడుద‌ల అయితే.. ఇది OnePlus Nord బ్యానర్‌లో మొదటి స్మార్ట్‌వాచ్ అవుతుంది. అధికారిక OnePlus వెబ్‌సైట్‌లో కూడా గుర్తించబడింది. అంతేకాకుండా, ఈ రాబోయే OnePlus Nord వాచ్ తాజాగా బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ లేదా SIG ద్వారా కూడా ధృవీకరించబడింది.

OnePlus Nord వాచ్ మోడల్ నంబర్ OPBBE221తో గుర్తించబడిన‌ట్లు తెలుస్తోంది. ఇది బ్లూటూత్ v5.2కి మద్దతు ఇస్తుందని తాజాగా రూమ‌ర్లు నిర్ధారిస్తున్నాయి. ఇవి కాకుండా, బ్లూటూత్ SIG స‌ర్టిఫికేష‌న్‌ వెబ్‌సైట్ ఇతర వివరాలను వెల్లడించలేదు. రాబోయే OnePlus Nord వాచ్ భారతీయ BIS వెబ్‌సైట్‌లో కూడా గుర్తించబడింది.

OnePlus Nord Watch ఎక్స్‌పెక్టెడ్ ఫీచ‌ర్లు:
 

OnePlus Nord Watch ఎక్స్‌పెక్టెడ్ ఫీచ‌ర్లు:

రాబోయే OnePlus Nord వాచ్‌లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉండే అవ‌కాశం ఉంది. కొత్త స్మార్ట్‌వాచ్‌కి ట్రాకింగ్ కోసం OnePlus N హెల్త్ యాప్ క‌లిగి ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు గ‌తంలో వ‌చ్చిన ప‌లు నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే OnePlus Nord వాచ్ రెండు మోడల్‌లను కలిగి ఉంటుందని నివేదికలు ద్వారా తెలుస్తోంది. ఒకటి చ‌ద‌ర‌పు ఆకారంలో మరియు మరొకటి రౌండ్ డిస్‌ప్లేతో రానున్నాయి. బ్లూటూత్ SIG వెబ్‌సైట్ మాత్రం ప్రస్తుతం ఒక మోడ‌ల్‌ను మాత్రమే ధ్రువీక‌రించింది.

రాబోయే స్మార్ట్‌వాచ్‌ల స్క్రీన్ రిజల్యూషన్ గురించి కూడా కొన్ని రూమ‌ర్లు ఆన్‌లైన్‌లో తిరుగుతున్నాయి. రాబోయే OnePlus Nord వాచ్ దీర్ఘచతురస్రాకార మోడల్‌లు 240 x 280 మరియు 368 x 448 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు, వృత్తాకార డయల్ మోడల్‌లు 240 x 240 మరియు 390 x 390 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి.

ఇక హెల్త్ ప‌ర‌మైన ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, స్టెప్స్ ట్రాకర్, SpO2 సెన్సార్ మొదలైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉండే అవకాశం ఉంది. OnePlus Nord వాచ్‌లో కొన్ని వేరియంట్‌లకు GPS ఫీచ‌ర్ కూడా ఉండొచ్చ‌ని నివేదిక‌ల ద్వారా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అఫీషియల్ టీజర్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సి ఉంది.

కాగా, మ‌రోవైపు OnePlus కంపెనీ తాజాగా Nord విభాగం నుంచి మొట్ట‌మొద‌టి వైర్‌డ్ ఇయ‌ర్‌ఫోన్‌ల‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. వాటి గురించి కూడా ఓ సారి చ‌ర్చించుకుందాం:

కాగా, మ‌రోవైపు OnePlus కంపెనీ తాజాగా Nord విభాగం నుంచి మొట్ట‌మొద‌టి వైర్‌డ్ ఇయ‌ర్‌ఫోన్‌ల‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. వాటి గురించి కూడా ఓ సారి చ‌ర్చించుకుందాం:

OnePlus కంపెనీ భారతదేశంలో OnePlus Nord వైర్డ్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇవి మ‌న దేశంలో ఈ బ్రాండ్ నుంచి విడుద‌ల‌వుతున్న మొట్టమొదటి వైర్డు ఇయర్‌ఫోన్‌లు కావ‌డం విశేషం. "నార్డ్" ప్రోడ‌క్ట్ అయినందున, ఈ వైర్డు ఇయర్‌ఫోన్‌లు అద్భుత‌మైన డిజైన్‌తో సహా కొన్ని ముఖ్యమైన ఫీచర్‌లతో వస్తాయి. ఈ OnePlus Nord Wired ఇయర్‌ఫోన్‌ల ధర భార‌త‌దేశంలో రూ.799గా నిర్ణయించబడింది. మరియు అవి సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుదారుల‌కు సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి.

డిజైన్ ప‌రంగా చూస్తే.. ఈ Nord Wired ఇయర్‌ఫోన్‌లు "OnePlus బుల్లెట్‌ వైర్‌లెస్ Z సిరీస్ ని పోలి ఉంటాయ‌ని కంపెనీ పేర్కొంది. ఇవి సిగ్నేచర్ బ్లాక్‌, మరియు రెడ్ క‌ల‌ర్లలో అందుబాటులో ఉంటాయని OnePlus తెలిపింది.

OnePlus నార్డ్ వైర్‌డ్ ఇయ‌ర్‌బ‌డ్స్ స్పెసిఫికేష‌న్లు:

OnePlus నార్డ్ వైర్‌డ్ ఇయ‌ర్‌బ‌డ్స్ స్పెసిఫికేష‌న్లు:

ఇక ఈ ఇయ‌ర్‌ఫోన్‌ల స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. అంత‌రాయాలు లేని మ్యూజిక్ అనుభూతి కోసం ప్రతి ఇయర్‌ఫోన్ లోపల మ్యాగ్నెట్ ఫీచ‌ర్ అందిస్తున్నారు. అదనంగా, ఈజీ ఆడియో కంట్రోలింగ్ కోసం బ‌ట‌న్స్ కూడా అందిస్తున్నారు. వాటిని ఒకదానితో స్నాప్ చేయడం ప్లేబ్యాక్‌ను పాస్ మ‌రియు రెజ్యూమ్ చేయ‌వ‌చ్చు. ఈ ఇయర్‌ఫోన్‌లు గుండ్రని డిజైన్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి యూజ‌ర్లు వాటిని గంటల పాటు సౌకర్యవంతంగా చెవికి ధ‌రించ‌గ‌ల‌ర‌ని OnePlus తెలిపింది. బ్రాండ్ బాక్స్‌లో అద‌నంగా సిలికాన్ బ‌డ్స్ కూడా కంపెనీ అందిస్తోంది.

నార్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు మ్యూజిక్ కంట్రోలింగ్‌, కాల్స్ యాక్సెస్ చేయడం మరియు వాయిస్ అసిస్టెంట్‌ను ప్రారంభించడం కోసం హార్డ్ బటన్ ల‌తో కూడిన ఇన్‌లైన్ మైక్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ OnePlus Nord Wired ఇయర్‌ఫోన్‌లు "బోల్డ్ ఆడియో" కోసం 9.2mm డైనమిక్ డ్రైవర్‌లతో పాటు 0.42cc సౌండ్ కేవిటీని కలిగి ఉన్నాయి.

వ‌న్‌ప్ల‌స్ కంపెనీ నుంచి నార్డ్ విభాగంలో ఇటీవ‌ల బడ్స్‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత నార్డ్ విభాగం నుంచి కంపెనీ విడుద‌ల చేసిన మూడో ఉత్ప‌త్తిగా ఈ నార్డ్ వైర్‌డ్ ఇయ‌ర్‌ఫోన్‌లు అని చెప్ప‌వ‌చ్చు. కాగా, ఈ బ్రాండ్ వైర్డు ఇయర్‌ఫోన్‌ల విభాగంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.

ONEPLUS NORD వైర్డ్ ఇయర్‌ఫోన్‌ల సేల్ ఎప్పుడంటే:

ONEPLUS NORD వైర్డ్ ఇయర్‌ఫోన్‌ల సేల్ ఎప్పుడంటే:

OnePlus Nord Wired ఇయర్‌ఫోన్‌ల సేల్స్‌ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభ‌మ‌వుతాయి. బ్రాండ్ యొక్క స్వంత వెబ్‌సైట్, యాప్ మరియు ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ల నుండి అందుబాటులో ఉంటాయి. ఇవేకాకుండా, అమెజాన్ మరియు రిలయన్స్ డిజిటల్ & మైజియో, క్రోమా, సంగీత మొబైల్స్, పూర్విక, బజాజ్ ఎలక్ట్రానిక్స్, విజయ్ సేల్స్ వంటి ఇతర ఆఫ్‌లైన్ పార్టనర్ స్టోర్‌లతో పాటు పై ఇంటర్నేషనల్, హ్యాపీ మొబైల్స్, SS మొబైల్స్, పూజారా టెలికాం, బిగ్‌సి మొబైల్స్, లాట్ మొబైల్స్, టాప్ 10 మొబైల్స్ మరియు ది చెన్నై మొబైల్స్ వేదిక‌గా కూడా ఇవి సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి.

Best Mobiles in India

English summary
OnePlus Nord Watch's Bluetooth Certification Suggests An Imminent Launch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X