OnePlus Nord సిరీస్ నుంచి తొలి స్మార్ట్‌వాచ్.. స్పెసిఫికేష‌న్లు లీక్‌!

|

OnePlus కంపెనీకి చెందిన తొలి Nord Watch కు సంబంధించి కీల‌క విష‌యాలు బ‌య‌టకు వ‌చ్చాయి. లాంచ్ కు ముందే ఈ వాచ్ కు సంబంధించిన ప‌లు స్పెసిఫికేషన్ వివ‌రాలను ఒక టిప్‌స్ట‌ర్ ద్వారా లీక‌య్యాయి. ఈ వేర‌బుల్ AMOLED డిస్‌ప్లే తో పాటు, 100 కంటే ఎక్కువ ఫిట్‌నెస్ మోడ్‌లు మరియు 10 రోజుల వరకు బ్యాటరీని కలిగి ఉంటుంద‌ని టిప్‌స్టర్ ద్వారా తెలిసింది. అదేవిధంగా డిజైన్ విష‌యానికొస్తే.. కంపెనీ షేర్ చేసిన మార్కెటింగ్ పోస్టర్‌లో చూసినట్లుగా, ఈ వాచ్ దీర్ఘచతురస్రాకార ఆకారంతో, కుడివైపున రొటేటింగ్ బంప్‌తో వస్తుందని సూచిస్తుంది. కాగా, ఈ స్మార్ట్ వాచ్ వన్‌ప్లస్ 'నార్డ్ సిరీస్' నుంచి వ‌స్తున్న తొలి స్మార్ట్‌వాచ్ కావ‌డం విశేషం.

 
OnePlus Nord సిరీస్ నుంచి తొలి స్మార్ట్‌వాచ్.. స్పెసిఫికేష‌న్లు లీక్‌!

OnePlus Nord వాచ్ ప్ర‌త్యేక‌త‌లు(లీక్డ్‌):
OnePlus Nord వాచ్ 368x448 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 45.2mm AMOLED డిస్‌ప్లేతో వస్తుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. ఈ వేర‌బుల్ మహిళల ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్‌లతో పాటు 105 ఫిట్‌నెస్ మోడ్‌లను ప్యాక్ చేస్తుంద‌ని స‌మాచారం. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీని అందించగలదు.

కంపెనీ నుంచి మార్కెటింగ్ పోస్ట‌ర్ విడుద‌ల‌:
ఇటీవల, వన్‌ప్లస్ కంపెనీ మార్కెటింగ్ పోస్టర్‌ను విడుద‌ల చేసింది. దాని ప్ర‌కారం.. ఈ వాచ్ దీర్ఘచతురస్రాకార ఆకారంతో, కుడివైపున రొటేటింగ్ బంప్‌తో వస్తుందని సూచిస్తుంది. పైన చెప్పినట్లుగా, ఈ వేర‌బుల్ OnePlus కంపెనీ నుంచి Nord బ్రాండింగ్‌తో మొదటి స్మార్ట్‌వాచ్ అవుతుంది. ఇప్పటి వరకు, మనం వ‌న్‌ప్ల‌స్ నార్డ్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లను మాత్ర‌మే చూశాము. కానీ, కంపెనీ ఇటీవల OnePlus Nord Wired ఇయర్‌ఫోన్‌లతో ఆడియో ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది.

OnePlus Nord సిరీస్ నుంచి తొలి స్మార్ట్‌వాచ్.. స్పెసిఫికేష‌న్లు లీక్‌!

భారతదేశంలో OnePlus Nord వాచ్ ధర (రూమ‌ర్ల ప్ర‌కారం):
మునుపటి నివేదిక ప్రకారం OnePlus Nord వాచ్ ధర భారతదేశంలో దాదాపు రూ.5,000 ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇది బ్లాక్ మరియు వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉండవచ్చున‌ని స‌మాచారం.

OnePlus Nord Watch ఎక్స్‌పెక్టెడ్ ఫీచ‌ర్లు:
రాబోయే OnePlus Nord వాచ్‌లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉండే అవ‌కాశం ఉంది. కొత్త స్మార్ట్‌వాచ్‌కి ట్రాకింగ్ కోసం OnePlus N హెల్త్ యాప్ క‌లిగి ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు గ‌తంలో వ‌చ్చిన ప‌లు నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే OnePlus Nord వాచ్ రెండు మోడల్‌లను కలిగి ఉంటుందని నివేదికలు ద్వారా తెలుస్తోంది. ఒకటి చ‌ద‌ర‌పు ఆకారంలో మరియు మరొకటి రౌండ్ డిస్‌ప్లేతో రానున్నాయి. బ్లూటూత్ SIG వెబ్‌సైట్ మాత్రం ప్రస్తుతం ఒక మోడ‌ల్‌ను మాత్రమే ధ్రువీక‌రించింది.

OnePlus Nord సిరీస్ నుంచి తొలి స్మార్ట్‌వాచ్.. స్పెసిఫికేష‌న్లు లీక్‌!

రాబోయే స్మార్ట్‌వాచ్‌ల స్క్రీన్ రిజల్యూషన్ గురించి కూడా కొన్ని రూమ‌ర్లు ఆన్‌లైన్‌లో తిరుగుతున్నాయి. రాబోయే OnePlus Nord వాచ్ దీర్ఘచతురస్రాకార మోడల్‌లు 240 x 280 మరియు 368 x 448 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు, వృత్తాకార డయల్ మోడల్‌లు 240 x 240 మరియు 390 x 390 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి.

ఇక హెల్త్ ప‌ర‌మైన ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, స్టెప్స్ ట్రాకర్, SpO2 సెన్సార్ మొదలైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉండే అవకాశం ఉంది. OnePlus Nord వాచ్‌లో కొన్ని వేరియంట్‌లకు GPS ఫీచ‌ర్ కూడా ఉండొచ్చ‌ని నివేదిక‌ల ద్వారా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అఫీషియల్ టీజర్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సి ఉంది.

 

OnePlus Nord Watchకు బ్లూటూత్ స‌ర్టిఫికేష‌న్‌!
వ‌న్‌ప్ల‌స్‌కు సంబంధించి ప్ర‌స్తుతం వార్త‌ల్లోకెక్కిన ఈ స్మార్ట్‌వాచ్ విడుద‌ల అయితే.. ఇది OnePlus Nord బ్యానర్‌లో మొదటి స్మార్ట్‌వాచ్ అవుతుంది. అధికారిక OnePlus వెబ్‌సైట్‌లో కూడా గుర్తించబడింది. అంతేకాకుండా, ఈ రాబోయే OnePlus Nord వాచ్ తాజాగా బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ లేదా SIG ద్వారా కూడా ధృవీకరించబడింది.

OnePlus Nord వాచ్ మోడల్ నంబర్ OPBBE221తో గుర్తించబడిన‌ట్లు తెలుస్తోంది. ఇది బ్లూటూత్ v5.2కి మద్దతు ఇస్తుందని తాజాగా రూమ‌ర్లు నిర్ధారిస్తున్నాయి. ఇవి కాకుండా, బ్లూటూత్ SIG స‌ర్టిఫికేష‌న్‌ వెబ్‌సైట్ ఇతర వివరాలను వెల్లడించలేదు. రాబోయే OnePlus Nord వాచ్ భారతీయ BIS వెబ్‌సైట్‌లో కూడా గుర్తించబడింది.

Best Mobiles in India

English summary
OnePlus Nord Watch's Specifications leaked ahead of watch launch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X