Home
Gadgets

OnePlus స్మార్ట్‌వాచ్ గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఇవే!!!

వన్‌ప్లస్ సంస్థ ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌లనే కాకుండా గత సంవత్సరం నుండి ఇతర ఉత్పత్తులను కూడా వైవిధ్యభరితంగా ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలు మరియు వైర్‌లెస్ ఇయర్‌బడ్లను తయారుచేసిన తరువాత సంస్థ ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లను కూడా ఇండియా మార్కెట్ లో విడుదల చేస్తున్నది. వాస్తవానికి వన్‌ప్లస్ సంస్థ వన్‌ప్లస్ 8T సిరీస్ స్మార్ట్‌వాచ్ ను విడుదల చేయనున్నది. ఈ స్మార్ట్ డివైస్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ డిజైన్

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ డిజైన్

వన్‌ప్లస్ సంస్థ చాలాకాలంగా తన సొంత స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసే ఆలోచనతో ఉంది. 2016 లో మొదటిసారిగా వన్‌ప్లస్ సంస్థ స్మార్ట్‌వాచ్‌ యొక్క డిజైన్లను కూడా పూర్తి చేసిందని ప్రకటించింది. ఏదేమైనా సాంకేతిక పరిమితుల కారణంగా కంపెనీ ఆ సమయంలో వెనక్కి తగ్గింది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా తన స్మార్ట్‌వాచ్‌ను ఇండియా యొక్క మార్కెట్ లో విడుదల చేయాలని ఉన్నది.

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ సంస్థ తన స్మార్ట్‌వాచ్‌ను ఒప్పో సంస్థతో కలిసి హోంవర్క్ చేస్తున్నది. ఒప్పో సంస్థ ఇటీవల భారతదేశంలో ఒప్పో వాచ్‌ను దాదాపు 14,000 రూపాయల నుండి ప్రారంభించింది. వన్‌ప్లస్ యొక్క సరికొత్త స్మార్ట్ పరికరాలు ఒప్పో మరియు వివో ఉత్పత్తులపై ఆధారపడి ఉంటాయి కాబట్టి దీని యొక్క స్మార్ట్ వాచ్ ఒప్పో వాచ్ యొక్క ఫీచర్లను కలిగి ఉండవచ్చు అని అంచనా. వన్‌ప్లస్ వాచ్‌లో వంగిన డిస్ప్లే అంచులు మరియు గూగుల్ వేర్ OS ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగించదు.

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 4100 చిప్ ఫీచర్స్

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 4100 చిప్ ఫీచర్స్

వన్‌ప్లస్ నుండి రాబోతున్న స్మార్ట్‌వాచ్‌ యొక్క ఫీచర్లపై కొన్ని కఠినమైన అంచనాలను వేయవచ్చు. వన్‌ప్లస్ వాచ్ యొక్క SoC కోసం ఒప్పో వాచ్ లో ఉపయోగించే అదే స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 ను ఉపయోగించవచ్చు. మరోవైపు కొత్త స్నాప్‌డ్రాగన్ వేర్ 4100 చిప్ ను కూడా ఉపయోగించవచ్చు అని రూమర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా గూగుల్ వేర్ ఓఎస్‌పై కూడా ఆధారపడవచ్చు. అయినప్పటికీ సున్నితమైన యానిమేషన్లు మరియు మినిమలిస్ట్ UI తో కస్టమ్ ఆక్సిజన్ OS- ప్రేరేపిత స్కిన్ ను ఆశించవచ్చు.

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ vs ఆపిల్ స్మార్ట్‌వాచ్

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ vs ఆపిల్ స్మార్ట్‌వాచ్

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్‌ పొజిషనింగ్ విషయానికి వస్తే శామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్‌లతో పాటు చౌకైన ఆపిల్ వాచ్ మోడళ్లతో పోటీ పడగలదు. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్లేస్ లో ఈ ఏడాది వన్‌ప్లస్ సంస్థ ఆపిల్, శామ్‌సంగ్‌ సంస్థలకు గట్టి పోటీని ఇవ్వనున్నది. అందువల్ల ఇండియాలో స్మార్ట్‌వాచ్‌ మార్కెట్ లో పోటీ మరింత రసవత్తరంగా మారనున్నది.

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ ఇండియాలో  లాంచ్ డేట్

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ ఇండియాలో  లాంచ్ డేట్

వన్‌ప్లస్ వాచ్ ప్రస్తుతానికి పేరు మాత్రమే అయినప్పటికీ 2020 చివరిలో ఇండియాలో లాంచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంస్థ సాధారణంగా ఈ సమయంలో తన స్టాండర్డ్ టి-సిరీస్ ఫోన్‌లకు అప్ డేట్ లను ప్రారంభిస్తుంది. అందువల్ల వాచ్ అప్‌గ్రేడ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఉంటుంది. అదనంగా వన్‌ప్లస్ సంవత్సరం తరువాత చౌకైన నార్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో కూడా రావచ్చు.

Best Mobiles in India

English summary
OnePlus Smartwatch Features Leaked on Online: What to Expect?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X