టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న వన్‌ప్లస్,మొదటి టీవీ 2019లో లాంచ్

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న చైనా దిగ్గజం వన్‌ప్లస్ ఇప్పుడు టీవీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలిని చూస్తోంది.ఈ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తుంది.

|

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న చైనా దిగ్గజం వన్‌ప్లస్ ఇప్పుడు టీవీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలిని చూస్తోంది.ఈ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తుంది.ఈ నేపథ్యంలో 2019 మధ్యలో తమ మొదటి టీవీను మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

 

జియో అదిరిపోయే ఆఫర్, 90 రోజుల పాటు ఉచిత మ్యూజిక్జియో అదిరిపోయే ఆఫర్, 90 రోజుల పాటు ఉచిత మ్యూజిక్

స్మార్ట్ టీవీలకు  డిమాండ్....

స్మార్ట్ టీవీలకు డిమాండ్....

స్మార్ట్ టీవీలకు మార్కెట్లో అంతకంతకు డిమాండ్ పెరిగిపోతోన్న నేపథ్యంలో తన స్మార్ట్ టీవీలను 2019లో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వన్‌ప్లస్ సీఈఓ పీట్ లావు తెలిపారు . తాము పరిచయం చేయబోతోన్న స్మార్ట్‌టీవీ టెక్నాలజీ తదుపరి లెవల్ ఇంటెలిజెంట్ కనెక్టువిటీతో, బెస్ట్ క్వాలిటీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుందని ఈ సందర్బంగా అయన తెలిపారు.

క్రికెట్‌ ప్రపంచ కప్‌...

క్రికెట్‌ ప్రపంచ కప్‌...

క్రికెట్‌ ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని మే నెలలోనే రిలీజ్‌ చేయాల్సి ఉన్నింది అయితే స్థాయికి తగ్గ ప్రొడక్ట్‌ను తయారు చేయకపోవడంతో కచ్చితమైన తేదీని నిర్ణయించలేదని పీట్ లావు తెలిపారు.

టీవీ సేల్స్‌ కూడా అమెజాన్‌ ద్వారానే....
 

టీవీ సేల్స్‌ కూడా అమెజాన్‌ ద్వారానే....

వన్‌ప్లస్‌ మొబైల్స్‌లాగే, టీవీ సేల్స్‌ కూడా అమెజాన్‌ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. వన్‌ప్లస్‌ మొబైల్‌తో అనుసంధానం చేసేలా టీవీని తయారుచేస్తున్నట్లు సమాచారం. అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీస్‌ ద్వారా సినిమాలు, షోలు చూసే సౌలభ్యం కల్పించనున్నారు.

షియోమికి గట్టి పోటీ ఇవ్వనుంది.....

షియోమికి గట్టి పోటీ ఇవ్వనుంది.....

స్క్రీన్ సైజు, ఆపరేటింగ్ సిస్టం వంటి వాటి వివరాలను అయితే ఇప్పటి వరకు వెల్లడించలేదు. కాగా, స్మార్ట్ రంగంలో భారత మార్కెట్‌ను ఏలుతున్న చైనీస్ మేకర్ షియోమికి వన్‌ప్లస్ టీవీ రంగంలోనూ గట్టి పోటీ ఇవ్వనుంది.

Best Mobiles in India

English summary
OnePlus TV India launch likely around mid 2019, will be exclusively sold through Amazon India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X