OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 (MWC 2024) ఈవెంట్‌లో వన్ ప్లస్ వాచ్ 2 విడుదల అయింది. తాజాగా ఈ వాచ్ 2 కొత్త వేరియంట్ నార్డిక్ బ్లూ ఎడిషన్ ( OnePlus Watch 2 Nordic Blue Edition ) లాంచ్ అయింది. ఇప్పటికే ఈ వాచ్ బ్లాక్ స్టీల్, రేడియంట్ స్టీల్ వేరియంట్ రంగుల్లో అందుబాటులో ఉంది.
వన్ ప్లస్ వాచ్ 2 కొత్త కలర్ వేరియంట్ యూరోపియన్ దేశాల్లోనే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ధర EUR 349 ( భారత కరెన్సీ ప్రకారం రూ.31,174 ) గా ఉంది. అయితే భారత్‌లో ఈ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల కానుందా లేదా అనే సమాచారం సంస్థ వెల్లడించలేదు.

వన్‌ప్లస్ వాచ్ 2 ఫీచర్లు:
వన్‌ప్లస్ వాచ్ 2.. స్మార్ట్‌వాచ్ 466*466 పిక్సల్ రిజల్యూషన్ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ WS జెన్ 1 మరియు BES2700 డ్యూయల్ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజీ తో జతచేయబడి ఉంటుంది. మరియు గూగుల్ WearOS 4 పైన పనిచేస్తుంది.
ఈ వన్ ప్లస్ వాచ్ 2 స్మార్ట్ వాచ్ 500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. స్మార్ట్ మోడ్‌లో 100 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. అదే ఇతర సమయాల్లో 48 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కేవలం 60 నిమిషాల్లో ఈ వాచ్‌ను ఛార్జింగ్ చేయవచ్చు. 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఒక రోజంతా వినియోగించుకోవచ్చు.
ఈ వాచ్ 2 స్మార్ట్ వాచ్ 5 ATM మరియు IP68 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా వస్తుంది. ఈ వాచ్ అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంది. మరియు 100 కంటే ఎక్కువ స్పోర్ట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ కాలింగ్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS లను కలిగి ఉంటుంది.
అయితే వన్ ప్లస్ వాచ్ 2 నార్డిక్ బ్లూ ఎడిషన్ (OnePlus Watch 2 New Variant) భారత్‌లో విడుదలపై సంస్థ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్లాక్ స్టీల్, రేడియంట్ స్టీల్ కలర్ వేరియంట్‌ల ధర రూ.24,999 గా ఉంది. త్వరలో ఈ వేరియంట్ విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications