OnePlus Pad 2 వన్‌ప్లస్ నుంచి త్వరలో ట్యాబ్లెట్ విడుదల.. కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్.!!
వన్‌ప్లస్ ప్యాడ్ 2 త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్యాడ్ గత సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయిన వన్ ప్లస్ ప్యాడ్ కు తర్వాత తరం వెర్షన్ గా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే పాత మోడల్ కంటే అనేక అప్ గ్రేడ్‌లను కలిగి ఉండనుంది. అయితే ఈ ప్యాడ్ 2 పై (Oneplus Pad 2) సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ ట్యాబ్లెట్ గీక్ బెంచ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్‌లో కనిపించింది.
దీని ద్వారా ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2 గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. OPD2404 మోడల్ పేరుతో కనిపించింది. దీని ఆధారంగా త్వరలో అందుబాటులోకి రానుందని భావిస్తున్న వన్‌ప్లస్ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ ఆధారిత OS ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్ ప్యాడ్ 2 ఈ సంవత్సరం రెండో భాగంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్యా్డ్ 2 తోపాటు వన్‌ప్లస్ వాచ్ 3 కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానున్నాయనే సమాచారాన్ని వెల్లడించలేదు.
అయితే వన్‌ప్లస్ ప్యాడ్ 2.. ఒప్పో ప్యాడ్ 3 తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒప్పో ప్యాడ్ 12.1 అంగుళాల 3k LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుందని సమాచారం. ఈ ట్యాబ్లెట్ 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీని కలిగి ఉంటుందని సమాచారం.
వన్‌ప్లస్ నుంచి జూన్ 3వ తేదీన వన్‌ప్లస్ 12 గ్లేసియల్ వైట్ కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ జూన్ 6 నుంచి కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్‌లు సహా అమెజాన్ మరియు ఇతర భాగస్యామ్య స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 12GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999 గా ఉంది.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు జూన్ 6 నుంచి 20వ తేదీ వరకు రూ.2000 అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.12000 తగ్గింపును పొందవచ్చు. మరియు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








