వన్‌ప్లస్ టీవీ 40 Y1 లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ వివరాలు ఇవిగో...

|

వన్‌ప్లస్ కంపెనీ ఇండియాలో స్మార్ట్ టీవీ రంగంలో Y-సిరీస్‌లో సరికొత్త మోడల్‌గా వన్‌ప్లస్ టీవీ 40 Y1 విడుదల చేసింది. ఈ సిరీస్ కంటే ముందు 32-అంగుళాలు మరియు 43-అంగుళాల మోడల్‌ను సంస్థ విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ రెండు మోడల్‌ల మధ్య కొత్తగా 40-అంగుళాల మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టీవీ 40-అంగుళాల డిస్‌ప్లే, మూడు వైపులా స్లిమ్ బెజెల్స్‌తో 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి, డాల్బీ ఆడియోకు మద్దతు ఇచ్చే 20W స్పీకర్లు వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ టీవీ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లేతో రన్ అవుతూ అంతర్నిర్మిత Chromecast తో లభించే వన్‌ప్లస్ టీవీ 40 Y1 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ టీవీ 40 Y1 ఇండియాలో రూ.23,999 ధర వద్ద కేవలం బ్లాక్ కలర్ లో అందించబడుతుంది. ఇది జూన్ 1 నుండి వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. SBI క్రెడిట్ కార్డ్ యొక్క వినియోగదారులు EMI లావాదేవీలతో రూ.1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎంచుకున్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై కూడా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. SBI బ్యాంక్ మరియు బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డుల యూజర్లకు ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు లభిస్తాయి.

వన్‌ప్లస్ టీవీ 40 Y1 స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ టీవీ 40 Y1 స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ టీవీ 40 Y1 ఆండ్రాయిడ్ టీవీ 9 ఆధారిత ఆక్సిజన్ ప్లేలో రన్ అవుతుంది. ఇది 40-అంగుళాల ఫుల్-హెచ్‌డి డిస్ప్లేని 1920x1,080 పిక్సెల్స్, 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో స్లిమ్ బెజెల్స్‌ నిర్మాణంతో వస్తుంది. అంతకాకుండా ఇది 93 శాతం DCI-P3 కలర్ స్పేస్ కవరేజీని కలిగి ఉంది. ఇది సంస్థ యొక్క గామా ఇంజిన్‌తో రన్ అవుతూ వీడియో కంటెంట్ యొక్క రియల్-టైమ్ ఆప్టిమైజేషన్‌ను అందిస్తుంది.

వన్‌ప్లస్ టీవీ 40 Y1 ఫీచర్స్

వన్‌ప్లస్ టీవీ 40 Y1 టీవీ 64-బిట్ ప్రాసెసర్‌తో పనిచేస్తూ 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇది 20W డాల్బీ ఆడియో మద్దతుతో రెండు ఛానల్ స్పీకర్లను కలిగి ఉంది. ఇది గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు యాక్సిస్ ను అందించడంతో పాటుగా అంతర్నిర్మిత Chromecast ఫీచర్ ను కలిగి ఉంది. వన్‌ప్లస్ టీవీ 40 Y1 అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లకు మద్దతును ఇస్తుంది.

వన్‌ప్లస్ టీవీ 40 Y1 కనెక్టివిటీ

వన్‌ప్లస్ టీవీ 40 Y1 టీవీ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో సింగిల్-బ్యాండ్ 2.4GHz వై-ఫై, బ్లూటూత్ వి 5, ఈథర్నెట్ పోర్ట్, రెండు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు మరియు రెండు యుఎస్‌బి పోర్ట్‌లు ఉన్నాయి. ఇందులో యాంటీ అలియాసింగ్, సౌండ్ లెస్, డైనమిక్ కాంట్రాస్ట్ మరియు కలర్ స్పేస్ మ్యాపింగ్ ఉన్నాయి. కొలతలు పరంగా, టీవీ 892x86x513 మిమీ కొలుస్తుంది మరియు స్టాండ్ లేకుండా 5.1 కిలోల బరువు ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌తో టీవీని నియంత్రించడానికి మీరు వన్‌ప్లస్ కనెక్ట్ అనువర్తనాన్ని ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

English summary
OnePlus TV 40Y1 Smart TV Released in India: Price, Specs, Features, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X